For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాపాయి పాల సీసాలోని పాలను తాగేందుకు ఎందుకు నిరాకరిస్తుంది?

పాపాయి పాల సీసాలోని పాలను తాగేందుకు ఎందుకు నిరాకరిస్తుంది?

|

చంటిపిల్లలకు మొదటి ఆరునెలల వరకు తల్లిపాలనే పట్టాలని వైద్యులు మరీ మరీ చెబుతూ ఉంటారు. అయితే, అనేక కారణాల వలన కొందరికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అసాధ్యంగా మారవచ్చు. తల్లి యొక్క అనారోగ్య సమస్యలు లేదా పాపాయికి సంబంధించిన అనారోగ్య సమస్యల వంటివి బాటిల్ ఫీడింగ్ కి దారితీస్తాయి. కొన్ని సందర్భాలలో పాపాయికి బ్రెస్ట్ ఫీడింగ్ మరియు బాటిల్ ఫీడింగ్ కాంబినేషన్ ఇస్తారు. బ్రెస్ట్ మిల్క్ ను బాటిల్ లోకి తీసుకుని బేబీకి ఫీడ్ చేయడం ఇటువంటి కోవలోకే వస్తుంది. చాలా సార్లు, బాటిల్ ఫీడింగ్ వలన ఫాదర్ తో బాండింగ్ మెరుగవుతుంది. దీని వలన తల్లికి కొంత రెస్ట్ లభిస్తుంది.

బ్రెస్ట్ ఫీడింగ్ లో కొన్ని ఇబ్బందులు ఏ విధంగా ఎదురవుతాయో అదే విధంగా బాటిల్ ఫీడింగ్ లో కూడా కొన్ని రకాల ఛాలెంజెస్ ఎదురవుతాయి. కొంతమంది బేబీస్ కు బాటిల్ టెక్స్చర్ నచ్చకపోవచ్చు. ప్లాస్టిక్ నిపుల్ లేదా ఫార్ములా టేస్ట్ రుచించకపోవచ్చు. అటువంటి సందర్భాలలో, బేబీ బాటిల్ ను రిజెక్ట్ చేసి పాలను నిరాకరిస్తుంది. ఈ సమస్య వలన తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతారు.

 Reasons Why Your Baby Refuses To Feed On The Bottle

అదృష్టవశాత్తూ, కొంత ఆబ్సెర్వేషన్ తో ఈ సమస్యను అధిగమించవచ్చు. బేబీ బాటిల్ ఫీడింగ్ ను ఎందుకు వద్దనుకుంటుందో కారణాలను తెలుసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. చాలా సందర్భాలలో, ఇది తల్లితండ్రుల తప్పు కాదు. కొన్ని సందర్భాలలో, బేబీ తల్లిపాలనే కోరుకోవచ్చు. ఈ రోజు, బాటిల్ ఫీడింగ్ ని బేబీ ఎందుకు రీఫ్యూజ్ చేస్తుందో తెలుసుకుందాం. చదవండి మరి.

• బాటిల్ టెక్స్చర్ బేబీకి నచ్చకపోవచ్చు.

• బాటిల్ టెక్స్చర్ బేబీకి నచ్చకపోవచ్చు.

ప్లాస్టిక్ నిపుల్ ఫీల్ మరియు టెక్స్చర్ అనేది తల్లి బ్రెస్ట్స్ కంటే భిన్నంగా ఉంటాయి. అందువలన, ప్లాస్టిక్ బాటిల్ కి అలవాటు పాడటానికి బేబీకి కొంత సమయం అవసరపడుతుంది. బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ బాటిల్ పాలకు అలవాటు చేసేటప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. అటువంటి సందర్భాలలో, మీరు కొంత విరామం తీసుకుని ఆ తరువాత బాటిల్ తో పాలు పట్టడాన్ని ప్రయత్నించవచ్చు. రెగ్యులర్ ఇంటెర్వల్స్ లో బాటిల్ మిల్క్ ని ఇవ్వడం మరచిపోకండి.

• లైపేజ్ మోతాదు ఎక్కువవడం:

• లైపేజ్ మోతాదు ఎక్కువవడం:

కొన్నిసార్లు, తల్లిపాలలో సాధారణ మోతాదుకంటే ఎక్కువగా లైపేజ్ లభిస్తుంది. ఇది పాలలోని ఫ్యాట్ మొలిక్యూల్స్ ని బ్రేక్ చేయడానికి తోడ్పడుతుంది. పాలలోని లైపేజ్ మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పాలను బాటిల్ లోకి పంప్ చేసినప్పుడు బేబీకి ఆ పాలు రుచించకపోవచ్చు. బ్రెస్ట్ లోంచి పాలు డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఈ సమస్య ఎదురవదు. బాటిల్ లోకి పాలను పంప్ చేసినప్పుడే పాల రుచి లోని తేడా వస్తుంది.

