For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నన్సీ టెస్ట్ లో నెగటివ్ రావడానికి ఐదు కారణాలు..

By Super
|

మహిళ జీవితంలో గర్భం పొందడం ఒక అద్భుతమైన విషయం. తీపి జ్ఝాపకం. తల్లిని మాత్రమే కాదు, కుంటుంబసభ్యులందరినీ సంతోషకర వాతావరణంలో ముంచెత్తే విషయం. మహిళకు ఒక కొత్త అనుభవం. ప్రపంచానికి ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోయే సమయం. ఈ సంతోషకర విషయం మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది.

మహిళ గర్భం పొందినట్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా నిర్ధారించుకోవాలి. మహిళ గర్భం పొందిన రిజల్ట్ ను తెలుసుకోడానికి గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తుంటారు . టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ గా వస్తే ఆ సంతోషానికి అవధులుండవు, అదే నెగటివ్ రిజల్ట్ వస్తే ఆమె గుండె పగిలినంత పనవుతుంది. ఆమె బాధ చెప్పలేనంతగా ఉంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ? నెగటివ్ రిజల్ట్ ను ఎందుకు చూపెడుతుందనడానికి కొన్ని కారణాలున్నాయి.

నిపుణులు అభిప్రాయం ప్రకారం మహిళ పీరియడ్ మిస్ అయిన తర్వాత కొన్ని రోజులు వేచి చూడాలి. తర్వాత హెచ్ సిజి లెవల్స్ ను గుర్తించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రెగ్నెన్సీలో నెగటివ్ రిజల్ట్ రావడం చాలా తక్కువ. పీరియడ్స్ మిస్ అయిన 10 రోజుల తర్వాత హెచ్ సిజి టెస్ట్ చేయించుకోవడం మంచిది.

పీరియడ్స్ మిస్ అయిన తర్వాత ఇతర లక్షణాలు కూడా కనబడితే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లో రెండు లైన్స్ కనబడే అవకాశం ఉంది. ప్రతి మహిళలో డిఫరెంట్ గా ఉంటుంది. మహిళ శరీరంలో హెచ్ సిజి సరిగా ఉత్పత్తి కాకపోవడానికి కూడా ఎక్కువ కారణాలున్నాలున్నాయి. అందువల్ల కూడా ప్రెగ్నెన్సీ నిలవకపోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.

ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు , కొన్ని రోజులు ఆగి తర్వాత తిరిగి మరో టెస్ట్ చేయించడం వల్ల బెటర్ ఫలితాలను పొందవచ్చు. అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ నెగటివ్ గా వస్తే, నెగటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కి కారణాలేంటో తెలుసుకోవడానికి ఇది ఒక మంచి సమయం.

Causes For A Negative Pregnancy Test

యూరిన్ : ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి ముందుగా ఎక్కువ నీళ్ళు తాగడం, అందులో హెచ్ సిజి లెవల్స్ స్రవించకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రిజల్ట్ నెగటివ్ గా రావచ్చు.

Causes For A Negative Pregnancy Test

సరైన సయంలో టెస్ట్ చేయించుకోకపోవడం: ప్రెగ్నెన్సీ టెస్ట్ ను నిద్రలేవగానే ఇంట్లో స్వయంగా చేసుకోవచ్చు. లేదా ఉదయమే డాక్టర్ ను కలవాల్సి ఉంటుంది. ఉదయం సమయంలో హెచ్ సి.జి లెవల్స్ యూరిన్ లో సక్రమంగా కలిసి ఉండటం వల్ల బెటర్ గా పాజిటివ్ రిజల్ట్ ను చూడవచ్చు.

Causes For A Negative Pregnancy Test

ప్రెగ్నెన్సీ టెస్ట్ చాలా త్వరగా చేయించుకుని ఉండొచ్చు: ఇంటర్ కోర్స్ జరిగిన ఒక వారంలోనో లేదా పది రోజులకు టెస్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పీరియడ్స్ కు ముందు టెస్ట్ చేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పీరియడ్స్ మిస్ అయిన తర్వాత మాత్రమే టెస్ట్ చేయించుకోవడం మంచిది.

Causes For A Negative Pregnancy Test

టెస్ట్ కిట్ కాలం చెల్లి ఉండవచ్చు: ప్రెగ్నెన్సీ టెస్ట్ కు ఉపయోగించే కిట్ ఎక్స్ పైర్ అయ్యి ఉండొచ్చు. కిట్ ను కవర్ నుంచి బయటకు తీసి గంటకు పైగా బయట ఉంచడం వల్ల ప్రభావం చూపించకపోవచ్చు. అలాగే కవర్ మీద ఎక్స్పైరీ డేట్ చూసి కొనాల్సి ఉంటుంది.

Causes For A Negative Pregnancy Test

హార్మోనుల ప్రభావం: మహిళ జీవితంలో హార్మోనులు వివిధ రకాలుగా ప్రభావం చూపుతాయి. గర్భిణీలు కొన్ని సురక్షితమైన నియమాలు పాటించడం వల్ల టెస్ట్ రిజల్ట్ బెటర్ గా రావచ్చు.

English summary

5 Causes For A Negative Pregnancy Test

5 Causes For A Negative Pregnancy Test. When she takes that pregnancy test and it turns out to be negative, it breaks her heart. It is said there are some reasons why the pregnancy test comes out negative.
Story first published: Friday, June 3, 2016, 14:18 [IST]
Desktop Bottom Promotion