Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలు గర్భనిరోధక మాత్రలు ఎందుకు వాడరు?

మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడరు? ఎందుకని?
1. వాటిగురించిన భయంకర గాధలు వినివుంటారు. ఈ మాత్ర ఇచ్చే దుష్ప్రభావాలను వారి తల్లులు, అత్తలు, లేదా ఇతర సోదరీమణులనుండి భయంకరంగా వినివుంటారు. వీరు కనుక వాటిగురించి బాగా తెలుసుకుని వుంటే భయపడేవారుకాదు. అపోహలు తొలగించటం కష్టమే.
2. పాత జనరేషన్ మాత్రలు - గర్భనిరోధక మాత్రలు రెండు రకాలు. మహిళలకు పాత తరం మాత్రలు చాలా దుష్ప్రభావాలు చూపివుండవచ్చు. అయితే, నేడు తయారవుతున్న మాత్రలు అంటే కొత్త తరం వాటిలో ప్రొజెస్టిరోన్లు చాలా తక్కువగా వుంటున్నాయి. సైడ్ ఎఫెక్టులనేవి అసలు లేవు. ఈ మార్పులను మహిళలు సరిగా గమనించటం లేదు.
3. కష్టం ఎక్కువ - గర్భనిరోధక మాత్రలను ప్రతిరోజూ నిర్దేశిత సమయాలలోనే తీసుకోవాలి. బిజీగా వుండేవారైతే మరచిపోవటం జరుగుతుంది. ఇక అటువంటపుడు ఆ మాత్ర ఎంతో ఇబ్బందిపెడుతుంది. సాధారణంగా మనకు ఏదీ సరైన సమయానికి చేసే అలవాటు వుండదు. కనుక ఈ మాత్రను సరైన సమయంలో వేయటం కష్టంగా వుంటుంది.
4. సరిగ్గా లవ్ చేసుకోవటమే లేదు - చాలామంది జంటలు తరచుగా తాము రతిక్రీడలో పాల్గొనటం లేదుకదా అని కూడా వాటిని రెగ్యులర్ గా వాడరు. ఎపుడో ఒక సారి చేసుకునే రతికి ప్రతిరోజూ మాత్రలు మింగటమా అని కూడా అశ్రద్ధ చేస్తూంటారు. గుర్తు వచ్చినపుడు ఓ పిల్ నోట్లో వేస్తూ కాలక్షేపం చేస్తారు. ఇది అనారోగ్యం కలిగిస్తుంది.
5. అనేక యాక్సిడెంట్లు - గర్భనిరోధక మాత్ర వేసినప్పటికి గర్భం వచ్చేస్తుందని బంధువులు, స్నేహితులు చెప్పారని కూడా మహిళలు అంటారు. ఫలితాలు కనపడాలంటే ఈ మాత్ర కనీసం ఒక నెలరోజులైనా తీసుకోవాలి. అయితే, ప్రతిరోజూ ఒకే సమయానికి తీసుకోవాలి. మరిచిపోయారా...గర్భం వచ్చిందే.
అది మహిళల గర్భనిరోధక మాత్ర అయినప్పటికి, మహిళలకు వాటికి అస్సలు పొంతనే కుదరడం లేదు.



Click it and Unblock the Notifications