Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలు పుట్టని మహిళలకు వరం!

ఈ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియలో మహిళల అండంలో కనుక లోపం వుంటే వేరొక మహిళ అండానికి పురుషుడి వీర్య కణాలను సంయోగం చెందించి ఆ మహిళలో ప్రవేశ పెట్టి గర్భం ధరించేలా చేస్తారు. అదే విధంగా వీర్యకణాల లోపం వున్న పురుషులకు సరైన రీతిలో వున్న వీర్య కణాలను మహిళ అండంతో సంయోగం చెందించి మహిళలో ఫలదీకరణ కావిస్తారు.
ఈ ప్రక్రియలో మహిళ సహజంగానే గర్భం ధరించి సంతానాన్ని పొందుతుంది. అయితే, ఈ గర్భ ధారణ పద్ధతిలో, భార్యా భర్తలలో ఎవరో ఒకరు మాత్రమే బిడ్డ పుటుకకు కారణం కాగా, మహిళ మాత్రం గర్భం ధరించి కాన్పుకు మాత్రమే భాధ్యురాలవుతుంది. గతంలో ఈ పద్ధతికి తీవ్రంగా వ్యతిరేకించినప్పటికి నేడు ఇది పట్టణాలలో బాగా వ్యాప్తి చెందుతోంది. దీనికి కారణం మహిళలు ఏదో ఒక రకంగా గర్భం పొంది తాము పిల్లలు లేని వారమనే భావనకు దూరంగా వుండటమేనని వైద్య నిపుణులు చెపుతున్నారు.
జంటలు తమ సంతానానికి చెందిన రహస్యాన్ని రహస్యంగా వుంచేసి కాలం గడిపేస్తున్నారు. పుట్టిన బిడ్డలతో ఆనందంగా గడిపేస్తున్నారు. వేరే వారి పిల్లలను దత్తతలు తీసుకోవడం, వారిని పెంచడం అనే ప్రక్రియకు చాలా వరకు అడ్డు కట్టపడింది. అయినప్పటికి నేటికి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు మాత్రం ఈ రకమైన సంతాన ప్రక్రియకు పూర్తిగా వ్యతిరేకత చూపుతూనే వున్నారు. ఈ ప్రాంతాల ప్రజలు ఇంకను పూర్తిగా మారని కారణంగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణ అనే ప్రక్రియకు మనదేశంలో పూర్తి ప్రాచుర్యత లభించడం లేదు.



Click it and Unblock the Notifications