Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నెలలు నిండకముందే పుట్టిన (ప్రీమెచ్యూర్) పిల్లల్లో వచ్చే అనారోగ్య సమస్యలు
గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే బిడ్డ గురించి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కొంతమంది నొప్పి ఎక్కువగా ఉంటుందని సాధారణ ప్రసవానికి భయపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ.. గర్భిణీలు ప్రశాంతత కోల్పోతారు. మెడికల్ ప్రొసీజర్, చైల్డ్ బర్త్ వంటివన్నీ అనేక రిస్క్ లు తీసుకొస్తాయి. ముఖ్యమైన సమస్య ప్రీమెచ్యూర్ బర్త్. అంటే నెలలు నిండకముందే బిడ్డ పుడితే దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ గా పిలుస్తారు. ఇలాంటి పరిస్థితులు బేబీకి అనేక సమస్యలు తీసుకొస్తాయి.
ప్రీమెచ్యూర్ బర్త్ కి అనేక కారణాలుంటాయి. అన్ హెల్తీ డైట్, ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగకపోవడం, తల్లి మెడికల్ హిస్టరీ, ఒత్తిడి, డిప్రెషన్, డయాబెటిస్, ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివన్నీ.. నెలలు నిండకముందే బిడ్డ పుట్టడానికి కారణమవుతాయి. ఒకవేళ గర్భిణీ స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రీమెచ్యూర్ బర్త్ కి ఆస్కారం ఉంటుంది. ప్రీమెచ్యూర్ బర్త్ వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..

బ్రీతింగ్ ప్రాబ్లమ్
చాలామంది ప్రీమెచ్యూర్ బేబీల్లో కనిపించే సమస్య బ్రీతింగ్. శ్వాస సంబంధిత వ్యవస్థ పూర్తీగా డెవలప్ అవకపోవడం వల్ల.. ఈ సమస్య వస్తుంది. లేదా క్రోనిక్ రెస్పిరేటరీ డిజార్డర్స్ కి అవకాశం ఉంటుంది.

లో బ్లడ్ ప్రెజర్
నెలలు నిండకముందే పుట్టిన పిల్లలో లో బ్లడ్ ప్రెజర్ కి అవకాశం ఉంది. బ్లడ్ వెజెల్స్ పూర్తీగా ఏర్పడకపోతే.. ఇలా జరిగే అవకాశం ఉంది. దీనివల్ల హార్ట్ డిఫెక్ట్స్ కి అవకాశం ఉంది.

బ్లడ్ డిజార్డర్స్
అనీమియా, జాండీస్, ఇతర బ్లడ్ సంబంధించిన సమస్యలు ప్రీమెచ్యూర్ బేబీల్లో కామన్. ఇంకా డెవలప్ కాకపోవడం వల్ల బ్లడ్ సెల్స్ వీక్ గా ఉండవచ్చు.

ఇమ్యునిటీ
నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో ఇమ్యునిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది.

మెటబాలిజం
ప్రీమెచ్యూర్ బేబీల్లో మెటబాలిక్ రేట్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. దీనివల్ల హార్మోన్ ప్రొడక్షన్ లో సమస్యలు వస్తాయి.

చూపు, వినికిడి సమస్యలు
ప్రీమెచ్యూర్ బేబీల్లో చూపు, వినికిడి సమస్యలకు ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ అవయవాలు ఇంకా పూర్తీగా డెవలప్ కాకపోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీమెచ్యూర్ అయిన కొంతకాలానికే టెస్ట్ లు చేయించడం చాలా అవసరం.

సెరబ్రల్ పాల్సీ
సెరబ్రల్ పాల్సీ అనేది నరాలకు సంబంధించిన డిజార్డర్. దీనివల్ల కండరాల సమస్య ఎదురవుతుంది. ప్రీమెచ్యూర్ బేబీల్లో ఈ సమస్యకు ఎక్కువ అవకాశాలున్నాయి. బ్లడ్ ఫ్లో సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

ప్రవర్తన
చాలామంది ప్రీమెచ్యూర్ బేబీలలో ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. సరిగా నరాల డెవలప్ కాకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.



Click it and Unblock the Notifications