For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం పొందాలనుకునే మహిళలకు శతావరి అద్భుత ఔషధం..!

By Swathi
|

మగవాళ్లు, ఆడవాళ్లలో ఇన్ఫెర్టిలిటీని నివారించడానికి ఆయుర్వేదంలో శతావరిని ఉపయోగిస్తారు. పూర్వ కాలం నుంచి ఈ మూలికను ఉపయోగిస్తున్నారు. దీన్ని టానిక్ లలో వాడతారు. శతావరిని వాత, పిత్త దోషాలు నివారించడానికి ఉపయోగిస్తారు.

దీన్ని సాధారణంగా ట్యాబ్లెట్స్ లేదా పొడి రూపంలో తీసుకుంటారు. అయితే శతావరిని సరైన మోతాదులో.. ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు ఉపయోగించాలి. అయితే శతావరి.. మహిళల్లో సంతానోత్పత్తి సమస్య నివారించడానికి ఉపయోగిస్తారు.

Shatavari: A Boon for Women Trying to Conceive

శతావరి శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. అలాగే శరీరంలో టాక్సిన్స్ ని తొలగించి.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే గర్భంలో హెల్తీ బేబీ పెరగడానికి కావాల్సిన అనువైన వాతావరణాన్ని కల్పించడంలో శతావరి గ్రేట్ గా సహాయపడుతుంది.

శతావరిలో స్టెరాడల్ సాపోనిన్స్ ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడానికి సహాయపడతాయి. ఈస్ట్రోజెన్ లెవెల్స్ శరీరంలో సక్రమంగా ఉండటం వల్ల.. రుతుక్రమ సమస్యలు, ఒవ్యులేషన్ సమస్యలను నివారించవచ్చు. అలాగే ఫెర్టిలిటీ ఛాన్సెస్ ని పెంచడానికి సహాయపడుతుంది.

Shatavari: A Boon for Women Trying to Conceive

ఇన్ఫెర్టిలిటీకి ప్రధాన సమస్య ఒత్తిడి. ఒత్తిడి కారణంగా అండోత్సత్తి లేటుగా జరగడం లేదా జరగకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురయ్యే మహిళల్లో ఫాలోపిన్ ట్యూబ్స్ మూసుకుపోతాయి. ఒవేరియన్ సిస్ట్, ఎండోమెట్రియోసిస్, హైపోథైరాయిడిజం సమస్యలు కూడా ఎదురవుతాయి.

శతావరి తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవడానికి సహాయపడతాయి. తెల్ల రక్త కణాలు.. ఇలాంటి సమస్యలన్నింటితో పోరాడతాయి. అలాగే శరీరంలో మలినాలను కూడా బయటకు పంపుతాయి. అలాగే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Shatavari: A Boon for Women Trying to Conceive

పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనే వ్యాధి మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కారణమవుతుంది. అలాగే అండోత్పత్తిపై కూడా దుష్ర్పభావం చూపుతుంది. శతావరి.. ఫోలిక్యులర్ మెచ్యురిటీ మెరుగుపరిచి, రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని నివారించి, ఫెర్టిలిటీ ఛాన్సెస్ పెరగడానికి సహాయపడుతుంది.

శతావరి సీక్రెషన్ ఆఫ్ సెర్వికల్ మస్కస్ కి సహాయపడుతుంది. అండోత్పత్తి సమయంలో.. ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని పెంచడంలోనూ సహాయపడుతుంది. మస్కస్ స్పెర్మ్ రీప్రొడక్టివ్ ట్రాక్ లోకి ప్రవేశించి, ఎగ్ ని చేరడానికి సహాయపడతుంది. కాబట్టి కన్సీవ్ అవ్వాలని భావించే మహిళలు.. శతావరిని ఉపయోగించడం వల్ల ఆశించిన ఫలితాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Shatavari: A Boon for Women Trying to Conceive

Shatavari: A Boon for Women Trying to Conceive. In Ayurveda, Shatavari is used to treat infertility in both men and women. It is a great rejuvenative herb and has been used as a tonic for a long period of time.
Story first published:Wednesday, June 22, 2016, 16:53 [IST]
Desktop Bottom Promotion