Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
First Happy Birthday Wishes for Baby : తొలిసారి పుట్టినరోజు జరుపుకునే వారికి ఇలా విషెస్ చెప్పండి...
తొలిసారిగా పుట్టినరోజు వేడుకలను జరుపుకునేవారికి ఇలా విషెస్ చెప్పండి.
ఎవ్వరూ ఔనన్నా కాదన్నా.. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన రోజుగా భావించే రోజే పుట్టినరోజు. ఈ లోకంలో మనుషులందరికీ ఉన్న సార్థకత అటువంటిది.

దీనిని పొందడం కూడా ఒక లక్కీ మ్యాటరే. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషికున్న తెలివితేటలు, సౌకర్యాలూ.. ఏ ఇతర జీవికీ లేవన్నది అక్షర సత్యం. పుట్టినరోజుల విషయానికొస్తే.. మీ వయస్సు ఎలా ఉన్నా.. అందమైన సందేశాలు లేదా శుభాకాంక్షలు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.

అయితే అన్ని పుట్టినరోజుల కంటే తొలి పుట్టినరోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆరోజు పిల్లల జీవితంలో మొదటి సంవత్సరాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంగా కుమారులు మరియు కూతుళ్లకు వారి పుట్టినరోజు అదనపు ప్రత్యేకతనిచ్చే కొన్ని ప్రేమపూర్వక మరియు మనస్సును హత్తుకునే మెసెజ్ లతో మీ ప్రియమైన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి...

జీవితంలో అత్యంత అద్భుతమైన
‘‘మీరు మా జీవితంలో అత్యంత అద్భుతమైన మరియు అందమైన బహుమతి''
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

ఎన్నో శిఖరాలను అధిరోహించాలని
‘‘భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ''
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

కోటి కాంతుల చిరునవ్వులతో
‘‘కోటి కాంతుల చిరునవ్వులతో ఆ దేవుడు నీకు నిండు నూరేళ్లు ఆయుష్షు ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తూ''
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

ఎప్పుడైనా అధైర్యపడితే
‘‘నీవు ఎప్పుడైనా అధైర్యపడితే మళ్లీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధమే అని తెలియజేస్తూ''
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ
‘‘నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ''
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

ఇలాంటి వేడుకలు
‘‘ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ''
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

నీ నవ్వు మన ఇంట్లో
‘‘నీ నవ్వు మన ఇంట్లో సంతోషాన్ని నింపింది.. నీ అడుగులు మన ఇంటికి లక్ష్మీని తీసుకొచ్చాయి. ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు''

నువ్వు తొలిసారిగా ‘అమ్మ’ అని
‘‘నువ్వు తొలిసారిగా ‘అమ్మ' అని పలికిన మాటలు నేను ఎప్పటికీ మరువలేను నాన్నా... నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను''

మీ వల్ల ప్రతిరోజూ
‘‘మీ వల్ల ప్రతిరోజూ మాకు ఒక అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ఒక అందమైన స్టార్ లా ఎదగండి''
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

మొత్తం ప్రపంచం.
‘‘మీరే మా మొత్తం ప్రపంచం. మీరు ఇప్పుడు ఒక పూర్తి సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నారు'' ఈ సందర్భంగా
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

అందమైన చిరునవ్వు
‘‘మీ అందమైన చిరునవ్వు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మాకు 365 రోజులు అనంతమైన ఆనందం మరియు చిరునవ్వు ఇచ్చినందుకు ధన్యవాదాలు!''
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

మీరు నిజంగా మా జీవితంలో
‘‘మీరు నిజంగా మా జీవితంలో మారువేషంలో వచ్చిన ఒక దైవదూత. మీరు మీ స్వచ్ఛమైన హృదయంతో ప్రపంచాన్ని గెలవండి.''
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

మా చిన్నారికి అప్పుడే..
‘‘మా చిన్నారికి అప్పుడే ఒక సంవత్సరం పూర్తయ్యింది. సమయం చాలా వేగంగా వెళ్తోంది. కానీ మీ పట్ల మాకు ప్రేమ అంతే ఎక్కువగా పెరుగుతుంది''
మీకు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు..!



Click it and Unblock the Notifications