Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆ రోజులలో సైతం... ఆనందం మీ సొంతం!

రుతుక్రమంలో గర్భాశయం సంకోచిస్తుంది. ప్రొస్టాగ్లాండిన్స్ అనే పదార్ధం విడుదల అవుతుంది. గర్భావయ కండరాలు ముడుచుకుంటాయి. ఈ చర్యలు ఆమెలో వికారాన్ని నొప్పులను కలిగిస్తాయి. హార్మోన్ల మార్పు వలన వచ్చే మంటలు ఎసిడిటీ, అజీర్ణం కలిగిస్తాయి. అందుకే వికారం కలుగుతుంది. ఈ ప్రక్రియ ఆమెను బలహీన పరచి బరువు కోల్పోవటం, ఆరోగ్య సమస్యలు కలిగించటం చేస్తుంది.
ఈ రుతుక్రమ నొప్పులకు పరిష్కారంగా ఏం చేయాలి?
1. కేమోమైల్ టీ రుతుక్రమ నొప్పులను, వాంతి భావనలను తగ్గిస్తుంది. కేమోమైల్ టీ తయారు చేయాలంటే కొన్ని పూలను వేడి నీటిలో మరిగించి కొద్దిపాటి షుగర్ వేయండి. దానిని కొద్ది కొద్దిగా తాగండి.
2. రుతుక్రమ వాంతి వికారాలను తగ్గించాలంటే, చిన్న అల్లం ముక్కను కొద్ది కొద్దిగా తినండి. అల్లంలో సూక్ష్మజీవులను చంపే గుణంవుంది. అది మీలోని మంటను తగ్గిస్తుంది. ఎసిడిటీ నివారించి మీ వికారాన్ని పోగొడుతుంది.
3. కండరాల సంకోచం గర్భాశయంపై వుంటే కూడా అది గుణం ఇస్తుంది. వేడి కాపడం కడుపు పై పెట్టండి. ఒక గ్లాస్ బాటిల్ లో వేడినీరు తీసుకొని దానిని పొట్టపై దొర్లించుతూ వుండండి. ఈ చర్య పొట్ట కండరాలను సడలిస్తుంది.
4. బాగా నూరిన మెంతులను ఒక చెంచాడు తింటే వికారం పోతుంది. ఉదయంవేళ ఖాళీ కడుపుతో వీటిని తినాలి. లేదా నీటితో కలిపి మింగండి.
5. మరో పరిష్కారంగా కండరాలు మసాజ్ చేయటం ద్వారా సడలించండి. మీ చేయి పొట్టపై పెట్టి మెల్లగా మసాజ్ చేసుకోండి. ఇది కండరాలు సడలించటమే కాదు. మీ లోని రక్తప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది.
6. రుతుక్రమ వాంతిని తగ్గించేందుకు ఒక కప్పు బియ్యం మూడు కప్పుల నీటితో వండండి. అన్నం ఉడికిన తర్వాత అధిక నీటిని కొద్ది కొద్దిగా తాగండి. ఈ చర్య మీ వికారాన్ని అణచటమే కాదు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
ఈ ఆరు పరిష్కారాలతో మీ రుతుక్రమ నొప్పులను, వాంతి భావనను నివారించుకోండి. ఈ చిట్కాలు మీ రుతుక్రమ తేదీకి ఒక వారం ముందునుండి పాటించండి. మంచి ఊరట లభిస్తుంది.



Click it and Unblock the Notifications