Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భాగస్వామిని ఎంపిక చేసుకునేటపుడే?

రెండవ ప్రధానమైన అంశంగా వాసనా శక్తిని కూడా కలిగి వుంటాం. కొన్ని వాసనలు మనలను ఆ భాగస్వామి వైపు ఆకర్షింపజేస్తే, మరి కొన్ని దూరంగా కూడా వుండేలా చేస్తాయి. అతి సన్నిహిత కుటుంబ సభ్యులనుండి వచ్చే వాసనలు మనలను లైంగికంగా వికర్షకులుగా కూడా చేస్తాయి.
సంతానోత్పత్తి చేయటంలో ప్రకృతి సహజంగానే ఈ ఏర్పాటు చేసింది. మానవ సంతతి ఆదిమ కాలంలో కుటుంబాలుగా లేకుండా గుంపులు, తెగలుగా వున్నపుడు సమీప బంధువులా కాదా అని తెలుసుకోడానికి వాసనను బట్టే గ్రహించేవారు. సమీప రక్త సంబంధాలతో పిల్లల సంతానోత్పత్తి బేబీ జన్యు ఆరోగ్యం కారణంగా సరైనది కాదు. అంటే దాని అర్ధం భాగస్వాములలో ఒకే రకమైన జీన్సు వుంటే పుట్టే బిడ్డలు బలంగా, ఆరోగ్యంగా వుండరు. వారి ఎదుగుదల లేదా వారి సంతతి నాణ్యత కలిగి వుండదు.
తాజాగా పరిశోధకులు కనిపెట్టిన మరో అంశం మనకు వచ్చే వాసనలు మన క్రోమోజోమ్స్ లోని జీన్సు ఒకే రకంగా వుంటే రోగనిరోధక శక్తి తక్కువగా వుంటాయంటారు. పుట్టే బేబీ బలంగా, ఆరోగ్యంగా వుండాలంటే మనం ఎంచుకునే జీవిత భాగస్వామిని వాసనా శక్తి ద్వారా కూడా కనిపెట్టేయవచ్చు.
ఆరోగ్యాన్నిచ్చే ఈ జీన్స్ మననుండి ఎంత వ్యతిరేకంగా వుంటే, అంతచేటు ఆ భాగస్వామికి మీరు ఆకర్షించబడతారు. ఈ చర్య ఆరోగ్యవంతమైన సంతానోత్పత్తికి కారణమవుతుంది.
జీన్స్ ఈ రకంగా ఎంపిక చేసుకోవడంలో హార్మోన్ల పాత్ర అధికంగా వుంటుంది. హార్మోన్ల విడుదలలో వాసనలు పుట్టుకొస్తాయి. మహిళలు అండాన్ని రిలీజ్ చేసేటపుడు వారి శరీరాలు ఎంతో కాంతివంతంగా వుండి మంచి వాసనలతో కూడుకొని వుంటాయి. ఈ రకంగా అండం రిలీజ్ అయ్యే సమయంలో ఆమెకుగల ఆకర్షణలతో పురుషుడు తన వాసనా శక్తి ద్వారా ఆమెను ఆకర్షిస్తాడు. ఈ రకంగా హార్మోన్లు, జీన్స్ సంబంధించిన నిర్ణయాలతో ప్రతి ఒక్కరూ వారికిష్టమైన ఎంపికతో సంతానోత్పత్తి చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications