Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
30 కాదు 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన హీరోయిన్స్
ప్రెగ్నెన్సీ.. 30 ఏళ్లలోపే ప్లాన్ చేసుకోవాలి అంటారు. కానీ ఇది ఒక్కొక్కరికి విషయంలో ఒక్కోలా ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలోనే గర్బం దాల్చాలని సూచిస్తుంటారు. ఇదే కరెక్ట్ సమయమని.. ఈ వయసు దాటితో గర్భం దాల్చడంలో సమస్యలు వస్తాయని చాలా మంది అభిప్రాయాలున్నాయి. కానీ.. 35 ఏళ్ల తర్వాత కూడా సక్సెస్ అయిన ప్రెగ్నెన్సీలున్నాయి.
గర్భధారణ సమయంలో ఉసిరికాయ తినడం వల్ల చెప్పలేనన్ని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు...
గర్భం పొందడం విషయంలో వాళ్ల శరీరతత్వాన్ని, వాళ్ల శక్తి సామర్థ్యాలను, ఆరోగ్యాన్ని బట్టి గర్భంలో సమస్యలు, సక్సెస్ లు ఎదురవుతుంటాయి. అయితే లేటు వయసు గర్భం దాల్చడం ఇబ్బంది అనుకోవడం పొరపాటు. అయితే ఇక్కడ లేటు వయసులో అంటే 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చి సక్సెస్ అయిన సెలబ్రెటీలున్నారు. అలా లేటుగా అమ్మలయి ఆనందంగా ఉన్న ముద్దుగుమ్మలెవరో చూద్దాం..

రాణి ముఖర్జీ
రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా 2014 ఏప్రిల్ 21న పెళ్లయింది. ప్రస్తుతం రాణీ ముఖర్జీకి 37 ఏళ్లు. కానీ ఈ వయసులో ఆమె తల్లిఅయింది. ఇటీవల పుట్టిన పాపకు అదిరా అని పేరుపెట్టుకుని మురిసిపోతున్నారు.

ఐశ్వర్యా
ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ 2007 ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. 2011లో ఐశ్వర్యాకి ఆరాద్య పుట్టింది. ఐశ్వర్యా 38 ఏళ్లలో గర్భం దాల్చింది. అయితే ఎలాంటి సమస్య లేకుండా.. బిడ్డకు జన్మనిచ్చింది.

డైనా హైడెన్
మాజీ ప్రపంచ సుందరి డైయానా హైడెన్ తాజాగా అమ్మాయి పుట్టడంతో తల్లి అయింది. హైదరాబాద్ కి చెందిన ఈ బ్యూటీ తన కెరీర్ కి మ్యారేజ్ లైఫ్ అడ్డు రాకూడదని.. లేటుగా పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఈ ముద్దుగుమ్మకు పాప పుట్టింది.

ఫరా ఖాన్
ఫరా ఖాన్ 2004 డిసెంబర్ 9న శిరీష్ కుందర్ ని వివాహమాడింది. ఆమెకు న్యాచురల్ గా గర్భం పొందే అవకాశం లేకపోవడంతో.. ఆమె ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మూడు సార్లు కన్సీవ్ అయ్యింది. 2008లో ఈమె తల్లి అయింది.

శిల్పాశెట్టి
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా 2009 నవంబర్ 22న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 2012లో శిల్పాశెట్టి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ 37 ఏళ్లలలో శిల్పాశెట్టి తల్లికావడం విశేషం.

మాధురీ దీక్షిత్
ధక్ ధక్ గర్ల్ మాధురీ దీక్షిత్ కి 1999లో పెళ్లైంది. 2003లో తల్లి అయింది. మొదటిసారి గర్భం దాల్చినప్పుడు మాధురీకి 35 ఏళ్లు ఉండగా.. రెండసారి 37 ఏళ్ల వయసులో కన్సీవ్ అయింది.

నందితా దాస్
2010లో నందితాదాస్, సుబోధ్ మస్కారాకి పెళ్లి అయింది. 2010 ఆగస్ట్ లో వీళ్లు ఓ బిడ్డకి జన్మనిచ్చారు. ఆమెకు 41ఏళ్ల వయసు ఉన్నప్పుడు బిడ్డకు జన్మినిచ్చింది. అప్పుడు తన భర్త వయసు 46 ఏళ్లు.



Click it and Unblock the Notifications