Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అలర్ట్: ప్రెగ్నెన్సీ టైంలో ఎట్టిపరిస్థితుల్లో తినకూడని ఆహారాలు..
గర్భం దాల్చినప్పటి నుంచి ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. తల్లికి, బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు. కాబట్టి మంచి పోషకవిలువలు, విటమిన్స్, ఖనిజాలు అందే ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి. అయితే గర్భధారణ సమయంలో.. కొన్ని ఆహారాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదు.
ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ప్రతి ఆహారం ఆరోగ్యకరంగా, శిశువు పెరుగుదలకు ఉపయోగపడేలా ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవడం చాలా ముఖ్యమైనది. అయితే కొన్ని ఆహారాలు ఆరోగ్యకరమే అయినా.. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి మాత్రం అవి మంచిది కాదు.
సీ ఫుడ్స్ లో మెర్క్యురీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. వాటికి దూరంగా ఉండాలి. లేదంటే అవి బిడ్డపై ప్రభావం చూపుతాయి. అలాగే కెఫీన్ ఉండే డ్రింక్స్ కి కూడా దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే.. తక్కువ వెయిట్ తో బిడ్డ పుట్టే అవకాశాలుంటాయి. వీటితో పాటు ఎలాంటి ఆహారాలకు ప్రెగ్నెంట్స్ దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

ఆల్కహాల్
గర్భధారణ సమయంలో ఆల్కహాల్ ను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. ఎందుకంటే.. ఇది కడుపులో బిడ్డ పెరుగుదలపై దుష్ర్పభావం చూపుతుంది. అంతేకాదు అబార్షన్ అవడానికి కూడా కారణమవుతుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో లో బర్త్ వెయిట్ రిస్క్ ఉంటుంది.
డైరీ ప్రొడక్ట్స్
అంటే రా మిక్స్, రా మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పచ్చిపాలతో తయారు చేసిన ఎలాంటి డైరీ ప్రొడక్ట్స్ ని తీసుకోకూడదు. ఇవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఇవి అన్ బార్న్ బేబీపై దుష్ర్పభావం చూపుతాయి. కాబట్టి పచ్చి పాలను ప్రెగ్నెంట్ ఉమెన్ అస్సలు తీసుకోకూడదు.

కెఫీన్
కెఫీన్ తో నిండిన ఎలాంటి పానీయాలు గర్భిణీ మహిళలు తీసుకోకూడదు. ఇవి రక్తహీనతకు దారితీస్తాయి. అలాగే.. శరీరంలో ఐరన్ ను తగ్గిస్తాయి. ఇవి తల్లీ, బిడ్డ ఇద్దరికీ శ్రేయస్కరం కాదు. అలాగే బ్లడ్ ప్రెజర్, హార్ట్ బీట్ ను కూడా పెంచుతాయి.

సీ ఫుడ్
గర్భధారణ సమయంలో సీ ఫుడ్ కి దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు సీ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ఎక్కువ మెర్కురీ లెవెల్స్ బిడ్డకు హాని కలిగిస్తాయి.
సాఫ్ట్ చీజ్
సాఫ్ట్ చీజ్ లో ఉండే లిస్టేరియా, బ్యాక్టీరియా గర్భధారణ సమయంలో అసౌకర్యానికి గురిచేస్తాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో సాఫ్ట్ చీజ్ కి దూరంగా ఉండటం మంచిది.



Click it and Unblock the Notifications