Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతిలో యోని దురద....కారణాలు?

గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత గణనీయంగా వుంటుంది. ఈ అసమతుల్యత శరీరంపై తన ప్రభావాన్ని చూపుతుంది. యోని యొక్క పిహెచ్ స్ధాయిలు మార్పు చెందుతూంటాయి. ఈ పిహెచ్ అసమతుల్యత దురదకు కారణమవుతుంది. ఆ ప్రదేశంలో హాని కలిగించే బాక్టీరియా క్రిములు చేరి వ్యాధులను కూడా కలిగిస్తాయి.
ఆ భాగంలో షుగర్ ఏర్పడి క్రిములు చేరతాయి. పిహెచ్ స్ధాయి మారడంతో యోని ప్రదేశంలో షుగర్ అధికమవుతుంది. అధికంగా వుండే ఈ షుగర్ అక్కడ ఈస్ట్ (మధు శిలీంద్రం) ఏర్పడి పెరుగుతుంది. ఈ సమస్య గర్భవతికి మూడవ త్రైమాసికంలో మరింత అధికంగా వుంటుంది. కొన్ని సార్లు పిహెచ్ అసమతుల్యత వలన కాకుండా సుఖ వ్యాధులవలన కూడా దురదలు రావచ్చు. ఆమెలో ఏర్పడే డయాబెటీస్ కారణంగా రక్తంలోని గ్లూకోజ్ స్ధాయి పెరిగి కూడా ఆమె యోనిలోని పిహెచ్ ద్రవాల స్ధాయిని మారుస్తుంది. యోని దురద తగ్గాలంటే తక్షణమే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
మూత్రాశయ సంబంధిత వ్యాధుల వలన కూడా దురద ఏర్పడవచ్చు. ఏది ఏమైనప్పటికి గర్భవతికి ఈ దశలో వచ్చే యోని దురద లేదా ఆ ప్రాంతంలో బాక్టీరియా చేరి సమస్యలు కలిగించటం వంటివి సహజంగా వస్తూనే వుంటాయి. వీటిని నిర్లక్ష్య పరచరాదు. దురద చూపిన వెంటనే దానికి తగిన చికిత్స తీసుకోవటం అవసరం. ఈ సమస్య కనుక అధికమైతే, ఆమె కే కాక ఆమె కడుపులోని బిడ్డకు సైతం వ్యాధులు సోకే ప్రమాదం వుంది.



Click it and Unblock the Notifications