• బాటిల్ ను తల్లి చేతిలోంచి అందుకోవడాన్ని బేబీ రీఫ్యూజ్ చేస్తుంది

• బాటిల్ ను తల్లి చేతిలోంచి అందుకోవడాన్ని బేబీ రీఫ్యూజ్ చేస్తుంది

తల్లి తన బిడ్డకు బాటిల్ తో పాలను పట్టేందుకు ప్రయత్నిస్తే ఆ బిడ్డ పాలను తాగేందుకు నిరాకరించవచ్చు. ఎందుకంటే, బేబీస్ తల్లిపాల వాసనను పసిగట్టేస్తారు. వారి సెన్స్ ఆఫ్ స్మెల్ గొప్పగా ఉంటుంది. అటువంటి సందర్భాలలో, బేబీ తల్లిపాలనే ప్రిఫర్ చేస్తుంది. అటువంటప్పుడు, కుటుంబసభ్యుల సహకారాన్ని తీసుకోండి. పాపాయికి తండ్రి చేత బాటిల్ పాలు అందించండి. అమ్మమ్మ, బామ్మ, తాతయ్యల చేత బాటిల్ తో పాలను పట్టించడం అలవాటు చేయండి. అటువంటప్పుడు, పాపాయి బాటిల్ పాలను నిరాకరించే సందర్భాలు తక్కువే.

• ప్లాస్టిక్ నిపుల్ షేప్ తో సమస్య ఎదురవవచ్చు:

• ప్లాస్టిక్ నిపుల్ షేప్ తో సమస్య ఎదురవవచ్చు:

మీరు మార్కెట్ లో బాటిల్ నిపుల్ ను కొనడానికి వెళ్ళినప్పుడు నిపుల్స్ లో రకరకాల సైజులు అలాగే షేప్స్ ఉండటం మీరు గమనించవచ్చు. బేబీ సక్ చేసే టెక్నీక్ బట్టి అలాగే బేబీ నోటిని బట్టి నిపుల్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ప్లాస్టిక్ నిపుల్ ను బేబీ ఇష్టపడకపోవచ్చు. ప్రస్తుతం బేబీ రీఫ్యూజ్ చేస్తున్న బాటిల్ నిపుల్ ను పక్కన పెట్టి కొత్త రకమైన ప్లాస్టిక్ నిపుల్ తో పాపాయికి పాలు పట్టేందుకు ప్రయత్నించండి.

• పాలకు అలర్జీ:

• పాలకు అలర్జీ:

కొంతమంది బేబీస్ ఫార్ములా మిల్క్ కు సెన్సిటివ్ గా ఉంటారు. అందువలన వారు బాటిల్ ఫీడ్ ను ఇష్టపడరు. వారు రీఫ్యూజ్ చేయనప్పుడు స్టమక్ పెయిన్, హైవ్స్ మరియు ఎగ్జిమా వంటి లక్షణాలను చూపిస్తారు. అటువంటి సందర్భాలలో, వైద్యునితో మాట్లాడి వైద్యుని కంఫర్మేషన్ తరువాత సోయా బేస్డ్ పాలు గానీ లేదా హైడ్రోలైసేట్ ఫార్ములా పాలు గాని అందించండి. బ్రెస్ట్ మిల్క్ తాగిన తరువాత కూడా బేబీస్ లో మిల్క్ పట్ల సెన్సిటివిటీ ఇంకా అలాగే ఉందంటే తల్లి కూడా డైరీ ప్రోడక్ట్స్ కి దూరంగా ఉండాలి.

 • చల్లటి పాలు :

• చల్లటి పాలు :

బేబీకి పాలను బాటిల్ ద్వారా పట్టేందుకు ప్రయత్నించేటప్పుడు బేబీ చల్లటి పాలను లేదా రూమ్ టెంపరేచర్ లో పాలను ఇష్టపడుతుందని మీరు భావించవచ్చు. నిజానికి, వెచ్చటి పాలనే పాపాయిలు ఇష్టపడతారు. బ్రెస్ట్ మిల్క్ కాస్తంత వెచ్చగా ఉండటం వలన బేబీస్ బ్రెస్ట్ ఫీడింగ్ నే ఇష్టపడతారు. వెచ్చటి పాలు పాపాయికి సూతింగ్ గా ఉంటాయి. చల్లటి పాలకంటే వెచ్చటి పాలు త్వరగా జీర్ణమవుతాయి. పాలను మైక్రోవేవ్ చేయడం మానుకోండి. ఎందుకంటే, మైక్రో వేవింగ్ వలన పాలు యూనిఫార్మ్ గా వేడెక్కవు. అందువలన, కొన్ని హాట్ స్పాట్స్ వలన బేబీకి మంట కలగవచ్చు. మైక్రో వేవింగ్ వలన పాలలోని న్యూట్రిషన్ అనేది తగ్గవచ్చు.

English summary

Reasons Why Your Baby Refuses To Feed On The Bottle

Just like breastfeeding comes with its set of difficulties, bottle feeding too has a set of challenges. Some babies do not like the feel and texture of bottles, the plastic nipple or the taste of the formula. In such cases, the baby may reject the bottle and may absolutely refuse to feed on it. This puts the baby's parents in a fix.
Desktop Bottom Promotion