Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
యోగాతో ప్రసవం తేలిక... అందం తగ్గదు?
మహిళకు గర్భధారణ సమయం ఎంతో ఒత్తిడిగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా ఒత్తిడి కలిగి ఉంటుంది. అయినప్పటికి పండంటి బిడ్డకు జన్మనిస్తాననే ఆశతో ఆమె ఏ మాత్రం బాధపడకుండా తన గర్భాన్ని కొనసాగిస్తుంది. గర్భం ధరించటం, ప్రసవం పొందటం అనేవి స్త్రీ శరీరానికి సహజమైన చర్యలు. మరి ఈ ఒత్తిడి, ఆందోళన వంటివి ‘యోగ' సాధనలో నివారించగలిగితే, బిడ్డ పుటుక ఎంతో తేలికవుతుంది. యోగా మరియు ధ్యానం రెండూ కూడా పుట్టబోయే మీ బిడ్డ శరీరక మరియు ఆధ్యాత్మికతలకు ఎంతో మేలు చేస్తాయని ముంబై లోని యోగా ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ మరియు యోగా బోధకులు హన్సాజీ యోగేంద్ర పేర్కొన్నారు.

అయితే, మీరు యోగా సాధాన చేసేముందు కొన్ని వ్యాయామాలనను మీ వైద్యుని సలహాపై చేసి ఉండాలని తెలిపారు. ఒకసారి వైద్యులు వ్యాయామం చేయవచ్చంటే, ఇక మీరు యోగ సాధన కూడా మొదలుపెట్టవచ్చు. యోగా ను నాలుగవ నెల గర్భం నుండి 9వ నెల గర్భం వరకు కూడా చేయవచ్చు.
యస్తికాసన - కండరాలను సింపుల్ గా సాగతీయుట
మీ వీపుపై వెల్లకిలా పడుకోండి. కాళ్ళు చేతుల కండరాలు బాగా చాపి రిలాక్స్ చేయండి. చేతులు పైకి ఎత్తేటపుడు గాలి లోపలికి పీల్చండి. శరీర పై భాగం చేతులు ముందుకు చాపుతూ పైకి లేపుతూ, కాళ్ళు క్రిందకు పెట్టి ఉంచండి.
సూప్త వజ్రాసన - ఈ ఆసనం వేస్తే శరీరానికి సరళత చేకూరుతుంది. వెల్లకిలా పడుకోండి. కాళ్ళు రెండువేపులకు చాపండి, ఇపుడు మీ మోకాళ్ళను బాగా వంచండి. పాదాలు రెండు కలసి నమస్తే ఆకారం చూపాలి. ఈ భంగిమను 6 సెకండ్లపాటు ఉంచి తీసేయండి. ఈ భంగిమ కటి ప్రదేశానికి బలం చేకూరుస్తుంది. బిడ్డ పుటుక తేలికవుతుంది. వీపు కింది భాగం సాగుతుంది. వెన్ను నొప్పి రాకుండా ఉంటుంది.
ఉష్ట్రాసన లేదా ఒంటె భంగిమ - మోకాళ్ళ మీద నిలబడండి. మెల్లగా వెనక్కు వాలి మీ మడమలు పట్టుకోండి. ఆరు సంఖ్యలు లెక్కించేంతవరకు అలానే ఉండండి. ఇపుడు మెల్లగా సాధారణ స్ధితికి చేరండి.
మీరు కొత్తగా చేసేవారైతే, మడమలు పట్టుకోకుండా మీ చేతులను పిరుదుల భాగం వరకె పట్టుకోండి. ఈ భంగిమ మీ వెన్నుకు బలాన్నిస్తుంది. వీపు నొప్పి లేకుండా చేస్తుంది. ఉష్ట్రాసనం మీలోని శక్తి స్ధాయిలు పెంచి రక్తం మీ తలకు ప్రవహించేలా చేస్తుంది.
ఈ ఆసనాలతో పాటుగా ....శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి. గాలి లోపలికి తీసుకోవడం, బయటకు వదలటం మెల్లగా చేయాలి. శ్వాసించేటపుడు గాలి లోపలికి తీసేటపుడు పొట్ట పైకి, వదిలేటపుడు లోపలికి పోవాలి. ఈ ఆసనాలను ఆనందకర, ఆరోగ్యకర ఒత్తిడి రహిత గర్భ ధారణకు మహిళలు చేయవచ్చు. మీరు ఈ రకంగా చేసుకుంటూ పోతే, ఏమో ఎవరికి తెలుసు మీ బిడ్డ పుట్టినా కాని మీరు ఈ ఆసనాలు కొనసాగించి ఆరోగ్యకర జీవితాన్ని గడపవచ్చు కూడాను.



Click it and Unblock the Notifications