For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో హై-ఫ్యాట్ డైట్ పిల్లల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందా?

By Lakshmi Perumalla
|

గర్భధారణ సమయంలో అధిక కొవ్వు పదార్ధాలను తినటం వలన పుట్టే పిల్లలలో ఆందోళన మరియు నిరాశ వంటి మానసిక ఆరోగ్య రుగ్మతలు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జంతువులలో చేసిన అధ్యయనంలో ఒక అనారోగ్య ఆహారం తల్లులలో కూడా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అంతేకాక పుట్టే పిల్లల మెదడు మరియు ఎండోక్రైన్ వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపుతుంది. ఇవి దీర్ఘ శాశ్వత మానసిక రుగ్మతలను కలిగిస్తాయి.

Maternal High-Fat Diet

ప్రభావం 1
అభివృద్ధి చెందిన దేశాలలో అధిక కొవ్వు పదార్ధాలను తినటం వలన తల్లులలో ఊబకాయం వస్తుంది. దీని ఫలితంగా భవిష్యత్ తరాల మానసిక ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ (OHSU) లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలినార్ సుల్లివన్ అంటున్నారు.

జ్వరం తగ్గడానికి 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

Maternal High-Fat Diet

ప్రభావం 2
గర్భధారణ సమయంలో అధిక కొవ్వు పదార్ధాలను తినటం వలన ఎక్స్పోషర్ సెరోటోనిన్ కలిగిన న్యూరాన్స్ అభివృద్ధి బలహీనపడుతుంది. ఈ న్యూరోట్రాన్స్మిటర్ మెదడును అభివృద్ధి చేయడంలో చాలా కీలకమైనది.

Maternal High-Fat Diet

ప్రభావం 3
మరోవైపు చిన్న వయస్సులో ఉన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వటంలో కూడా విఫలం అవుతారని పరిశోధకులు అంటున్నారు.

ఈ విషయం మీద తల్లిని నిందించకూడదు. గర్భధారణ సమయంలో అధిక కొవ్వు ఆహారం యొక్క సంభావ్య ప్రమాదాల గురించి గర్భిణీ స్త్రీలను విద్యావంతులను చేయటం మరియు వారికి వారి కుటుంబ మద్దతు ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు ఉండాలని మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను ప్రోత్సహించే పబ్లిక్ విధానాలను రూపొందించాలని సుల్లివన్ పేర్కొన్నారు.

వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్తలు

Maternal High-Fat Diet

ప్రభావం 4
ఎండోక్రినాలజీ జర్నల్ ఫ్రాంటియర్స్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఒక బృందం ఒక తల్లి అధిక-కొవ్వు ఆహారం యొక్క ప్రభావాన్ని పరీక్షించింది. వారి ఆహారాన్ని కఠినంగా నియంత్రించడం సాధ్యం కాదని తెలిపింది.

పరిశోధకులు మొత్తం 65 మంది జపాన్ మాకాక్లను రెండు గ్రూపులుగా విభజించారు. గర్భధారణ సమయంలో ఒక గ్రూప్ కి అధిక కొవ్వు ఆహారం మరొక గ్రూప్ కి నియంత్రణ ఆహారం ఇచ్చారు.

ఆ తరువాత 135 మంది పిల్లలలో ఆందోళన వంటి ప్రవర్తన వంటి వాటిని పోల్చి చూస్తే, గర్భధారణ సమయంలో అధిక కొవ్వు ఆహారం తీసుకున్న వారిని నియంత్రిత ఆహారం తీసుకున్నవారితో పోలిస్తే అధిక కొవ్వు ఆహారం తీసుకున్న వారిలో ఎక్కువ ఆందోళన ఉన్నట్టు గమనించారు.

English summary

Maternal High-Fat Diet May Affect Kids' Mental Health

"Given the high level of dietary fat consumption and maternal obesity in developed nations, these findings have important implications for the mental health of future generations
Desktop Bottom Promotion