Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ప్రెగ్నంట్ అయ్యే అవకాశాలు న్యాచురల్ గా మెరుగుపరిచే టిప్స్..!
మీరు గర్భం పొందాలని ప్రయత్నిస్తున్నారా ? మీ ఆరోగ్యం సరిగా లేదని చింతిస్తున్నారా.. ? మీ ఎప్పటికీ కన్సీవ్ అవలేమని బాధపడుతున్నారా ? ఒకవేళ మీరు ఈ ఫీలింగ్ లో ఉంటే.. మీకు ఖచ్చితంగా ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
పిల్లలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంట్లో పిల్లలు ఉంటే.. ఎంతో హ్యాపీగా, ఉంటుందని.. ప్రతి ఒక్కరూ.. పిల్లు పొందడానికి ప్రయత్నిస్తారు. పేరెంటింగ్ లో భార్యాభర్తులు చాలా అనుభవాలు పొందుతారు. పేరెంటింగ్ కంటే.. మరే గొప్ప వరం లేదనుకుంటారు భార్యభర్తలు.
అయితే కొంతమంది భార్యాభర్తలకు పిల్లలు పొందడం చాలెంజింగ్ మారి ఉంటుంది. కొన్ని రకాల అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా.. కొంతమంది కన్సీవ్ అవడమే కష్టంగా ఉంటుంది. ఇన్ఫెర్టిలిటీ అనేది ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న సమస్య.
మోడ్రన్ టెక్నాలజీ పిల్లలు పొందలేని కపుల్స్ కి.. ఐవీఎఫ్, సరోగసీ ద్వారా పిల్లలు పొందలేని వాళ్లకి ఇవి సహాయపడుతుంది. అయితే చాలామంది ఇవన్నీ కాకుండా.. న్యాచురల్ గా ప్రెగ్నన్సీ పొందాలని ప్రయత్నిస్తారు.
మీకు అన్ని ఇన్ఫెర్టిలిటీ టెస్ట్ లు పూర్తయ్యాక, ఏదో తప్పు జరిగిందని, మీరు కన్సీవ్ అవడం కష్టమని భావించినప్పుడు.. ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఇవి న్యాచురల్ గా గర్భం పొందడానికి సహాయపడతాయి.

బరువుపై శ్రద్ధ
అధిక బరువు ఉండటం, తక్కువ బరువు ఉండటం వల్ల ప్రెగ్నన్సీకి సమస్యగా మారుతుంది. కాబట్టి.. సరైన ఆహారం, వ్యాయామం చేస్తూ.. హెల్తీ బీఎమ్ఐ మెయింటెయిన్ చేయాలి. హెల్తీ వెయిట్ ఉండటం వల్ల కన్సీవ్ అవడం తేలికవుతుంది.

కెఫీన్ కి దూరంగా
కాఫీ, కెఫినేటెడ్ ఎనర్జీ డ్రింక్స్ మహిళల్లో ఫెర్టిలిటీ పై దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి.. రోజుకి 200 ఎమ్‌జీ కంటే.. తక్కువ ఉండేలా జాగ్రత్త పడాలి.

స్మోకింగ్ మానేయడం
స్మోకింగ్ అలవాటు.. చాలా తీవ్రంగా.. స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం చూపుతుంది. మగవాళ్లలో స్మోకింగ్ స్పెర్మ్ క్వాలిటిపై, ఆడవాళ్లలో ఎగ్ పై ప్రభావం చూపుతుంది. కాబట్టి.. ఈ అలవాటు.. గర్భం పొందే అవకాశాలను తగ్గిస్తుంది. కాబట్టి.. స్మోకింగ్ మానేయాలి.

రుతుక్రమం
ఒవల్యూషన్ సరిగా ఉండేలా, రుతుక్రమం సజావుగా జరగడం వల్ల.. గర్భం పొందే అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి రుతుక్రమం ప్రతి నెలా సజావుగా వచ్చేలా జాగ్రత్త పడాలి.

ఒత్తిడి
ఇన్ఫెర్టిలిటీకి ఒత్తిడి కూడా ప్రధాన కారణం. ఇది మగవాళ్లు, ఆడవాళ్లలో.. ఇద్దరిలోనూ ఒత్తిడి ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది. కాబట్టి వర్క్ ప్రెజర్ తగ్గించుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ధ్యానం చేస్తుండాలి. దీనివల్ల ఖచ్చితంగా గర్భం పొందే అవకాశాలు పెరుగుతాయి.

ఫెర్టిలిటీ బూస్టింగ్ ఫుడ్స్
డాక్టర్ ని సంప్రదించి.. ఫెర్టిలిటీని మెరుగుపరిచే ఆహారాలు తీసుకోవాలి. నట్స్, వోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, నెయ్యి వంటివి.. డైట్ లో చేర్చుకోవడం వల్ల.. ఫెర్టిలిటీ మెరుగవుతుంది.

సప్లిమెంట్స్
డాక్టర్ ని సంప్రదించిన తర్వాత.. విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, జింక్ వంటి పదార్థాలు ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇవి.. తల్లి కావడానికి కావల్సిన పోషకాలు.. మెరుగుపడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications