Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
గర్భం త్వరగా ధరించాలంటే....?

మీ రుతుచక్రంపై అవగాహన కలిగి వుండండి. గర్భం ధరించాలంటే ఇది చాలా ప్రధానం. అండం విడుదలయ్యే సమయంలో రతిక్రీడనాచరించటం సూచించదగినది. అండం విడుదల సాధారణంగా మీ పిరీయడ్ కు 14 రోజుల తర్వాత మొదలవుతుంది. మెడికల్ షాపులలో దొరికే టెస్ట్ కిట్లతో మీ అండం విడుదల పరిస్ధితి తెలుసుకోవచ్చు. మీ శరీర టెంపరేచర్ ప్రతిరోజూ చూసుకోండి. ఏ రోజు కొద్దిగా పెరిగినా, మీ అండం విడుదల లేదా అండోత్సర్గం మొదలైనట్లే.
అనారోగ్య తిండ్లు తినకండి. కాఫీ తాగితే గర్భాశయానికి రక్త సరఫరా నెమ్మదిస్తుంది. కేఫైన్ అధికమైతే గర్భవిచ్ఛిన్నం కూడా జరుగుతుంది. ఆల్కహాల్, స్మాకింగ్ వంటివి కూడా చెడు ప్రభావం చూపుతాయి. కనుక గర్భం కోరుకునే వారు వీటిని తప్పక వదలివేయాలి. లేదంటే అవి మీ గర్భం ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతాయి.
ఫలదీకరణ అధికం చేసే ఆహారాలైన, బీన్స్, వెల్లుల్లి, గింజధాన్యాలు, కాలీఫ్లవర్, పప్పులు, తేనె, అవకాడో పచ్చని ఆకుకూరలు తగిన మోతాదులలో తీసుకోండి. నీరు అధికంగా తాగితే ప్రయోజనం. ఇది వీర్యకణాలు మీలో విడుదలైన అండంతో త్వరగా కలిసిపోయే ద్రవంలో చేరి ప్రయోజనం చేకూరుతుంది.
పై చర్యలు చేపడితే, మీరు గర్భవతులయ్యారనే శుభవార్త తప్పక వినగలరు.



Click it and Unblock the Notifications
