Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పిల్లలు పుట్టకపోయినా సరే...!
సంతాన సాఫల్యత లేకపోవటమనే పరిస్ధితికి నేటి రోజులలో పురుషులు, స్త్రీలు అలవాటు పడిపోతున్నారు. మీరు కనుక అటువంటి వారిలో ఒకరైతే, మీరు కూడా దానికి అలవాటు పడిపోవాలి. మరి ఇలా జీవించాలంటే మీరు కూడా అటువంటి స్ధితికి అలవాటు పడి మీపై మీరు జాలి చూపించుకోకుండా రాయిలా మారి ఆనందంగా జీవనం గడిపేస్తూ ఉండాలి. ఇక నీకు పిల్లలు పుట్టరు అన్న వార్త ఎలా తీసుకోవాలి...మొదటగా డాక్టర్లు చెప్పినపుడు దానిని నిర్ధారించుకోండి. కొన్ని అవసర పరీక్షలు చేయించాలి. అన్ని టెస్టులకు ఫలితం వచ్చేస్తే, అది కూడా నీవు ఇక గర్భవతివికావు అని వచ్చేస్తే, మీకు కడుపు ఎవరో కోసినట్లు అనిపిస్తుంది. జీవితం వ్యర్ధం అనిపిస్తుంది. జీవితంలో మజా అంతా పోయినట్లనిపిస్తుంది. అయినప్పటికి జీవితం ఒక వాస్తవం దానిని మీరు తిరస్కరించలేరని గ్రహించండి. కనుక దుఖ:పడి భవిష్యత్తును అంధకారం చేసుకోకండి. మరి ఆ పరిస్ధితులలో ఏం చేయాలనేది పరిశీలించండి.

సంతాన విఫలతకు చేయాల్సినవి....
1. ప్రపంచంలో ఏ పరీక్ష కూడా నూటికి నూరు శాతం ఖచ్చితం కాదు. కనుక మీరు గర్భవతి అవుతామన్న ఆశ ఎప్పటికి కలిగే ఉండండి.
2. గర్భవతిని అవుతానని ఆశపడుతున్నప్పటికి మరో పక్క అది అసాధ్యం అని వాస్తవంగా గ్రహించండి. ఈ విఫలతకు సరైన కారణం కొరకు అన్వేషించండి. ఏదేని పరిష్కారం ఉందని తెలిస్తే దానిని ఆచరించండి.
3. మీ భాగస్వామితో కష్టాన్ని పంచుకోండి. అతను కూడా అదే పరిస్ధితిలో బాధ పడుతూ ఉంటాడు. ఒక జంటగా ఈ అంశం ఇద్దరిని బాధిస్తుంది.
4. సంతానం కలగరనే వార్త మీకు ఎంతో బాధనిస్తుంది. కనుక ప్రశాంతంగా ఉండండి. పరిష్కారంగా ఐవిఎఫ్ చికిత్స టెస్ట్ ట్యూబ్ బేబీ వంటివి, దత్తత తీసుకోవడం మొదలైన అంశాలు పరిశీలించండి.
5. ఐవిఎఫ్, మొదలైనవి వ్యయంతో కూడినవి. కనుక అవసరమనుకుంటే ఆర్ధికంగా కూడబెట్టండి. లేదా బ్యాంకులు ఆర్ధిక సహాయం చేస్తాయా అనేది పరిశీలించండి.
6. దత్తత తీసుకోవడం చాలాకాలం జరిగే చట్టబద్ధ ప్రక్రియ దీనికి ఒక మంచి న్యాయవాది కూడా కావాలి. కొత్తగా దత్తతలో వచ్చే బిడ్డను సాకటానికి మీరు మానసికంగా కూడా సిద్ధ పడాలి.
7. పిల్లలు పుట్టరనే వాస్తవాన్ని మర్చి పోవటానికిగాను మీరు ఎపుడూ బిజీగా ఉండాలి. నిరాశపడి మానసిక ఆరోగ్యం పాడుచేసుకోకండి. సంతాన విఫలతలో మానసిక స్ధైర్యం కావాలి. మీరు ధైర్యంగా ఉండాలి. మీలో మీకు ఆత్మవిశ్వాసం కలిగి పార్టనర్ లేదా డాక్టర్ లేదా ఇతర శ్రేయోభిలాషుల సలహాలు పొందుతూండాలి. అన్నిటికి మించి ఈ సమస్య కలవారు మీరొకరే కాదని, ప్రపంచంలో ఇంకా ఇటువంటి వారు ఎంతోమంది ఉన్నారని, వారు కూడా తగిన పరిష్కారాలకై అన్వేషిస్తూ ఉంటారని, ధైర్యంగా జీవిస్తూ ఉంటారని గుర్తించండి. ఆశాభావంతో ముందుకుసాగండి. మీరు మీ పార్టనర్ వీలైనంత వరకు పరిష్కారాలను వెతుకుతూ బిజీగా ఉండి, పరిష్కారం దొరికిన నాడు ఆనందించండి.



Click it and Unblock the Notifications