Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అత్యవసర గర్భ నిరోధం ఎలా?

- కండోమ్ చినిగిపోయినా, లేదా అంగంనుండి జారిపోయినా, అతడు మీ యోనిలో స్కలనం చేసినా
- మీరు మీ బర్త్ కంట్రోల్ పిల్ మరచిపోయినా, మీ యోనిలో రింగ్ వేయకపోయినా లేదా ఇతర సాధనం వాడకపోయినా
- మీ డయాఫ్రం లేదా కేప్ దాని స్ధలం తప్పినా, అపుడు అతను మీ యోనిలో స్కలించినా
- మీరు మీ సురక్షిత దినాలను తప్పుగా లెక్క వేసి రతి చేసినా
- సరిగ్గా స్కలన సమయానికి అతను అంగం బయటకు తీయకపోయినా
- మీరు ఏ రకమైన బర్త్ కంట్రోల్ ఆచరించకపోయినా
- మీరు బలవంతంగా అసురక్షిత లైంగిక చర్యలు యోనిలో చేసినా లేక మానభంగం చేయబడ్డా గర్భం వద్దు అనుకుంటే ఎమర్జెన్సీ మార్నింగ్ ఆఫ్టర్ పిల్ తప్పక వాడాలి. ఈ పిల్ ప్లాన్ బి ఒన్ స్టెప్, ఎల్లా, మరియు నెక్ట్స్ ఛాయిస్ అనే బ్రాండ్ పేర్లతో కూడా తెలుపబడుతుంది.
చాలామంది సాధారణంగా ఈపిల్ ను మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అని పిలుస్తారు. కాని ఈ పేరు కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఈ మాత్రను రతి జరిగిన మరుసటి ఉదయమే కాక అయిదురోజులు వాడాలి.
అయితే, ఈ ఎమర్జెన్సీ మాత్రలను సాధారణ పిల్ లేదా ఇతర గర్భ నిరోధక సాధనాలవలే ఎంతో సమర్ధవంతంగా వుంటాయని భావించకండి. ఇవి ఎమర్జెన్సీకి మాత్రమే వాడాలి. అనుకోకుండా సెక్స్ జరిగిపోతే ...అదికూడా అసురక్షిత సెక్స్ జరిగితే వాడవచ్చు.
అత్యవసర గర్భ నిరోధక సాధనాలు సెక్స్ సంబంధిత సుఖ వ్యాధులనుండి రక్షిస్తాయని భావించకండి. అమెరికాలో రెండు రకాల ఎమర్జెన్సీ గర్భ నిరోధకతలుంటాయి. ఒకటి మార్నింగ్ ఆఫ్టర్ పిల్ కాగా మరొకటి కాపర్ టి.
మరి ఈ మార్నింగ్ ఆఫ్టర్ పిల్ ఎలా పని చేస్తుంది?
బర్త్ కంట్రోల్ పిల్ లో వుండే ప్రొజెస్టిన్ హార్మోన్ ఆధారంగానే ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ తయారు చేస్తారు. మన శరీరంలో తయారయ్యే రసాయనాలే హార్మోన్లు. అవి శరీరంలోని వివిధ భాగాలను నియంత్రిస్తాయి.
మార్నింగ్ ఆఫ్టర్ పిల్ లో వుండే హార్మోన్ మహిళ అండాశయం అండాన్ని రిలీజ్ చేయకుండా అంటే అండోత్సర్గం జరుగకుండా చేస్తుంది. అండం విడుదల కాకుండా వుంటే అది వీర్యంతో కలిసే అవకాశం లేదు. అంతేకాదు, ఈపిల్ లో వుండే హార్మోన్ మహిళలోని గర్భాశయ ద్రవాన్ని గట్టిపడేస్తుంది. ఆ మ్యూకస్ బాగా గట్టిపడి వీర్యం అండంతో కలవకుండా చేస్తుంది.హార్మోన్ మహిళ గర్భాశయ లైనింగ్ ను పలుచబడేస్తుంది.ఈ చర్య ఫలదీకరణ జరిగిన అండం గర్భాశయానికి అతుకుకొనకుండా చేస్తుంది. మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అబార్షన్ కూడా చేస్తుంది అంటారు కాని అది నిజం కాదు.



Click it and Unblock the Notifications