Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆ....పనిలోగర్భం రాకుండా ఎలా...?

మహిళలకు శాశ్వత గర్భ నిరోధకత ఎలా?
మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయవచ్చు. ఇది చేస్తే ఇక ఫలదీకరణ వారిలో జరుగదు. మహిళలోని ఫేలోపియన్ ట్యూబ్ ను సీల్ చేస్తారు. ఇక ఆపై ఆమెలోని అండం ఫలదీకరణ కొరకు గర్భాశయాన్ని చేరదు. పాక్షిక శాల్పిన్ జెక్టమీ అనే ఆపరేషన్ చాలామంది చేయించుకుంటున్నారు. దీనిని లోకల్ ఎనస్తీషియా ఇచ్చి చేస్తారు. చాలా సార్లు మహిళ సిజేరియన్ చేయించుకోగానే తక్షణమే ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. సిజేరియన్ మత్తులో వున్న ఆమెకు అదే సమయంలో పిల్లలు పుట్టకుండా శాశ్వతంగా ఈ ఆపరేషన్ చేస్తారు.
ట్యూబెక్టమీ ఆపరేషన్ 99 శాతం విజయవంతం. ఈ ఆపరేషన్ తర్వాత గర్భం వచ్చిన సంఘటనలు అరుదుగా వున్నాయి. ఈ ఆపరేషన్ తర్వాత మహిళ ఏదేని బలమైన కారణాల వలన మరోసారి పిల్లలు కలగాలని భావిస్తే, దీనిని రివర్స్ చేసి మరోమారు ఫేలోపియన్ ట్యూబులకు ఆపరేషన్ చేసి పిల్లలు పుట్టేలా చేయవచ్చు.
పురుషులకు శాశ్వత గర్భనిరోధక మార్గం - వేసక్టమీ
వేసక్టమీ కూడా ఒక ఆపరేషన్ వంటిదే. దీనిలో జన్మనిచ్చే వీర్యకణాలు వీర్య ప్రవాహంలో చేరకుండా నిలిపేస్తారు. దీనిలో వాసా డిఫరెన్షియా లను కత్తిరించి సీలు వేస్తారు. ఇది కూడా లోకల్ ఎనస్తీషియా లోనే చేస్తారు. దీనిని చేయించుకొన్న పురుషులు త్వరగానే తమ రోజువారీ పనులను ఆచరించవచ్చు. ఆపరేషన్ అయిన వెంటనే పురుషుడు తన ఇంటికి వెళ్ళవచ్చు. ఉద్యోగాలు, ఇతర పనులు ఎట్టి శ్రమ లేకుండా ఒక వారం రోజులలోపే చేసుకోవచ్చు.
ఈ ప్రక్రియ విఫలతకూడా చాలా తక్కువే. వాసో వాక్టమీ అనే ఈ ఆపరేషన్ చేస్తే చాలు పురుషుడు తన భాగస్వామికి గర్భం చేయలేడు. అయితే సర్జరీ వ్యయం అధికంగా వుంటుంది.
శాశ్వత గర్భ నిరోధానికిగాను ఈ రెండు ఆపరేషన్లు, పురుషులకు, స్త్రీలకు చేస్తారు.



Click it and Unblock the Notifications