For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నార్మల్ డెలివరీతో సెక్స్ లైఫ్ మీద నెగటివ్ ప్రభావం చూపుతుందా..?

గర్భం దాల్చామని తెలిసిన దగ్గర నుండీ స్త్రీలలో సవా లక్ష సందేహాలు. వారందరిలో తలెత్తే ముఖ్య ప్రశ్న సాధారణ ప్రసవం తరువాత యోనీ వదులవుతుందా అని.గర్భ ధారణ సమయం స్త్రీలకి అత్యంత సంతోషకర సమయమే కాదు, వారి అలసటక

|

గర్భం దాల్చామని తెలిసిన దగ్గర నుండీ స్త్రీలలో సవా లక్ష సందేహాలు. వారందరిలో తలెత్తే ముఖ్య ప్రశ్న సాధారణ ప్రసవం తరువాత యోనీ వదులవుతుందా అని.గర్భ ధారణ సమయం స్త్రీలకి అత్యంత సంతోషకర సమయమే కాదు, వారి అలసటకి కూడా కారణమవుతుంది. వారిలో పెరిగే గర్భస్త శిశివుని మోయడానికి వీలుగా శరీరం అనేక మార్పులకి లోనవుతూ ఉంటుంది.శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అనేక మార్పులొస్తాయి.గర్భవతులలో హార్మోన్ల మార్పులు కూడా అనేకం.

Does The Vagina Lose Its Tightness After Normal Delivery?

గర్భం ధరించిన స్త్రీలలో తమ ఆరోగ్యం మీదా, గర్భస్త శిశువు ఆరోగ్యం మీదా, ప్రసవమయ్యాకా తన ఆరోగ్యం, శిశువు ఆరోగ్యం గురించీ అనేకా సందేహాలుంటాయి.సిజేరియన్ కంటే యోనీ ద్వారా శిశువు జన్మించే సాధారణ ప్రసవమే ఆరోగ్యకరం అని మనందరికీ తెలుసు కదా.అందుకే చాలా మంది గర్భవతులు సాధారణ ప్రసవాన్నే కోరుకుంటారు.కానీ ఈ తరహా ప్రసవం వల్ల తమ యోనీ వదులుగా అయిపోతుందని చాలా మంది స్త్రీలు భయపడుతుంటారు.అసలు సాధారణ ప్రసవం యోనీని వదులు చేస్తుందా?? చదివి తెలుసుకోండి.

నార్మల్ డెలివరీతో వజైనా మీద దుష్ప్రప్రభావం చూపుతుందా

సాధారణ ప్రసవ సమయంలో అసలు ఏమవుతుంది??
సాధారణ ప్రసవ సమయంలో నెప్పులు వచ్చినప్పుడు ఏర్పడే సంకోచాల వల్ల శిశువు యోనీ యొక్క సర్విక్స్ ద్వారా బయటకి నెట్టబడుతుంది.శిశువు యోనీ ద్వారా బయటకి రావాలంటే యోనీ విస్తరించాలి.ప్రసవ సమయంలో సాధారణంగా యోనీ 5 సెంటీమీటర్ల వరకూ వ్యాకోచిస్తుంది.ఈ వ్యాకోచం లేదా యోనీ వదులవ్వడం అనేది కేవలం తాత్కాలికమేనా లేదా ఎక్కువ రోజులుంటుందా అనేది తల్లి యొక్క వయసు,ఆమెకి అప్పటికే ఎంత మంది పిల్లలున్నారు తదితర విషయాల మీద ఆధారపడి ఉంటుంది.

నార్మల్ డెలివరీతో వజైనా మీద దుష్ప్రప్రభావం చూపుతుందా

శిశు జననం తరువాత వదులయ్యే యోనీ:
యోనీ వదులవ్వడం వల్ల పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలేవీ తలెత్తవు కానీ శృగారం మీద మాత్రం ప్రభావం చూపుతుంది.యోనీ ఇలా వదులవ్వడం వల్ల తమ భాగస్వాములు ఇంతకుముందులాగ శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారని చాల మంది స్త్రీల ఫిర్యాదు.నిజం చెప్పాలంటే సర్వేలు కూడా ఇదే చెప్తున్నాయి, సాధారణ ప్రసవం అయిన తరువాత తమ భార్యలతో శృంగారం అసంతృప్తిగా ఉంటొందని మగవారు చెప్పారు.దీనికి కారణం సాధారణ ప్రసవం వల్ల యోనీ వదులవ్వడమే.

సాధారణ ప్రసవం వల్ల యోనీ వదులవ్వడాన్ని చాలా మంది స్త్రీలకి అనుభవంలోకి వచ్చిందని చెప్పచ్చు.ఒకవేళ ఇలా అయినా కూడా నిపుణులతో మాట్లాడి కొన్ని రకాలా యోనీ ఎక్సర్సైజులు చెయ్యడం ద్వారా వ్యాకోచించిన యోనీని మరలా పూర్వ స్థితికి తెచ్చుకోవచ్చు.

English summary

Does The Vagina Lose Its Tightness After Normal Delivery?

Can normal delivery affect your vagina and sex life negatively? Find out here.
Story first published: Saturday, December 3, 2016, 12:04 [IST]
Desktop Bottom Promotion