Latest Updates
-
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా..
మగపిల్లాడా, ఆడపిల్లా అన్నది తల్లి ఆరోగ్యమే చెప్పేస్తుంది
ఓ బిడ్డకు జన్మనివ్వడం, తల్లి కావడం మధురమైన అనుభూతి. పెళ్లయ్యాక ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి ఆ భార్యభర్తలు కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. అప్పటి నుండి ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతారు. ఏ చిన్న పని కూడా చేయకుండా చూసుకుంటారు.
ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుండి అటు తల్లిదండ్రుల్లో ఇటు కుటుంబసభ్యుల్లో ఒక ప్రశ్న వస్తుంది. ఆడపిల్ల పుడుతుందా, మగ పిల్లాడు పుడతాడా అని చర్చించడం మొదలు పెడతారు. ఆడపిల్ల పుడితే ఆ పేరు, మగపిల్లాడు పుడితే ఈ పేరు అంటూ మాట్లాడుకుంటారు. డెలివరీ సమయంలో చాలా మంది తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారా అని అడిగే వారికంటే పాపనా, బాబునా అని అడిగేవారే ఎక్కువ ఉంటారు.

పుట్టబోయే బిడ్డ ఆడపిల్లనా, మగపిల్లాడా అని తెలుసుకోవాలనే ఆత్రుత చాలా మందిలో ఉంటుంది. అయితే డెలివరీకి ముందు దీని గురించి తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. అయితే తల్లి శారీరక లక్షణాలు, తన ఆరోగ్యాన్ని గమనిస్తే పుట్టబోయేది పాపనో, బాబో ఒక అంచనాకు రావొచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ లక్షణాలు:
శిశువు లింగం తల్లి అనుభవించే గర్భధారణ లక్షణాల తీవ్రతను చూపిస్తుంది. గర్భంలో ఆడ శిశువు ఉంటే ఆ గర్భిణీ మార్నింగ్ సిక్‌నెస్ ఎక్కువగా అనుభవిస్తుందని అంటారు. మగ శిశువు ఉంటే తల్లికి ఆకలి కోరికలు పెరుగుతాయని అంటారు.
తల్లి ఆరోగ్య పరిస్థితి:
గర్భంలోని శిశువు లింగం తల్లి ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. గర్భధారణ మధుమేహం మగ శిశువులు గర్భంలో ఎక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. మగ శిశువును మోస్తున్నప్పుడు ప్రీక్లాంప్సియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని కొద్దిగా పెంచుతాయి.
పుట్టుకతో వచ్చే సమస్యలు:
శిశువు లింగం జనన సమస్యల సంభావ్యతను ప్రభావితం చేస్తుంది. మగ శిశువులు బ్రీచ్ ప్రెజేంటేషన్ల అధిక రేటును కలిగి ఉంటారు. ఇది సిజేరియన్ డెలివరీ సంభావ్యతను పెంచుతుంది. మగ శిశువులతో ముందస్తుగా జన్మించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదాలు చాలా చిన్నవే. వీటి వల్ల తల్లి ఆరోగ్యంపై పడే ప్రభావం కూడా చాలా తక్కువ.
శిశువు లింగం తల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అయితే ఇది నిజమేనని చెప్పే శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి. గర్భధారణ లక్షణాలు, తల్లి ఆరోగ్య పరిస్థితులు, పుట్టుకతో వచ్చే సమస్యలు కొంత వరకు శిశువు యొక్క లింగాన్ని చెప్పగలవు. అయితే ఈ ప్రభావాలు, లక్షణాలు నామమాత్రమైనవే. అంటే వీటిని పెద్దగా గుర్తించలేరు చాలా మంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications