పిల్లలు పుట్టరని అనుమానిస్తున్నారా?

By B N Sharma

When To Suspect Fertility Problems?
వెంటనే పిల్లలు పుట్టకపోతే ఆ సమస్యను ఫలదీకరణ సమస్యలుగా భావించరాదు. శుభవార్త కొరకు భార్యాభర్తలు కనీసం 6 నెలలపాటైనా ప్రయత్నించాలి. గర్భవతి అవ్వాలంటే ఒక సమయం వుంటుంది? ఇక ఆ సమయం దాటితో మీరు సందేహం పడాల్సి వస్తుంది. గర్భ సంచి లేదా ఫలదీకరణ సమస్యల కారణంగా పిల్లలు పుట్టకపోవటం లేదనే దానికి కొన్ని సూచనలు చూడండి.

1. సాధారణంగా మొదటి బిడ్డ మహిళకు 30 సంవత్సరాల లోపు పుట్టాలి. 35 సంవత్సరాల పైబడి పిల్లలు పుట్టటం లేదంటే కనీసం పరీక్షలలో అనేక మార్లు విఫలమైతే, ఇక అది ఫలదీకరణ సమస్యగా భావించాలి.
2. మీ పిరియడ్స్ సరిగా రాకుండా వుంటే మీ సంతాన సామర్ధ్యాన్ని సందేహించాలి. పిరియడ్స్ సక్రమంగా వుండే వారికి 80 శాతం పిల్లలు పుట్టేందుకు అవకాశం వుంటుంది.
3. చాలామంది జంటలు పిల్లలు పుట్టేందుకు 3 నుండి 6 నెలల సమయం తీసుకుంటారు. అంతకు మించి అంటే 8 నుండి 10 నెలల సమయం అయినా పుట్టకపోతే, మీ లేదా మీ పురుషుడి సంతానోత్పత్తి సమస్య గా కూడా భావించవచ్చు.
4. లేదా మీలో సమస్య లేదంటూ వచ్చే రిపోర్టులు తప్పుడుగా వస్తూ వుంటే కూడా ఫలదీకరణ సమస్యగా భావించవచ్చు. గర్భవతి లక్షణాలన్నీ కనపడతాయి. కాని గర్భం ధరించటం జరగదు. దీనిని కెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈసమస్య వంశానుగతంగా లేక జన్యుపరంగా వచ్చే సమస్య. కనుక దీనికి నిపుణులను సంప్రదించాలి.
5. గతంలో మీరు గర్భంలో పుండు లేదా రొమ్ము కేన్సర్ వంటి వాటితో బాధపడి 4 లేదా 5 సార్లు ప్రెగ్నెన్సీ పరీక్షల్లో విఫలం అయితే దానిని ఫలదీకరణ సమస్యగా భావించాలి.
6. మీ భర్త పొగతాగేవారైతే వారిలో ఫలదీకరణ సమస్య వుండి మీకు గర్భం రాకపోవచ్చు. అటువంటపుడు వీర్యకణాలు పరీక్ష చేయించండి. వాటి సంఖ్య, సమర్ధతలను పరీక్షించండి.
ఫలదీకరణ సమస్యలు నేటి రోజులలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. కనుక, వీటిని తగినంత ముందుగా పరీక్షలు చేయించి నిర్ధారించి తగిన చికిత్స చేయించుకోవాలి.

Story first published: Monday, March 26, 2012, 11:46 [IST]
Desktop Bottom Promotion