Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వ్యాయామాలు గర్భం రాకుండా చేస్తాయా?

1. వ్యాయామం అనేది ఫలదీకరణ అంశాలకు ముడిపెట్టి లేదు. మీకు పిరీయడ్స్ కనుక రాకుంటే, గర్భం ధరించే అవకాశాలుంటాయి. కనుక, వ్యాయామాలు చేస్తే గర్భం రాదనే అపోహను తొలగించుకోండి. వ్యాయామాలు చేస్తే, శరీర పటుత్వం పెరిగి గర్భం ధరించే అవకాశాలు అధికంగా వుంటాయి.
2. నడక, స్విమ్మింగ్ వంటి ఆరోగ్యకరమైన సరళ వ్యాయామాలు మీ సంతానోత్పత్తి వ్యవస్ధను ఏ మాత్రం చెడుగా ప్రభావించవు. మహిళలు గర్భం ధరించేముందు లేదా గర్భం కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు కూడా ఈ వ్యాయామాలు చేయవచ్చు.
3. వ్యాయామం వలన కలిగే ప్రయోజనాలు మీ శరీరంలోని అండోత్సర్గం, పిరీయడ్ సంబంధి సమస్యలను తొలగిస్తాయి. అండోత్సర్గం రెగ్యులర్ గా జరగాలి దానికిగాను మీరు రెగ్యులర్ గా చేసే వ్యాయామం సహకరిస్తుంది. అయితే, మీరు చేసే వ్యాయామాలు ఎంపిక చేయబడినవిగా వుండాలి. బరువులు ఎత్తడం వంటివి మీ గర్భానికి సహకరించవు.
4. శరీరానికి శ్రమకలిగించే, బరువులు ఎత్తడం, డంబ్ బెల్స్ ఎత్తడం, పుష్ అప్ లు, మొదలైనవి మీ రుతుక్రమాన్ని ప్రభావిస్తాయి. ఈ వ్యాయామాలు మీ గర్భాశయాన్ని కూడా నష్టపరచే అవకాశం వుంటుంది. బలహీనం చేసి గర్భాన్ని ఆపుచేయవచ్చు. కనుక మీ పొట్టపై శ్రమపడే వ్యాయామాలు చేయకండి.
5. గర్భం ధరించకపోవటానికి వ్యాయామాలు కారణం కాకపోవచ్చు. మీకు సంతానోత్పత్తి వ్యవస్ధలో ఇతర సమస్యలుండవచ్చు. కనుక తగిన వైద్యులను సంప్రదించి కారణాలు పరిశీలించండి.
6. గర్భం ధరించడంలో, పురుషుడి పరంగా అతనిలోని వీర్యకణాల సంఖ్య కూడా అవసరమవుతుంది. ఫలదీకరణ సవ్యంగా జరగాలంటే, వీర్యకణాల సంఖ్య అధికంగానే వుండాలి. అపుడే ఫలదీకరణ త్వరితంగా జరిగి మీరు గర్భం ధరిస్తారు. కనుక వివిధ ఇతర కారణాల కొరకు వైద్యపరంగా సరైన వైద్యులను సంప్రదించండి. చేస్తున్న వ్యాయామాల కారణంగా గర్భం ధరించటంలేదనే నిర్ణయాలకు రాకండి.
మీరు గర్భం ధరించాలని ప్రయత్నిస్తూ అది రాకుంటే, గ్రహాలు బాగాలేదని వాటిని నిందించటం లేదా మీరు చేసే వ్యాయామాలు సరికానివని చెపటం సరికాదు. మీరు ఆచరించే అనారోగ్య జీవన విధానాల కారణంగా, చెడు అలవాట్ల కారణంగా కూడా గర్భం రాకపోవచ్చు. లేదా మీ సమీప బంధువులలో కూడా ఎవరికైనా పిల్లలు లేకపోవచ్చు. వారి పోలిక మీకు వచ్చి వుండవచ్చు. కనుక ఆరోగ్యకర జీవన విధానాలు ఆచరిస్తూ, ఆరోగ్యకర ఆహారాలు తింటూ, మీరు వాంఛించే గర్భం కొరకు ప్రయత్నించండి. అవసరమనుకుంటే, తగిన వైద్య సలహాలు పొందండి.



Click it and Unblock the Notifications