Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
కవల పిల్లలు కలిగేందుకు ప్రయత్నమా?

దానికి కారణం నేడు మహిళలు చాలావరకు ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక ఆ ఉద్యోగంలో మేటర్నీటీ లీవ్ అంటూ రెండు సార్లు సెలవు పెట్టటం మహిళ తన ఉద్యోగ భధ్రతకు, తన కెరీర్ కు ఆటంకంగా భావిస్తోంది. ఒకే సారి గర్భం ధరించి ఇద్దరు పిల్లలనను కనేయాలని భావిస్తోంది. ఆమె అవసరం అటువంటిది.కనుక, ఒకే సారి ఇద్దరు పిల్లలను కనేందుకు తప్పక మార్గాలు కూడా వుంటాయి. కవల పిల్లలు పుడితే చాలా అదృష్టమే మరి. కవల పిల్లలు పుట్టించుకోవడం ఎలా అనే అంశంపై కొన్ని సైంటిఫిక్ వివరణలు పరిశీలించండి.
కవలపిల్లలు పుట్టేందుకు కొన్ని చిట్కాలు -
1.వయసు పెరిగే కొలది మీకు అవకాశాలు అధికం - ఎల్లపుడు బిజీగా వుంటూ పనులు చేసుకునే మహిళలకు ఒకే సారి కవలలు కలగటం నిజంగా మంచి అవకాశం. వారు కూడా ఉద్యోగాలలో వుంటూ సంతానం కొరకు ఆలస్యంగానే ప్రయత్నిస్తారు. మహిళకు మెనోపాజ్ ముందు అండోత్సర్గం అతి చురుకుగా కొనసాగుతుందని సైన్స్ చెపుతోంది. మీ అండాశయంనుండి 35 నుండి 45 రోజుల పిరీయడ్ లో ఒకటికంటే కూడా అధికంగా అండాలు రిలీజ్ చేయబడతాయి.
2. ఫలదీకరణ - చాలామంది సెలిబ్రిటీలు ఫలదీకరణ చికిత్సలు చేయించుకున్నవారు. లేదా టెస్ట్ ట్యూబ్ బేబీలకు చికిత్స చేయించుకున్నవారు కవలలు పొందటం మీరు గమనించే వుంటారు. గర్భం దాల్చటం కష్టమైతే, మీరు కనుక ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చేయించుకొనే వారైతే కవలలు పొందేందుకు మీకు మంచి అవకాశమే.
3. కుటుంబ చరిత్ర - మీ కుటుంబంలో మీ ఆంటీలు లేదా ఇతర బంధువులలో ఎవరికైనా కవల పిల్లలు కలిగినట్లయితే, మీకు కూడా ఇది తేలిక అవుతుంది. మీరు 30 సంవత్సరాల పైన కూడా గర్భం ధరించాల్సిన అవసరం లేదు. అది కనుక మీ జన్యువులలో వుంటే, సహజంగా కవలల కొరకు కూడా ప్రయత్నించవచ్చు.
4. మీరు ఇప్పటికే ఒక బిడ్డకు పాలు ఇస్తూ వుంటే, మరో గర్భం కవల పిల్లలతో పొందేందుకు అనుకూలంగా వుంటుంది అని సైంటిస్టులు చెపుతారు. అది పూర్తిగా రుజువు కానప్పటికి కలిగే అవకాశాలుంటాయంటారు. కనుక తప్పక ఈ సమయంలో ప్రయత్నించండి.
5. గర్భం పొందేందుకు ప్రయత్నించే సమయంలో పాల సంబంధిత ఉత్పత్తులు, చిలకడ దుంప వంటి దుంప పదార్ధాలు అధికంగా తీసుకుంటే అవకాశాలుంటాయి.
6. ఊబకాయం మరియు కవల పిల్లలు - ఊబకాయం కలిగి అధిక బరువు వుంటే వారికి కొన్ని సార్లు సహజంగా కవల పిల్లలు కలిగే అవకాశాలుంటాయి. అయితే పుట్టే కవలలు ఇద్దరూ ఒకే రకంగా వుండకపోవచ్చు.
మీరు కనుక ఒకే సారి కవల పిల్లలను కనాలని అనుకుంటుంటే, ఈ చిట్కాలు బహుశ మీకు ఉపయోగించవచ్చు. కనుక ప్రయత్నం చేయండి. ఒకే సారి ఇద్దరు పిల్లలను కని ఆనందించండి.



Click it and Unblock the Notifications