For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడని ప్రసవ లక్షణాలు..!!

By Swathi
|

ఒకవేళ మీరు గర్భిణీ అయి ఉండి.. చివరి ట్రైమ్ స్టర్ లో ఉండే.. కొన్ని ప్రసవ లక్షణాలపై మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఆ లక్షణాలను, సంకేతాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

ప్రెగ్నన్సీ సమయంలో.. మహిళలకు చాలా విషయాలపై అవగాహన ఉండాలి. డెలివరీకి ముందు వచ్చే సమస్యలు, సంకేతాలపై పూర్తీ అవగాహన ఉండాలి. గర్భిణీ స్త్రీలతో పాటు, ఆమె కుటుంబ సభ్యులు కూడా.. ఏ చిన్న మార్పు కనిపించినా.. వెంటనే స్పందించాలి. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

నార్మల్ డెలివరీ సమయంలో.. మహిళల శరీరం సొంతంగా రెడీ అయి ఉండాలి. అలాగే.. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు వాళ్ల శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. ఎప్పుడైతే.. బేబీ గర్భాశయం నుంచి బయటకు రావడానికి రెడీగా ఉంటారో.. అప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

తరచుగా యూరిన్

తరచుగా యూరిన్

డెలివరీని సూచించే లక్షణాల్లో తరచుగా యూరినేషన్ కి వెళ్లడం అనేది ఒకటి. గర్భాశయంలో బేబీ పొజిషన్ లో మార్పు వచ్చినప్పుడు.. బేబీ బయటకు రావడానికి రెడీ అయినట్టే. దీనివల్ల బ్లాడర్ పై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది.

సర్విక్స్

సర్విక్స్

ఒక వేళ మీ సర్విక్స్ పెద్దగా అయిందని.. డాక్టర్ గుర్తించారంటే.. ప్రసవానికి సంకేతం. సర్విక్స్ వెడల్పు అయినప్పుడు చైల్డ్ బర్త్ కి అనుకూలంగా ఉంటుంది.

తిమ్మిరి

తిమ్మిరి

చైల్డ్ బర్త్ సమయంలో.. కండరాలు స్ట్రెచ్ అయినప్పుడు.. మీకు పొట్ట కింది భాగంలో.. చాలా ఎక్కువగా తిమ్మరిగా అనిపిస్తుంది. ఇది ప్రసవానికి సంకేతంగా భావించాలి.

బ్యాక్ పెయిన్

బ్యాక్ పెయిన్

కండరాల్లో మార్పులు, కదలికల వల్ల.. బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. ఇది నిర్లక్ష్యం చేయకూడని ప్రసవానికి సంకేతం.

కీళ్లు

కీళ్లు

మీ కీళ్లు లూజ్ అయినట్టు ఫీలవుతారు. రిలాక్సిన్ హార్మోన్ శరీరంలో జాయింట్స్ ని లూజ్ చేయడం వల్ల.. చైల్డ్ బర్త్ తేలికవుతుంది.

మోషన్స్

మోషన్స్

ప్రసవాన్ని సూచించే లక్షణాల్లో డయేరియా ఒకటి. రిలాక్సిన్ హార్మోన్ వల్ల.. కండరాలు లూజ్ అయి.. విరేచనాలకు కారణమవుతుంది.

బరువు తగ్గడం

బరువు తగ్గడం

ప్రసవానికి సంకేతాల్లో బరువు తగ్గడం ఒకటి. అయితే ఈ లక్షణం కేవలం కొంతమంది మహిళల్లో మాత్రమే కనిపిస్తుంది. డయేరియా, ఎమినోటిక్ ఫ్లూయిడ్స్ తగ్గడం వల్ల.. బరువు తగ్గుతారు.

కాంట్రాక్షన్

కాంట్రాక్షన్

యూట్రస్ లో కండరాలు టైట్ అవడం, వదులవడం వంటి ప్రక్రియ ద్వారా.. చైల్డ్ బర్త్ కి ప్రిపేర్ అవుతుంది. దీనివల్ల కదలికలు ఏర్పడతాయి.. ఇలాంటి లక్షణాలు.. ప్రసవానికి సంకేతం.

English summary

Early Signs Of Labour That A Pregnant Woman Must Never Ignore!

Early Signs Of Labour That A Pregnant Woman Must Never Ignore! Here are a few early signs of labour you must never ignore, have a look.
Story first published: Thursday, October 6, 2016, 14:47 [IST]
Desktop Bottom Promotion