For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు తులసి ఆకులు ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలి ?

By Super
|

తులసిలో దాగున్న ఆరోగ్యప్రయోజనాలు లెక్కలేనివి. ఇందులో అనేక మెడిసినల్ విలువలు ఉన్నాయి. అయితే.. గర్భిణీ స్త్రీలకు ఇది మరింత శ్రేయస్కరం. అందుకే తులసి ఆకులను గర్భధారణ సమయంలో ఖచ్చితంగా తీసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తులసి ఆకు తీసుకోవడం చాలా శ్రేయస్కరం, సేఫ్ అని గుర్తుంచుకోండి.

తులసిలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో దాగున్నాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా రెగ్యులర్ గా తులసి ఆకులు తీసుకోవాలి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్స్, వ్యాధులను నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే క్రిమీ కీటకాలను నాశనం చేసే పవర్ తులసిలో ఉంది.

తులసి ఆకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉన్నాయి. అనేక రకాల వ్యాధులు నయం చేయడంలో తులసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో తులసి ఆకులు ఖచ్చితంగా తీసుకోవాలి అనడానికి అనేక కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health Benefits Of Basil During Pregnancy

బ్లడ్ క్లాటింగ్
తులసి ఆకుల్లో విటమిన్ కె ఉంటుంది. ఇది బ్లడ్ క్లాట్ లను రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి డైట్ లో తులసిని చేర్చుకోవడం వల్ల కడుపులోని బిడ్డ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. విటమిన్ కె బ్లడ్ క్లాట్ కి సహాయపడుతూ, బ్లడ్ లాస్ ని, అనీమియా రిస్క్ ని తగ్గిస్తుంది.

గర్భస్త శిశువు పెరుగుదలకు
తులసిలో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులోని బిడ్డ ఎదుగుదల, పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి, కళ్లు, బ్రెయిన్, లంగ్స్ ని హెల్తీగా ఉంచడానికి సహకరిస్తుంది. నరాల వ్యవస్థ డెవలప్ మెంట్ కి కూడా సహాయపడుతుంది.

Health Benefits Of Basil During Pregnancy

శిశువు ఎముకలు ఏర్పడటానికి
తులసి ఆకుల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది బేబీ ఎముకలు ఆరోగ్యంగా ఏర్పడటానికి సహాయపడుతుంది. అలాగే తులసి ఆకుల్లో ఉండే మాంగనీస్ ఒత్తిడిని, సెల్యులర్ డ్యామేజ్ రిస్క్ ని తగ్గిస్తాయి.

బ్లడ్ సప్లై
తులసి ఆకుల్లో ఫోలేట్ ఉండటం వల్ల అది రక్తం ఏర్పడటానికి సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రక్తం చాలా అవసరం. అలాగే బర్త్ డిఫెక్ట్ లను అరికట్టి.. సరైన పద్ధతిలో బ్లడ్ ని సప్లై చేయడానికి సహాయపడుతుంది.

Health Benefits Of Basil During Pregnancy

అనీమియా
తులసి ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ కౌంట్ ని మెరుగుపరిచి, ఎర్రరక్త కణాలను పెంచడానికి సహాయపడుతుంది. తులసి ఆకులు తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగి, అలసటని తగ్గిస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో వచ్చే అనేక సమస్యలను అరికడుతుంది.

English summary

Health Benefits Of Basil During Pregnancy

Health Benefits Of Basil During Pregnancy. Basil is a herb that is blessed with countless health benefits. It has a rich medicinal value. It can be considered as a must-have herb that a woman must consume during pregnancy.
Desktop Bottom Promotion