For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు ఫెర్టిలిటీ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది..??

చాలా మంది మహిళలు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ పై ఆసక్తి చూపుతున్నారు. ఫెర్టిలిటీ డ్రగ్స్ తీసుకుంటున్నారు. అయితే ఈ ఫెర్టిలిటీ డ్రగ్స్ తీసుకోవడం సురక్షితమా కాదా అన్నది తెలుసుకోవడం చాలా అవసరం.

By Swathi
|

మీరు మహిళ అయి ఉండి, మీరు గర్భం పొందడానికి ప్రయత్నిస్తుంటే.. అలాగే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ని పరిగణలోని తీసుకుంటుంటూ.. ఫెర్టిలిటీ డ్రగ్స్ తీసుకోవడం సురక్షితమా ? కాదా ? అనేది ముందుగా తెలుసుకోవాలి.

మోడ్రన్ మెడిసిన్స్ మనుషులకు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా రకరకాలుగా సహాయపడుతున్నాయి. కానీ కొన్నేళ్ల క్రితం మహిళలు గర్భం పొందలేకపోతే.. కొన్ని అనారోగ్య సమస్యలే కారణంగా డాక్టర్లు తేల్చి చెప్పేవాళ్లు.

Is It Safe For Women To Take Fertility Drugs?

అయితే ప్రస్తుతం మెడికల్ సైన్స్ చాలా అడ్వాన్స్డ్ గా మారింది. ఇన్ ఫెర్టిలిటీ సమస్యను చాలా తేలికగా నివారించుకుంటున్నారు. భార్యాభర్తలు తల్లిదండ్రులు కావడానికి ఈ ఇన్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ బాగా సహాయపడుతున్నాయి.

అనేక ఫెర్టిలిటీ డ్రగ్స్ మహిళలు గర్భం పొందడానికి సహాయపడుతున్నాయని సైంటిస్ట్ లు కనుగొంటున్నారు. అలాగే ఆమె గర్భాశయంలో ఉన్న సమస్యలను కూడా నివారిస్తున్నారు. వాజినాలో లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలను కూడా చాలా తేలికగా నివారించే సాధ్యమవుతోంది.

దీంతో చాలా మంది మహిళలు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ పై ఆసక్తి చూపుతున్నారు. ఫెర్టిలిటీ డ్రగ్స్ తీసుకుంటున్నారు. అయితే ఈ ఫెర్టిలిటీ డ్రగ్స్ తీసుకోవడం సురక్షితమా కాదా అన్నది తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే వీటిని ఉపయోగించడానికి ముందు చాలా జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం.

ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్

ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్

కొన్ని సందర్భాల్లో ఫెర్టిలిటీ డ్రగ్స్ ఏమాత్రం సేఫ్ కాదు. ఎందుకంటే.. ఇవి ఓవరీస్ ను ఉత్తేజపరిచి.. ఫెర్టిలిటీని పెంచుతాయి. దీనివల్ల ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సమస్య వస్తుంది. ఇలాంటప్పుడు ఒవరీస్ లో దుర్వాసన, ఫ్లూయిడ్స్ ఎక్కువవుతాయి.

ఎక్కువ ప్రెగ్నన్సీస్

ఎక్కువ ప్రెగ్నన్సీస్

ఫెర్టిలిటీ డ్రగ్స్ ఒకేసారి ఎక్కువ ప్రెగ్నన్సీలు వచ్చే అవకాశాలను పెంచుతాయి. అలాగే ఒకేసారి ఎక్కువ ఎగ్స్ ఫెర్టిలైజ్ అవడం, ఒకటి కంటే ఎక్కువ ప్రెగ్నన్సీలు ఉన్నప్పుడు ప్రీమెచ్యూర్ బర్త్ కూడా చాలా కామన్ గా కనిపించే సమస్యలు.

ఒవేరియన్ ఫెయిల్యూర్

ఒవేరియన్ ఫెయిల్యూర్

ఫెర్టిలిటీ డ్రగ్స్ తీసుకోవడం ఏమాత్రం సురక్షితం కాదు. ఎందుకంటే.. ఇవి ఒవేరియన్ ఫెయిల్యూర్ కి కారణమవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల మహిళలో ఉత్పత్తి అయ్యే ఎగ్స్ సంఖ్య రానురాను తగ్గుతూ వస్తుంది.

ప్రిమెచ్యూర్ మెనోపాజ్

ప్రిమెచ్యూర్ మెనోపాజ్

దీర్ఘకాలంగా ఫెర్టిలిటీ డ్రగ్స్ ఉపయోగిస్తే.. ప్రీమెచ్యూర్ మెనోపాజ్ కి కారణమవుతుంది. ఫెర్టిలిటీ డ్రగ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కూడా కారణమవుతాయి.

ఒవేరియన్ క్యాన్సర్

ఒవేరియన్ క్యాన్సర్

ఎక్కువ కాలం ఫెర్టిలిటీ డ్రగ్స్ తీసుకునే మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

డిప్రెషన్

డిప్రెషన్

ఫెర్టిలిటీ డ్రగ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కారణమై, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి కారణమవుతాయి. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

బరువు పెరగడం

బరువు పెరగడం

ఫెర్టిలిటీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి కారణమవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వాటర్ రీటెన్షన్ దీనికి కారణంగా చెప్పవచ్చు.

English summary

Is It Safe For Women To Take Fertility Drugs?

Is It Safe For Women To Take Fertility Drugs. Wondering if taking fertility drugs is safe? Here is everything you need to know about them.
Desktop Bottom Promotion