Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఏ వయసులో గర్భవతి అయితే మంచిది?

మరీ వయసు మీరిన మహిళలు పిల్లలను దత్తత తీసుకోవటం వరకు కూడా ఆలోచిస్తారు. గర్భవతికిగల కష్టాలు, మహిళకు మహిళకు మారుతూంటాయి. ప్రతస్తుతం ఆలస్యంగా గర్భం ధరించినప్పటికి మంచిదేనంటున్నారు వైద్యులు. అయితే మహిళ వయసు పైబడే కొద్ది కష్టం ఎక్కువగా వుంటుంది. 35 సంవత్సరాలపైబడి గర్భవతులైన వారిలో సెలిబ్రిటీలు సైతం ఎందరో వున్నారు. అయితే, ఈ వయసులో గర్భం ధరించే అవకాశాలు తక్కువ. గర్భంతో పాటు, డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం వుంటుంది.
వైద్య శాస్త్రం అభివృధ్ధి చెందుతున్న నేపధ్యంలో సౌకర్యాలు మెరుగవుతున్నందువల్ల, ఆలస్య గర్భాలు కూడా మహిళలకు సౌకర్యమే కనుక 35 సంవత్సరాలనుండి 40 సంవత్సరాలవరకు కూడా గర్భం ధరించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. అయితే, టైప్ 2 డయాబెటీస్, ధైరాయిడ్ వంటి వ్యాధులు లేకుండా వుండాలి. డెలివరీలు సైతం నేటిరోజులలో వేగంగా, నొప్పి లేకుండా జరిగిపోతున్నాయి. వయసు మీరిన మహిళలవటంతో, వీరు వేసుకునే గర్భ నిరోధక మాత్రలు ఆపేస్తే చాలు, తేలికగా గర్భం పొందుతున్నారు.
ఇక సంరక్షణా విషయానికి వస్తే, ఇంటర్నెట్, ఇతర పుస్తకాలు, హాస్పిటల్స్ వంటివి అందుబాటులో వుండటంతో కావలసినంత సమాచారం ముందెన్నడూ లేనంతా లభ్యమవుతుండటంతో అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, తమకు అవసరమైన రీతిలో పిల్లలను కనే అవకాశాలు నేటి మహిళలకు వున్నాయి. కనుక మహిళలు ఆలస్య వివాహాలు జరిగినప్పటికి ఆలస్య గర్భ ధారణ పొందినప్పటికి ఆందోళన చెందనవసరంలేదంటున్నారు విషయ నిపుణులు.



Click it and Unblock the Notifications