For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బేబీ చేత వేగంగా తేన్పించేలా చేయటం ఎలా - స్టెప్ బై స్టెప్ పద్ధతి

|

ప్రపంచంలో అన్నిటికన్నా అందమైనవి పసిపిల్లల మొహాలే. వారు చేసే ప్రతిదీ అందంగానే ఉంటుంది –అది ఎక్కిళ్ళైనా లేదా తేన్చటమైనా సరే. కానీ తనని చూసుకుంటున్న తల్లి లేదా ఇంకెవరైనా వారి సంరక్షణలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పాపాయిల చర్మం, అవయవాలు ఎంత చిన్నగా, సున్నితంగా ఉంటాయంటే, కొంచెం ముట్టుకున్నా ఎర్రబడిపోయి చర్మంపై ముడతలు కన్పిస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లల్లో కండరాలు, అవయవాలు అంత గట్టిగా ఉండవు కాబట్టి వారిని ఎత్తుకోడానికి కూడా కొన్ని ప్రత్యేక పొజిషన్లు ఉన్నాయి.

పాపాయికి పాలు పట్టటం కూడా కష్టమైన పనే. కానీ పాలు పట్టేసాక, ప్రతి తల్లి/తండ్రి తప్పక చేయాల్సిన పని- వారు తేన్చేలా చూడటం. అప్పుడే బేబీ శరీరంలో అదనంగా ఉన్న గాలి బయటకి వెళ్ళిపోయి, తల్లికి పాపాయి ఆకలి తీర్చానన్న సంతృప్తి కలుగుతుంది. ఆహారం తీసుకున్నాక బేబీ తేన్చకపోతే, తాగిన పాలను వాంతి చేసుకునే అవకాశం ఉంటుంది.

కానీ, మీరు అనుకున్నట్టు పసిపిల్లల చేత తేన్పించటం అంత సులువు కాదు. చంటిపిల్లల ప్రతి తేన్పులో ఒక అర్థం ఉంటుంది, చాలామంది తల్లిదండ్రులకి ఆ అవగాహన లేదు. చిన్న తేన్పులు అదనంగా బేబీ కడుపులో ఇరుక్కున్న గాలిని బయటకి వదిలేసి వారికి చికాకు లేకుండా సౌకర్యంగా ఉండేలా చేస్తుంది.

How To Make Your Baby Burp Faster: Step-by-Step Method

త్రేన్పులు రావటం వలన పాపాయి కడుపులో ఎక్కువ చోటు ఖాళీ అయి, మరింత ఆహారానికి చోటు ఉంటుంది. తరచూ వాంతులు చేసుకునే లేదా గాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జిఇఆర్ డి) ఉన్న పిల్లలకి చిన్న చిన్నగా తరచుగా ఆహారాన్ని అందించటంతో పాటు, తేన్పులు వచ్చేలా చేయటం కూడా మంచిది.

కానీ ప్రతి పాపాయి తేన్చాలన్నది కంపల్సరీ ఏం కాదు. కొంతమంది పసిపిల్లలు అదేపనిగా త్రేనుస్తూ ఉంటారు, ఇంకొందరు అస్సలు తేన్చరు. మీరు మీ బేబీతో ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి వారి అలవాట్లు, అవసరాలు తెలుసుకుని అలా ప్రవర్తించండి.

How To Make Your Baby Burp Faster: Step-by-Step Method

పసిపిల్లల చేత తేన్పించటం అంత సులువు మాత్రం కాదు. ఈ కింది స్టెప్స్ ను చదివి సులువుగా ఎలా తేన్పించాలో తెలుసుకోండి. చదవండి.

స్టెప్ 1 ; మీ పైన తేన్పు గుడ్డను వేసుకోండి

మీ భుజం లేదా ఒడిలో తేన్పు గుడ్డను బిడ్డను ఎక్కడ ఎత్తుకోవాలనుకుంటున్నారో అక్కడ వేసుకోండి. ఈ గుడ్డ నిజమైన తేన్పు క్లాత్ కావచ్చు లేదా మామూలు గుడ్డ కూడా కావచ్చు. ఇది ఒకవేళ మీ బిడ్డ కొంచెం ఉమ్మివేస్తుంటే మీ బట్టలు పాడవకుండా ఉపయోగపడుతుంది.

స్టెప్ 2 ; పాపాయిని సౌకర్యంగా మీ ఒడిలో చేర్చుకోండి లేదా ఎత్తుకోండి

మీ బేబీను సౌకర్యంగా మీ ఛాతీపై ఉంచుకుని వారి గడ్డం మాత్రం మీ భుజంపై ఉండేలా తల ఎత్తేలా చూసుకోండి. మీ చేతిని బేబీ నడుం దగ్గర వేసి,ఇంకో చేత్తో వీపుపై మెల్లగా జో కొట్టండి.ఇది మీరు, బిడ్డ ఏ పొజిషన్ లో సౌకర్యంగా ఉంటే అలా చేయవచ్చు. కొంతమంది పడకకుర్చీ వాడతారు, అది అలా మెల్లగా ఊగుతూ ఉంటే తేన్చే పని కూడా సులభంగా అవుతుందని నమ్ముతారు. మీరు నడుస్తూ కూడా ప్రయత్నించవచ్చు. కాకపోతే మీ స్పర్శ మాత్రం పాపాయిపై మృదువుగా,నెమ్మదిగా ఉండేలా చూసుకోండి.

