Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
పిల్లలకు తరచుగా జలుబు చేస్తుందా? నెయ్యితో ఇలా చేస్తే క్షణాల్లో నయమైపోతుంది
చలికాలంలో పిల్లల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. ఈ కారణంగా, పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. చలికాలంలో తరచుగా దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న సమస్యలతో బాధపడుతుంటారు. వారిపై ఎంత శ్రద్ధ పెట్టినా ఇలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండలేరు.
చల్లటి గాలి వల్ల పిల్లలు రాత్రిపూట జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యల్లో ముఖ్యమైనది జలుబు. దీని కారణంగా పిల్లలు సరిగ్గా పడుకోలేరు కూడా. నిద్రపోయాక పిల్లల్లో ముక్కు మూసుకుపోయే సమస్య ఉంటుంది. ఈ సమస్య పిల్లల్లోనే కాదు పెద్దవారిలో కూడా కనిపిస్తుంది. పగటిపూట అలాంటి సమస్య లేకపోయినా, రాత్రిపూట ముక్కు దిబ్బడ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రోజూ పడుకునే ముందు మందు వేసినా రాత్రంతా ఈ సమస్య ఉంటుంది.

ఈ సమస్యలకు పరిష్కారమేంటంటే
1 సంవత్సరం కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, నెయ్యి ఇవ్వడం వలన రాత్రిపూట దగ్గు లేదా ముక్కు దిబ్బడకు కొంత ఉపశమనం పొందవచ్చు. అలా అని ఇది చాలా తరచుగా ఇవ్వకూడదు. చాలా మితంగా వైద్యుల సూచన మేరకు కొంచెం ఇవ్వడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జలుబు నివారణ మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే అవి చిన్న పిల్లల ఆరోగ్యానికి మంచివి కావు. అయితే, ఎసిటమైనోఫెన్ శిశువులు, పిల్లలకు మంచిగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఔషధాన్ని 4 నుండి 6 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఉపయోగించవచ్చు.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆస్పిరిన్ ఇవ్వకూడదు. ఇది రేయ్ సిండ్రోమ్ అనే సమస్యకు దారి తీస్తుంది. పిల్లలు పదే పదే జలుబు, ముక్కు కారడం, దగ్గుతో బాధపడుతుంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని, ఆలస్యం చేయకుండా తగిన వైద్యులకు చూపించాలన్నారు.
కొంతమంది ఈ జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ సమస్యలకు ఇంటి నివారణలను ఉపయోగిస్తారు. ఈ రకమైన ఇంటి నివారణలు కొన్నిసార్లు పని చేస్తాయి. కానీ చిన్న పిల్లలకు మాత్రం హోం రెమెడీస్ చేయడం కంటే డాక్టర్ దగ్గరకు వెళ్లడమే మేలు.
గమనిక: ఈ స్టోరీలో మేము చెప్పిన విషయాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు అందిన సమాచారం, పలు నివేదికల ఆధారంగా ఇవ్వబడింది. వీటిని మేము ధ్రువీకరించడం లేదు. అనుసరించే ముందు వైద్యులను సంప్రదించడం మేలు.



Click it and Unblock the Notifications