For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ వల్ల ఎదురయ్యే సమస్యలు

By Swathi
|

ప్రెగన్నెన్సీ టైంలో ఆరోగ్యం చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. పాదాల్లో వాపు, వాంతులు, వికారం, అలసట ఇలా రకరకాల సమస్యలకు అంతే లేకుండా ఉంటుంది. అయితే ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతాయో.. అప్పుడు పరిస్థితి చాలా సీరియస్ గా మారిపోతుంది.

ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ కూడా.. బిడ్డపై ప్రభావం చూపుతుంది. హై లేదా లో థైరాయిడ్ ప్రెగ్నెన్సీ టైంలో బేబీపై చాలా ఎక్కువ దుష్ర్పభావం చూపుతుంది. ఒకవేళ మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే.. ప్రెగ్నెన్సీ సమయంలో ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొంత మంది మహిళలు.. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ థైరాయిడ్ సమస్యలకు ఎదుర్కొంటారు.

డెఫిసియన్సీ లేదా ఎక్స్ సస్ థైరాయిడ్ హార్మోన్స్ ఏదైనా.. కడుపులోని బిడ్డకు హాని కలిగిస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటే.. మీ కడుపులోని బిడ్డకు కలిగే హాని ఏంటో ఇప్పుడు చూద్దాం..

Major Problems and Effects Of Thyroid During Pregnancy

అబార్షన్ రిస్క్
ఒకవేళ ఫస్ట్ ట్రైమ్ స్టర్ లో మీ బ్లడ్ థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటే.. మీకు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని సరైన మందులు తీసుకోవడం వల్ల అరికట్టవచ్చు. కాబట్టి.. గర్భం దాల్చిన తర్వాత, ముందు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

నరాల డెవలప్ మెంట్
థైరాయిడ్ హార్మోన్స్ శరీరంలో తగ్గినప్పుడు .. కొన్ని సందర్భాల్లో బేబీ మెంటల్ డెవలప్ మెంట్ కి సమస్యగా మారతాయి. గర్భధారణ సమయంలో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండగా.. బిడ్డకు జన్మనిస్తే.. వాళ్లకు మానసిక సమస్యలు, తక్కువ ఐక్యూ లెవెల్స్ ఉండే అవకాశం ఉంది.

Major Problems and Effects Of Thyroid During Pregnancy

ప్రీటర్మ్ బర్త్
కొన్నిసార్లు.. గర్భధారణ సమయంలో థైరాయిడ్ గ్లాండ్ యాక్టివిటీ సరిగా లేకపోతే.. ప్రీఎక్లంప్సియాకి కారణమవుతుంది. అంటే.. ప్రెగ్నెన్సీ టైంలో హైబ్లడ్ ప్రెజర్ సమస్య. ఇది బేబీపై వ్యతిరేక ప్రభావం చూపి.. ప్లేసాంటా సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల కొన్నిసార్లు ముందుగానే ప్రసవం అవడానికి అవకాశాలుంటాయి.

బేబీ థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్
ప్రెగ్నెన్సీ సమయంలో.. థైరాయిడ్ ట్రీట్మెంట్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కొన్ని రకాల మందుల్లో రేడియో యాక్టివ్ ఐయోడిన్ ఉంటుంది. ఈ మందులు బేబీ పొట్టలో ఉన్నప్పుడు తీసుకుంటే.. బేబీ థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ కి కారణమవుతుంది. కాబట్టి థైరాయిడ్ మెడిసిన్స్ డాక్టర్ రాసిచ్చినప్పుడు మీ పొట్టలో బేబీ ఉన్నట్టు వివరించాలి.

English summary

Major Problems and Effects Of Thyroid During Pregnancy

Major Problems and Effects Of Thyroid During Pregnancy. Effects Of Thyroid During Pregnancy. Pregnancy is a period of time when your health complications get compounded.
Story first published:Saturday, June 25, 2016, 10:24 [IST]
Desktop Bottom Promotion