Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
టెస్టు ట్యూబ్ ఫలదీకరణలో కవల పిల్లలు ఎలా సాధ్యం?

ఐవిఎఫ్ ఎందుకని కవలలను పుట్టిస్తుంది?
దీనికి వివరణ తెలుపాలంటే చాలా సింపుల్. ఐవిఎఫ్ మాత్రమేకాదు, ఫెర్టిలిటీ చికిత్స ఏదైనప్పటికి అది ఎక్కువమంది బిడ్డలు ఒకే సారి పుట్టే అవకాశాలుంటాయి. సాధారణ పరిస్ధితులలో ఒక అండం ప్రతినెలా పక్వం అవుతుంది అది అండాశయం నుండి రిలీజ్ అవుతుంది. అరుదైన సంఘటనలలో ఈ నిబంధన అతిక్రమించబడి ఫలదీకరణ అదే సమయంలో జరిగితే, అది జంట కవలలు లేదా ముగ్గురిగా కూడా ఫలదీకరణ జరిగే అవకాశం వుంది.
ఫెర్టిలిటీ చికిత్సలలో, అండాలు హార్మోన్లతో కలిసి ప్రభావించబడి, అధిక అండాలు ఏర్పడతాయి. అండాలను కలిగించటం వ్యయంతో కూడినది మరియు దీర్ఘకాల ప్రక్రియ. కనుకవారు ఒక సారి ఒకే అండాన్ని తీయరు. వీర్యకణాలు అధికంగా లభిస్తూండటంతో, ఒకే డిష్ లో ఒకటికంటే కూడా అధిక పిండాలు తయారు చేస్తారు. గర్భాశయంలో వారు ప్రవేశ పెట్టిన ప్రతి పిండం విజయవంతంకాదు. కనుక ఒకే సారి అనేక పిండాలు వారు గర్భాశయంలో పెట్టేస్తారు. వాటిలో కనీసం ఒకటైనా విజయవంతం అవుతుందని భావిస్తారు. ఈ కారణంగానే ఐవిఎఫ్ లో అధిక సంఖ్యలో పిల్లలు పుడతారు.
ఐవిఎఫ్ జంట పిల్లలో సమస్యలా?
అవును. ఐవిఎప్ అనేది ఒక క్లిష్టమైన ఫలదీకరణ ప్రక్రియ. ఈ పిల్లల పుటుక సమస్యగానే ఎల్లపుడూ వుంటుంది. కనుక, ముందస్తుగానే డెలివరీ అయ్యే అవకాశాలుంటాయి. అంతేకాక, పుటుక లోపాలు, పుట్టినపుడు బరువు తక్కువగా వుండటం వంటివి కూడా ఏర్పడతాయి. కాని ఐవిఎఫ్ అనేది చాలా అధునాతన ఫలదీకరణ పద్ధతి. తల్లి గర్భంలోకి ప్రవేశ పెట్టబడే పిండాల సంఖ్యను మీరు తేలికగానే నియంత్రించవచ్చు. నేడు ఐవిఎఫ్ కేంద్రాలకు కొత్త నిబంధనలు ఏర్పరచబడ్డాయి. వాటిమేరకు ప్రతి ఫెర్టిలిటీ కేంద్రం చట్టబద్ధంగా వారు చేసే మొత్తం పుటకలలో 10 శాతంగా మాత్రమే చేయాలనేది ఒక అధునాతన నిబంధన.
ఐవిఎఫ్ కవల పిల్లలు అవసరంలేదనుకుంటే?
సాధారణంగా, జంటలు చాలాకాలం పిల్లలు లేకుండా వుంటారు. కనుక వారు ఒకే సమయంలో ఒకరికి మించిన సంతానాన్ని కోరుకుంటారు. కాని, మీరు కనుక ఒకే బిడ్డ కావాలనుకుంటే, మీరు ఫెర్టిలిటీ డాక్టర్ ను ఒకే పిండాన్ని మీ గర్భంలో ప్రవేశ పెట్టమని కోరాలి. కాని ఆ ఒక్కటి విజయవంతం కాకపోతే మీకు సమస్య ఎదురయ్యే అవకాశం వుంటుంది. అయినప్పటికి వైద్యులు ఒక్క పిండాన్నే మీ గర్భంలో ప్రవేశ పెట్టి, ఒకే బిడ్డకు జన్మనిచ్చేలా కూడా చేసే రిస్కు తీసుకుంటారు.



Click it and Unblock the Notifications