For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ఇన్ఫెర్టిలిటీ లక్షణాలు..!!

By Swathi
|

కన్సీవ్ అవడానికి మీరు ప్రయత్నిస్తున్నారంటే.. మీ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే.. ఒకరకంగా చెప్పాలంటే.. కాస్త ఒత్తిడిగానూ ఉంటుంది. అయితే కొంతమందికి కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా పిల్లలను పొందలేకపోతారు. దీనివల్ల వాళ్లు కన్సీవ్ అవడం కూడా కష్టంగా మారుతుంది. అలాంటప్పుడు ఆ పరిస్థితిని ఫేస్ చేయడం కూడా మరింత భయంకరంగా ఉంటుంది.

పిల్లలు లేకుండా జీవితాంతం గడపాలంటే.. వాళ్లకు మరింత కష్టంగా ఉంటుంది. వాళ్ల జీవితమే అనర్థం అన్న ఆందోళన వేధిస్తుంది. ఇన్ఫెర్టిలిటీ అనేది.. అనేక కారణాల వల్ల కలుగుతుంది. అన్ హెల్తీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, పోషకాహారం తీసుకోకపోవడం, గర్భాశయంలో సమస్యలు, మగవాళ్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, ఎరెక్టిల్ డిస్ ఫంక్షన్, స్మోకింగ్ వంటివి కూడా కారణమవుతాయి.

అయితే దంపతుల్లో ఇన్ఫెర్టిలిటీకి ముఖ్య కారణం ఏంటో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే.. కొన్ని రకాల లక్షణాలు.. వాళ్లలో ఇన్ఫెర్టిలిటీని సూచిస్తాయి. వీటిని ముందుగానే గుర్తించడం వల్ల.. వెంటనే చికిత్స అందించవచ్చు.

కన్సీవ్ అవకపోవడం

కన్సీవ్ అవకపోవడం

మీరు ఆరు నెలలుగా కన్సీవ్ అవడానికి ప్రయత్నిస్తున్నా.. సక్సెస్ అవడం లేదంటే.. ఇన్ఫెర్టిలిటీకి సంకేతంగా భావించాలి. కన్సీవ్ అవడానికి 6 నెలలు ఐడియల్ టైం. ఇది దాటిందంటే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

ఇర్రెగ్యులర్ పీరియడ్స్

ఇర్రెగ్యులర్ పీరియడ్స్

మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటోంది అంటే.. ఇన్ఫెర్టిలిటీ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పీసీఓడీ చెక్ చేయించుకోవాలి.

ఎక్కువగా బ్లీడింగ్ అవడం

ఎక్కువగా బ్లీడింగ్ అవడం

మీకు పీరియడ్స్ హెవీగా అవడం, 5రోజుల కంటే.. ఎక్కువగా బ్లీడింగ్ అవడం కూడా.. ఇన్ఫెర్టిలిటీకి కారణం కావచ్చు.

నొప్పి

నొప్పి

పీరియడ్స్ సమయంలో.. మీరు ఎక్కువ నొప్పికి లోనవుతుండటం, ప్రతి నెలా.. ఈ నొప్పి రెండు రోజులకంటే ఎక్కువగా ఉండటం జరుగుతుంటే.. ఎండోమీట్రిఓసిస్ రిస్క్ ఉంటుంది. ఇది.. ఇన్ఫెర్టిలిటీకి దారితీయవచ్చు.

సిస్కిక్ యాక్నె

సిస్కిక్ యాక్నె

20 లేదా 30లలో ఉన్నా కూడా.. మీరు హఠాత్తుగా యాక్నెకి గురవుతున్నారంటే.. పీసీఓడీకి సంకేతం కావచ్చు. ఇది.. ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది.

బీజావయవము

బీజావయవము

ఒకవేళ మీ బీజావయవం వాపు ఉన్నట్టు మీరు గుర్తిస్తే.. వారికోసెల్ అనే పరిస్థితి సంకేతం కావచ్చు. ఇది.. ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది.

డ్రై ఆర్గాన్స్

డ్రై ఆర్గాన్స్

ఒకవేళ డ్రై ఆర్గాన్స్ కలిగిన మగవాళ్లు అయి ఉండి.. స్కలనం అవకపోవడం, వీర్యం ఉత్పత్తి కాకపోవడం జరుగుతుంది.. అది ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది.

English summary

Surprising Signs Of Infertility You Must Not Ignore!

Surprising Signs Of Infertility You Must Not Ignore! If you have been trying to conceive and start a family for a while now, you will surely understand how frustrating and emotionally stressful it can all be!
Story first published:Thursday, July 28, 2016, 16:42 [IST]
Desktop Bottom Promotion