For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టంగ్ టై పిల్లల పై ఎటువంటి ప్రభావం చూపుతుంది?

టంగ్ టై పిల్లల పై ఎటువంటి ప్రభావం చూపుతుంది?

|

టంగ్ టై అనే వైద్య పరిస్థితిలో, బిరుసైన లేదా దట్టమైన కణజాలం నాలుక చివరి భాగం యొక్క కోన నుండి నోటి యొక్క అడుగు భాగం వరకు పగ్గం వలె ఏర్పడి, పిల్లలకు చనుబాలు తాగడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

టంగ్ టై స్వతహాగా పుట్టుకతో లేదా జన్యుసంక్రమణ వలన వస్తుంది. ఇది సహజంగా ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ సభ్యులలో కనపడుతుంది.

అసలు ఈ వ్యాధి కలగడానికి కారణాలు ఏమిటనేవి ఇదమిద్దంగా తెలియనప్పటికిని, కొన్ని పరిస్థితులలో జన్యు కారకాల వలన సంభవించినట్టు చెప్తుంటారు.

How Can Tongue Tie Affect Baby

టంగ్ టై పర్యవసానాలు:

చనుబాలు ఇవ్వడంలో ఇబ్బందులు:

సాధారణంగా, చనుబాలు తాగేటప్పుడు బిడ్డలు తమ డవడలు, నాలుక సహాయంతో ఒత్తిడి కలిగించి పాలను జుర్రుకుంటారు. కానీ, టంగ్ టై సమస్య ఉన్న పిల్లలు, తన నాలుకను తల్లి యొక్క వక్షాన్ని పట్టుకునేందుకు వీలుగా మలచుకోలేకపోవడం వలన పాలను జుర్రలేక, చనుమొనను నాకుతూ లేదా కరచిపెట్టుకుని ఉండిపోతారు. దీనివలన చనుమొనలో నొప్పి కలుగుతుంది. పైగా తాగని కారణంగా పాలు ఊరడం తగ్గిపోతుంది. తగినన్ని పాలు తాగనందున పోషకాలు అందక బిడ్డ ఎదుగుదల దెబ్బతింటుంది.

బిడ్డ చనుబాలు తాగుతున్నప్పుడు చప్పుళ్ళు చేస్తుంటారు

నాలుక నోటి దిగువ భాగానికి అంటిపెట్టుకుని ఉండటం వలన మరియు తల్లి పాలు తాగుతున్నప్పుడు బిడ్డ యొక్క దవడల కదలికల వలన, బిడ్డల బుగ్గలు సొట్టపడటం లేదా చప్పరిస్తున్న శబ్దాలు చేయడం కనపడుతుంది. దవడ వణకడం కూడా కనిపిస్తుంది. నాలుక అతుక్కుని వుండటం వలన వారు తల్లి పాలు లేదా సీసా పాలు తాగడానికి ఇష్టపడరు.

How Can Tongue Tie Affect Baby

నెమ్మదిగా బరువు పెరుగుతారు:

చనుబాలను నోటితో సరిగా కరచుకో లేకపోవటంచేత, లేదా ఇబ్బంది మూలంగా పాలు తాగడానికి విముఖత చూపటం వలన, తల్లి పాలు ద్వారా అందవలసిన పోషణ అందక బిడ్డలో ఎదుగుదల సక్రమంగా మరియు స్థిరంగా ఉండదు. దీని వలన వీరు బరువు తక్కువగా ఉంటారు. దీని వలన ఆహారం మింగడం, తినడం మరియు మాట్లాడటంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు. దీని వలన కొన్నిసార్లు బిడ్డలో తక్కువ బరువు ఉండటంతో, శ్వాస సమస్యలు, హృదయ సంబంధిత సమస్యలు, నరాల బలహీనత,ఎనీమియా,జన్యుపరమైన ఇబ్బందులు, కండరాలు అతిగా లేదా తక్కువగా ఎదగడం లేదా టంగ్ టైని కనిపెట్టలేకపోవడం వంటి శారీరక దృఢత్వ సమస్యలు తలెత్తుతాయి.