How To Make Your Baby Burp Faster: Step-by-Step Method

స్టెప్ 3 ; బేబీ వీపుపై నెమ్మదిగా తట్టండి లేదా నెమ్మదిగా రుద్దండి

తర్వాత, మీ బేబీని ఒడిలో మెల్లగా గడ్డం దగ్గర ఒక చేయి, ఛాతీ దగ్గర ఇంకో చేయి వేసి పట్టుకుని ఉంచి నిలువుగా కూర్చోబెట్టండి. ఇలా చేస్తూ, మీ చేతిని బిడ్డ గొంతు దగ్గర గట్టిగా నొక్కుకోకుండా చూసుకోండి. బేబీతో ఉన్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఖాళీగా ఉన్న చేత్తో,వారి వీపుపై నెమ్మదిగా తట్టండి. గట్టిగా లేదా వేగంగా తట్టడం వలన తొందరగా తేన్పు ఏమీ రాదు. అందుకని మెల్లగా, నెమ్మదిగా తట్టడానికి ప్రయత్నించండి.

స్టెప్ 4 ; మీ బేబీని ఒడిలో బోర్లా పడుకోబెట్టుకోండి

ఇదయ్యాక,మీ బేబీని ఒడిలో బోర్లా పడుకోబెట్టుకోండి. పాపాయి తల మీ కాళ్ళకి పైన బయటకి ఉండేలా చూసుకోండి. తన గడ్డం,తన ఛాతీకన్నా కొంచెం ఎత్తులో ఉంచాలి. ఈ స్థితిలో బేబీ వీపును ఆపకుండా తడుతూ ఉండండి. ఈ పని మీకు కొంచెం అలసటగా అన్పించవచ్చు. కానీ మీ బిడ్డకి చేయాల్సిన సరైన పనులలో ఇది ఒకటి. ఆందోళన పడకండి, ప్రాక్టీసు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. అలసట, కాస్త కష్టం మొదట్లో అన్పిస్తుంది, తర్వాత మీకు అలవాటయిపోతుంది. ఇక తర్వాత స్టెప్ కి వెళదాం.

How To Make Your Baby Burp Faster: Step-by-Step Method

స్టెప్ 5 ; పాలిస్తున్నప్పుడు మీ బేబీ రెండుసార్లు తేన్చేలా చూడండి

పాల బాటిల్ తో పాలు తాగే బేబీకి ఎక్కువ గాలి తీసుకుని,తొందరగా కడుపు నిండుతుంది. తల్లిపాలు తాగే బిడ్డ బాటిల్ తో తాగే బేబీకన్నా తక్కువ గాలి పీల్చుకుంటుంది. బేబీ రెండుసార్లు తేన్చడం తప్పనిసరి- ఒకటి పాలిచ్చేముందు, రెండవసారి పాలిచ్చాక. పాలు తాగేటప్పుడు బిడ్డ ఎక్కువ గాలి మింగేస్తే వారికి తొందరగా కడుపు నిండుగా అన్పిస్తుంది కానీ సరిపోయేంత ఆహారం తీసుకోలేరు. బాటిల్ తో పాలు తాగిన బిడ్డకి తాగుతున్నప్పుడు 2-3సార్లు తేన్పులు రావటం అవసరం. తల్లిపాలు తాగుతున్న బేబీ విషయంలో, తల్లి పాలివ్వడానికి తన స్తనాలను మార్చినప్పుడల్లా తేన్చేలా చేయాలి.

మీ బిడ్డ పాలు తాగుతున్నప్పుడు వారు అసౌకర్యంగా కన్పిస్తేనే వారిని తేన్చేలా చేయాలి. బేబీ ఆ సమయంలో చికాకుగా, స్తనం నుంచి దూరం జరిగిపోవటం ఇంకా ఏడుపు మొదలుపెట్టడమో చేస్తారు. అప్పుడే తేన్పించడానికి ప్రయత్నించండి. బాటిల్ తో పాలుపట్టాక, ప్రతి 2 నుంచి 3 ఔన్సులకి తేనుపు కోసం ప్రయత్నించండి.

అదే తల్లిపాలు పడుతున్నట్లయితే, స్తనాలు మార్చినప్పుడల్లా లేదా పాలు పడుతున్నప్పుడు బేబీని తేన్పించండి. అదే వారు నిద్రలోకి జారుకుంటుంటే లేదా కడుపు నిండుగా అన్పిస్తే తేన్చడం గురించి పట్టించుకోవక్కర్లేదు. వారి వయస్సు 4 నుంచి 6 నెలలు దాటాక పాలు తాగేటప్పుడు బేబీలు గాలి మింగటం తగ్గిస్తారు. అందుకని ఎప్పుడూ మీ బిడ్డ అలవాట్లను, అవసరాలను పరిశీలిస్తూ, వారికి తేన్చడం అవసరమో కాదో నిర్ణయించండి.

English summary

How To Make Your Baby Burp Faster: Step-by-Step Method

However, it is not compulsory that a baby should necessarily burp. There are babies who burp a lot and there are also others who do not burp at all. You can understand and learn the mannerisms and requirements of your baby and act accordingly. However this task of burping a baby might not be as easy as one might think. The below provided steps would make it quite easy for you however. Take a look.
Story first published:Friday, March 23, 2018, 17:36 [IST]
Desktop Bottom Promotion