Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
వంధ్యత్వంలో భావోద్వేగ ప్రభావాలు!
జంటలు వారిలో ఏ ఒకరికి పిల్లలు కలగరని తెలిసినా ఎంతో బాధ పడతారు, ఒత్తిడికి గురవుతారు. జంటలపై వంధ్యత్వ ప్రభావం అనేక భావోద్వేగాలను కలిగిస్తుంది. మనిషి జీవితంలో తల్లి లేదా తండ్రి దశ ఎంతో కోరదగినది. అది పొందలేమని తెలిస్తే చాలు ఎంతో బాధ, నిరాశలు కలుగుతాయి. జీవితానికి అర్ధం లేదని భావిస్తారు. ఈ నిరాశ వారిని చివరకు ఉద్యోగాలపట్ల నిర్లక్ష్యం, జీవితాలను పాడు చేసుకోవడం వరకు తీసుకువస్తుంది. మరి ఈ వంధ్యత్వ సమస్యలకు మానసిక ప్రభావం ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం.

మహిళపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? జంటలో ప్రధానంగా మహిళపై దీని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. బాల్యం నుండి వివాహం వరకు ఒక యువతి ఎల్లపుడూ ఏదో ఒక రోజున తాను తల్లి కావాలనుకుంటుంది. ఒక మహిళ జీవితాన్ని తన బిడ్డే సార్ధక్యం చేయగలదు. పిల్లలు కలగని మహిళలలో వచ్చే డిప్రెషన్, కేన్సర్ లేదా గుండె జబ్బుల రోగులకు వచ్చే డిప్రెషన్ తో సమానంగా ఉంటుంది. కుటుంబంలో భావోద్వేగాలను నియంత్రించేది మహిళ. అటువంటి మహిళకు తాను తన భాగస్వామి కోరిక తీర్చలేకపోతే మరింత డిప్రెషన్ కు గురి అవుతుంది. పురుషుడి మానసిక స్ధితి ఎలా ఉంటుంది? ఈ రకమైన సున్నిత అంశాలకు పురుషుడి మానసిక స్ధితి మహిళకంటే కూడా ఎల్లపుడూ విభిన్నంగానే ఉంటుంది.
వీరు చాలావరకు వారి భావోద్వేగాలను అణచుకుంటారు. బాధను ఆపుకుంటారు. పురుషులు సహజంగానే కొంత కఠినంగా ఉండగలరు. వారిలో బలహీనతలు త్వరగా బయటపడవు. వారికి ఎంత నిరాశ ఉన్నప్పటికి వారి మహిళా సహచరిణికి ఊరటనిస్తారు. వారి పురుషాహంకారం దెబ్బతింటే మాత్రం ఎంతో ఆవేశ పడతారు. పిల్లలు కలగని పరిస్ధితి కుటుంబ సంబంధాన్నే నాశనం చేసే అవకాశం ఉంటుంది. వంధ్యత్వ ప్రభావం జంటపైనా మరియు బంధువులపైనా కూడా ఉంటుంది. ఒకరి వేదనకు మరి ఒకరు కారణం అనుకుంటారు. ఇటువంటి అంశాలలో వారు ఒకరిని మరిఒకరు నిందించుకోలేరు కనుక చిన్న అంశాలపై తగవులు చేసుకుంటారు. కొందరు మాత్రం వారి మనోవేదనకు మరింత దగ్గరకూడా అయి ఒకరిని మరి ఒకరు ఓదార్చుకుంటారు.
ఈ సంతాన సమస్య వారి పూర్తి కుటుంబ సభ్యులపైన కూడా వేదన కలిగిస్తుంది. వాస్తవకారణాలు తెలుసుకోలేక కుటుంబంలోని వారు మహిళను నిందిస్తారు. పిల్లలు కలగకపోవటమనేది ఆమె లేదా అతని చేతిలో లేదు కనుక ఇతరులు వారిపై సానుభూతి చూపాలి. నిజానికి ఇటువంటి భావోద్రేక పరిస్ధితులు చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీటిని చాలా సహనంతో ఎదుర్కొనాలి. వంధ్యత్వ సమస్య వైద్య చికిత్సలద్వారా తగ్గించవచ్చు. మీరు కనుక వంధ్యత్వ అంటే సంతానం కలగకపోవటం అనే సమస్యతో బాధపడుతూంటే, వెంటనే ఒక గైనకాలజిస్టును సంప్రదించండి. మీ పరిస్ధితినిబట్టి ఆమె లేదా అతడు తగిన వైద్య విధానాలను మీకు సూచిస్తారు. పరిస్ధితి చక్కబడి సంతానం కలుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు అమితంగా ఆనందపడే అవకాశాలు తప్పక వుంటాయని గ్రహించండి.



Click it and Unblock the Notifications