టంగ్ టై యొక్క ప్రభావాలు:

ఆహారాన్ని మింగడం కష్టమవుతుంది:

టంగ్ టై సమస్య ఉన్న పిల్లలకు ఏవైనా ముక్కలా ఉన్న ఆహారపదార్ధాలను మింగడం కష్టమవుతుంది. నాలుక నోటి అంచుల వరకు అటూ ఇటూ సులువుగా కదలలేకపోవటం వలన ఆహారాన్ని కలపడం, గొంతులోకి నెట్టడం కష్టమవుతుంది. తిన్నాక వారి పెదవుల లోపలి అంచులు లేదా పళ్ళను నాలుకతో ఆహారపదార్ధాల యొక్క అవశేషాలు మిగలకుండా శుభ్రం చేసుకోవడానికి వీలుపడదు. అంతే తింటున్న సమయంలో వారి నోటినుండి ఆహారం లేదా చొంగ కారవచ్చు.

మాట్లాడటంలో ఇబ్బందులు:

కొంతమంది ఈ సమస్య వలన దైనందిన జీవితంలో పెద్దగా మార్పు లేనప్పటికీ, కొందరికి చాలా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. పాలు తాగడంలోనే కాక మాట్లాడటానికి కూడా ఇబ్బంది కలగవచ్చు. వారు మాట్లాడేది ఇతరులకు అర్ధం కాకపోవచ్చు. కేవలం ఆ బిడ్డతో మసలే కుటుంబ సభ్యులు మాత్రమే అర్ధం చేసుకోగలరు. ట, జ,స,డ, త,ల మరియు ర వంటి శబ్దాలు చేయడంలో ఇబ్బంది తలెత్తుతుంది.

How Can Tongue Tie Affect Baby

నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది:

టంగ్ టై ఉన్న పెద్దలు లేదా ఎదిగిన పిల్లల్లో, ఎనామెల్ ను అంటిపెట్టుకుని ఉన్న ఆహార అవశేషాలను నాలుకతో శుభ్రం చేసుకోలేరు. కనుక అవి నోట్లోనే ఉండిపోతాయి. దీని వలన చిగుళ్లు మరియు దంతాలకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. పళ్లు ఊడటం లేదా ముందుకున్న పళ్ళ వెనుక ఖాళీ భాగంలో ప్రభావం కనిపించడం జరుగుతుంది.


కొన్నిరకాల పనులు చేయడానికి లేదా ఆడుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి: ఈ సమస్య ఉన్న పిల్లలు ఐస్ క్రీమ్ చప్పరించడం లేదా కోన్ కొరకడం సులువుగా చేయలేరు. బెలూన్లలో గాలిని నింపడం, సబ్బునీటిలోకి గాలిని ఊదటం ద్వారా బుడగలు చేయటం వంటివి ఈ పిల్లలు చేయలేరు. తల్లితండ్రులు ఇటువంటి సమస్యల విషయంలో పరిష్కారానికి వైద్యుని సంప్రదించాలి.

పరిష్కారాలు:

టంగ్ టైకి సంబంధించి అనేక చర్చలు జరిపారు. కొంతమంది వైద్యులు శస్త్ర చికిత్స అత్యుత్తమ పరిష్కారంగా సిఫార్స్ చేస్తారు. దీనికై చేసే శస్త్ర చికిత్సలు రెండు రకాలు- ఫ్రేన్యులోప్లాస్టీ మరియు ఫ్రెనాటమీ

పిల్లల నోటిని గమనించి, పరిస్థితిని అంచనా వేసి,ఈ విషయంలో మీకు వైద్యులు తగిన నిర్దేశం చేస్తారు. మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, దీని తీవ్రత పిల్లలందరిలో ఒకే విధంగా ఉండదు. శస్త్ర చికిత్స ఉత్తమ ఫలితాలు ఇస్తుందని తల్లితండ్రులు గుర్తించాలి.మీ పిల్లలకు ఏది సరైనదో నిర్ణయం తీసుకునే అవకాశం మీకే అందరికన్నా ఎక్కువగా ఉంది.

English summary

How Can Tongue Tie Affect Baby

Tongue-tie is a clinical condition in which an unusually brief, tight or thick band of tissue tethers the lowest part of the tongue's tip to the ground of the mouth, which can interfere with breastfeeding. It may possibly be genetic (regularly greater that one family member who has the situation).How Can Tongue Tie Affect A Baby
Story first published:Friday, July 6, 2018, 22:29 [IST]
Desktop Bottom Promotion