Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కాబోయే తల్లిగా ఆమెను ఊహించండి!

సాధారణంగా తండ్రి పాత్ర మరచిపోతూవుంటారు. వీరికి కూడా శారీరక ధృఢత్వం కావాలి. అధిక భాద్యత, భార్యకు అన్నివిధాలా సహకరించవలసి వుంటుంది. మానసికంగా ఎన్నో మార్పులు పొందాలి. ముందుగా తన మహిళలో వచ్చే శారీరక మార్పులకు అతను సిద్ధంగా వుండాలి. స్తనాలు పెరగటం, శరీర ఉష్ణోగ్రత మారటం, చెదిరిన మనోభావనలు, పెరిగిన పొట్ట మొదలైనవి అతను కూడా చూసి తట్టుకోవాలి. తన మహిళ కోర్కెలు, మనోభావనలకు అనుకూలంగా వుండాలి.
అంతేకాక, ఇంటికి ఒక పురుషుడుగా తగిన ఆర్ధిక స్ధిరత్వం కలిగి వుండాలి. డెలివరీ సమయంలో ఆర్ధిక పరంగా చాలా వ్యయం చేయవలసి వుంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా కుటుంబంలో అదనపు వ్యయం జరుగుతుంది. వీటికి కొత్తగా అవబోయే తండ్రి సిద్ధ పడాలి. తండ్రి అయిన తర్వాత తన ఆలోచనలో కొంత పరిపక్వత రావాలి. అంతవరకు వున్న చెడు అలవాట్లలో మార్పు తెచ్చుకోవాలి. పొగతాగటం, ఆల్కహాల్ వంటివి కాబోయే తల్లికి, పుట్టబోయే శిశువుకు కూడా హాని కలిగిస్తాయి. కోపం తగ్గించుకోవడం కూడా ప్రధానమే. ఎందుకంటే, గర్భంతో వున్న మహిళ మీ కోపానికి తట్టుకోలేదు. తండ్రి కాబోయే వారు ఈ అంశాలను ప్రధానంగా దృష్టిలో వుంచుకోవాలి.



Click it and Unblock the Notifications