Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పొట్టలో ట్విన్స్ ఉన్నప్పుడు తినాల్సిన బెస్ట్ ఫుడ్స్..!!
కవలలకు తల్లి కాబోతున్నారని తెలిసిందా ? అయితే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా.. పొట్టలో ట్విన్స్ ఉన్నప్పుడు మీరు, మీ క్యూట్ బేబీస్ హెల్తీగా ఉండటానికి కొన్ని ఆహారాలు కంపల్సరీ తీసుకోవాలి.
మీరు తల్లి కాబోతున్నారా ? అలాగే కవలలకు తల్లి కాబోతున్నారని తెలిసిందా ? అయితే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా.. పొట్టలో ట్విన్స్ ఉన్నప్పుడు మీరు, మీ క్యూట్ బేబీస్ హెల్తీగా ఉండటానికి కొన్ని ఆహారాలు కంపల్సరీ తీసుకోవాలి.

కడుపులో ఒక బేబీ ఉన్నా కూడా.. చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రెగ్నంట్ అయ్యారని తెలిసిన ఆ నిమిషం నుంచే.. ఆమె లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు తీసుకురావాలి. తల్లి, బిడ్డ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
గర్భిణీలు హెల్తీ డైట్ ఫాలో అవడం చాలా ముఖ్యం. అలాగే ఆమె తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. గర్భంలోని శిశువుకి పోషణ అందేలా జాగ్రత్తపడాలి. బాధ్యతగా ఫీలవ్వాలి. తల్లి హెల్తీ డైట్ ఫాలో అయితే.. బిడ్డ హెల్తీగా పుడుతుంది. ప్రెగ్నన్సీ డైంటో ఎక్కువ పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కాబట్టి ఒకవేళ మీ పొట్టలో ట్విన్స్ పెరుగుతుంటే.. ఎలాంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలో చూద్దాం..

నట్స్
నట్స్ లో పుష్కలంగా విటమిన్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పొట్టలో ఉన్న ట్విన్స్ కి కావాల్సిన పోషణ అందిస్తాయి.

పాలు
ట్విన్ ప్రెగ్నన్సీ అయినా, ప్రెగ్నన్సీ అయినా పాలు తీసుకోవడం చాలా అవసరం. తల్లి కాబోయే వాళ్లు పాలు తాగడం ఎట్టిపరిస్థితుల్లో మిస్ చేయకూడదు. ఇందులో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి.

పెరుగు
పెరుగులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ట్విన్స్ కి తల్లికి కాబోయే వాళ్లు తీసుకోవాలి. క్యాల్షియం కడుపులోని బిడ్డ ఎముకలు, పంటి డెవలప్ మెంట్ కి చాలా అవసరం.

చేపలు
ఒకవేళ మీకు చేపలు పడకపోతే.. పొట్టలో ట్విన్స్ ఉన్నవాళ్లు తినవచ్చు. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది.

శనగలు
శనగలు లేదా పెద్ద శనగల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ట్విన్స్ కి తల్లి కాబోయే గర్భిణీలు తీసుకోవచ్చు. ఇవి బేబీ కండరాల డెవలప్ మెంట్ కి సహాయపడతాయి.

ఎగ్
ఎగ్ లో అనేక రకాల విటమిన్స్, ప్రొటీన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి.. ట్విన్ ప్రెగ్నన్సీకి చాలా ముఖ్యమైనవి.

స్పినాచ్
స్పినాచ్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూర హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ ట్విన్స్ ఆరోగ్యానికి మంచిది.



Click it and Unblock the Notifications
