Latest Updates
-
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త!
ప్రెగ్నెన్సీని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనడానికి కారణాలు..!
మొదటిసారి ప్రెగ్నంట్ అయ్యారా ? అయితే ఆ మధురానుభూతులను మరింత ఆనందంగా ఎంజాయ్ చేయాలి. మరో కొత్త ప్రాణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప వరం మహిళలది. పొట్టలో బిడ్డను మోస్తున్నప్పుడు ఆ తల్లికి కలిగే ఆనందం వర్ణించలేనిది. అయితే పెరుగుతున్న శిశువు తన గర్భాశయంలో ఏం చేస్తున్నాడో ? అన్న ఆలోచనలు ప్రతి గర్భిణీ స్త్రీని ప్రశ్నిస్తుంటాయి.
గర్భాశయంలో బేబీ.. చేసే ఆశ్చర్యకర విషయాలు
మీరు ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ తెలియగానే పట్టలేనంత సంతోషంతో.. ఉంటారు. నిజమే కదా ? అయితే గర్భిణీ స్త్రీలు తమ తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి అనేక సమస్యలు ఫేస్ చేస్తారు. బ్లోటింగ్, వెయిట్ గెయిన్, పొట్ట సమస్యలు.. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఇవన్నీ కాకుండా.. గర్భధారణ సమయంలో.. కొన్ని అనుభూతులు మధురానుభూతులను మిగులుస్తాయి. పొట్టలో బేబీ కదలికలు, కడుపులో తన్నడం వంటి ఫీలింగ్స్ వివరించలేని మధుర క్షణాలుగా మిగిలిపోతాయి.
అలాగే తల్లి కాబోతున్న మీరు ఆ సమయాన్ని మరింత ఎంజాయ్ చేయడానికి, ఆస్వాదించడానికి కొన్ని కారణాలున్నాయి. ప్రెగ్నెంట్ గా మీ జీవితాన్ని మరింత ఇష్టపడటానికి కొన్ని కారణాలు మీకోసం..

ఆదరణ
మీకు తెలియని వాళ్లు కూడా మిమ్మల్ని ప్రెగ్నంట్ గా చూసి.. మీవైపు స్మైల్ ఇస్తారు. బస్ లో మీకు సీటు ఇస్తారు. జాగ్రత్తగా ఉండమని.. చెప్పకనే చెబుతారు. మీ చుట్టు పక్కలవాళ్లు అందరూ మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు.

ఒంటరి కాదు
ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏమో గానీ.. మీ పొట్టలో బేబీ పెరిగే కొద్దీ మీలో చాలా సంతోషం ఉంటుంది. అంతేకాదు.. కొద్దిగా పొట్ట పెరుగుతుంటే.. మీరు ఒంటరిగా ఉన్నా.. తోడు ఉన్నారన్న ఫీలింగ్ కలుగుతుంది. బేబీ మీతోనే ఉన్నారన్న అనుభూతి చాలా సంతోషకరంగా ఉంటుంది.

జుట్టు, స్కిన్
ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెరగడం వల్ల.. మీకు చాలా అనుకూలంగా మారుతుంది. చాలామంది గర్బిణీ స్త్రీలు ఈ సమయంలో.. చాలా హెల్తీగా, షైనీగా కనిపిస్తారు. జుట్టు, చర్మం, గోళ్లు అందంగా మారతాయి. ఎలాంటి క్రీములు అప్లై చేయకపోయినా.. చాలా గ్లోయింగ్ గా కనిపిస్తారు.

9వ నెలలో ఊహలు
9 నెలలు నిండిన గర్భిణీలో ఊహలు.. చాలా అద్భుతంగా ఉంటాయి. నిద్రలేచింది మొదలు.. ఎన్నో అనుభవాలు, ఉత్సాహం, అంతా అద్భుతంగా ఉంటుంది. అయితే కొంచెం భయం, ఆందోళన ఉన్నప్పటికీ.. ఎవరు పుడతారో, ఎలా ఉంటారో అన్న సంతోషం రెట్టింపు ఉంటుంది.

ఆరోగ్యకరమైన సమయం
తొమ్మిది నెలల పాటు.. హెల్తీ డైట్, సరిపడా నిద్ర, రకరకాల టిప్స్ ఫాలో అవడం వల్ల.. జీవితంలో మీరు ఉండే అత్యంత ఆరోగ్యకరమైన సమయం ఇది. అందుకే ఇది మీ జీవితంలోనే అత్యంత ఆరోగ్యకరమైన సమయం అని చెప్పవచ్చు.

బరువు పెరగడం
ఎలాగూ గర్భధారణ సమయంలో బరువు పెరగడం ఖాయం. కాబట్టి.. మీకు ఏది తినాలనిపిస్తే అది తినడం, శరీరం ఏం కోరుకుంటే అది చేసేయండి. ఏ టైంలో ఏది తినాలనిపించినా.. తినేయాలి. క్యాలరీలు తీసుకుంటున్నామన్న బెంగ అవసరం లేదు.

ఏం చేయాలనిపిస్తే అది..
ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఏది చేయాలి అనిపిస్తే.. అది చేసే అధికారం మీకు ఉంది. ఎలాంటి పొరపాటు చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మీకు అడ్డుచెప్పేవాళ్లు ఉండరు. కాబట్టి.. చాలా సెల్ఫిష్ గా ఉండటమే మంచిది.



Click it and Unblock the Notifications