Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషులకు గర్భనిరోధక మాత్రలు పనిచేస్తాయా?

పురుషులకు గర్భనిరోధక నోటి మాత్రల ప్రయోజనాలు -
పురుషుల కొరకు కనిపెట్టబడిన ఈ నోటి మాత్రలు అధిక ప్రయోజనాన్నిస్తాయి. ఈ మాత్రలు కండోము లకంటే కూడా బాగా పనిచేస్తాయి. గర్భనిరోధక మాత్రల కారణంగా మహిళలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఈ సమయంలో పురుషులు తమవంతుగా గర్భ నిరోధక నోటి మాత్రలు వాడి ఆ లాభాలు పొందవచ్చు. ఈ పిల్స్ పురుషులు ధరించే కండోమ్ లకంటే కూడా బాగా పని చేస్తాయి.
సైడ్ ఎఫెక్టులు అసలే వుండవు - గర్భ నిరోధకతలు మహిళలు ఆచరించేకంటే, పురుషులే ఆచరిస్తే గర్భం సమస్యే వుండదు. ఈ మాత్రలు వేస్తే బరువు పెరగటం తప్పించి మరో సమస్య పురుషులలో వుండదు. నోటి మాత్రలు మహిళలు వాడితే వారికి వికారం, తలనొప్పి, కళ్ళు తిరగటం వంటి సమస్యలు వస్తున్నాయి. పురుషులకైతే బరువు పెరగటం మినహా మరో సమస్య వుండదని రీసెర్చి చెపుతోంది.
ఈ మాత్రలు ఎవరు తీసుకోవచ్చు? ఈ మాత్రలు పురుషులందరూ తీసుకోవచ్చు. అయితే, ఈ మాత్రలను ఇంకా పూర్తిగా పరీక్షించలేదని గుర్తుంచుకోండి. త్వరలో మార్కెట్ కు రానుంది. షుమారుగా ఒక డజను కండోముల ధరకు పిల్ దొరకవచ్చు. ధర కొంచెం అధికమైనా సమర్ధవంతమైన గర్భ నిరోధకతనిస్తుంది. కండోమ్ కంటే కూడా సురక్షితం.
పిల్ వలన నష్టాలేమిటి? మరచిపోకుండా దీనిని పురుషుడు ప్రతిరోజూ వేసుకోవాలి. అయితే, ఈ మాత్ర ఎయిడ్స్ లేదా సుఖ వ్యాధులనుండి రక్షణ నివ్వదు. కనుక సుఖ వ్యాధులు అధికమయ్యే అవకాశం వుంది. ఇంతకాలం కండోమ్ లు సుఖ వ్యాధులు రాకుండా కాపాడుతున్నాయి.
ఇది ఒకటి మాత్రమే నష్టం అనుకుంటే పురుషుల మాత్రలు బాగా పని చేస్తాయి. ఇంతకాలం మహిళలు మాత్రమే నోటి మాత్రలు వాడారు. ఇపుడు పురుషులకు కూడా అవి రావటంతో ఇకపై గర్భ నిరోధకత చాలా తేలికకాగలదు. పురుషుల మాత్రలు కూడా, మహిళల మాత్రలవలే బాగా ప్రాచుర్యాన్ని పొంది దేశ జనాభాను అరికట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తాయని ఆశిద్దాం.



Click it and Unblock the Notifications