Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పాలిచ్చిన తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ రాదు..! తల్లిపాలిస్తే ఎన్నో ప్రయోజనాలు, అద్భుతాలు..!
బిడ్డ పుట్టగానే తల్లి పాలకు మించిన ఔషదం వుంటుందా. తల్లి పాలకు మించి మంచి ఆహారం బిడ్డకు వుంటుందా. తల్లిపాలు మంచివేనని ప్రపంచం మొత్తం చెబుతున్నా కొన్ని సందర్భాల్లో తల్లిపాల తాగించవద్దని అంటున్నారు. అన్ని పోషకాలను కలిగి వుండడం తల్లిపాల లక్షణం. తల్లి పాలల్లో యాంటీబాడీలు, ఎంజైములు, హార్మోన్లు, బయాయాక్టివ్ కాంపోనెంట్లు ఇలా అన్నీ వుంటాయ్. తల్లి పాలల్లో ఉండే ఆశ్చర్యకరమైన విషయమేమంటే బిడ్డ పెరుగుదలను బట్టి తల్లిపాలు కూడా బిడ్డకు ఎదుగుదలకు అనుగుణంగా మారుతుంటాయ్. తల్లీ, బిడ్డ మధ్య అనుబంధాన్ని కూడా పెంచుతుంది. ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం తల్లి పాలు.
తల్లిపాలతో పసికందులో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
తల్లిపాలు బిడ్డను ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది. ఇందులో వుండే అధిక ప్రొటీన్లు ఆ పనిచేస్తాయ్. బిడ్డ ఆరోగ్యానికి సంరక్షణగా ఆయుధంగా తల్లిపాలు వ్యవహరిస్తాయని అనుకోవచ్చు.
పసికందులో జీర్ణ ప్రక్రియ వేగంగా జరగదు, మనుషులు తయారు చేసిన ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి ఆ పసికందుకు వుండదు. బిడ్డలో జీర్ణవ్యవస్థ కూడా పూర్తిగా తయారు కాకుండా వుంటుంది. అలాంటి సందర్భంలో తల్లిపాలే ఉపయోగపడతాయ్. తల్లిపాలల్లో ప్రొటీన్లు రెడీగా వుంటాయ్, కొవ్వు, కార్బొహైడ్రేట్లు కూడా వెంటనే బిడ్డకు చేరుస్తుంది.

తల్లిపాలల్లో వుండే రోగనిరోధకశక్తి ఎన్నో ఎలర్జీల నుంచి రోగాల బారి నుంచి కాపాడుతుంది. ఇందులో వుండే యాంటీబాడీలు, స్టెమ్ సెల్స్, హార్మోన్లు బిడ్డకు బలాన్ని పెంచుతాయ్. తల్లి తన పాలను బిడ్డకు ఇవ్వడమంటే రోగాలకు వ్యతిరేకంగా పోరాడమని ఆయుధమిచ్చినట్టే.
పసికందు మెదడు వృద్ది చెందాలన్నా, ఎదుగుదల కావాలన్నా తల్లిపాలు చాలా అవసరం. తల్లిపాలు ఇవ్వడం ద్వారా కేవలం పోషకాలు అందించడమే కాదు తల్లికీ, బిడ్డకు మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.బిడ్డపైన కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది.
తల్లిపాలను దానం చేయండి. పసికందుల ఆరోగ్య సంరక్షణకు ఇది మంచి మార్గం. కొన్ని దేశాల్లో తల్లిపాలను దానం చేస్తున్నారు. కానీ తల్లిపాలను దానం చేసే ముందు అన్ని రకాలైన పరీక్షలను చేయించుకోవాలి. వైద్యులు అనుమతిస్తేనే తల్లిపాలను దానం చేయడానికి సిద్ధంగా వుండాలి.
తల్లిపాలను మొదటి ఆరు నెలలు తాగిన బిడ్డలకు ఇన్ఫెక్షన్లు తక్కువగా వస్తున్నట్లు కనుగ్గొన్నారు. ఆ బిడ్డలకు తరువాత చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకు సంభంధించిన ఇబ్బందులు, డయేరియా రాకుండా వుంటాయని. తల్లిపాలు తాగిన బిడ్డల్లో తరువాత ఐక్యూ స్కోర్ బాగా పరిగినట్లు కూడా తేలింది.
తల్లిపాలు తాగితే ఏ వయసులో ఎంత బరువుండాలో అంత బరువుంటారని, లేదంటే పిల్లలు అధికబరువు సమస్యతో బాధపడే అవకాశముందంటున్నారు. పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా వుంటాయంటున్నారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లులు త్వరగా తమ క్యాలరీలను బర్న్ చేయగలుగుతారు. దీంతో గర్భం దాల్చిన తరువాత వచ్చిన బరువును సులువుగా కోల్పోతారు. బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గిపోతాయ్.
తల్లిపాలకు బదులుగా డబ్బా పాలను ఇవ్వాలంటే దానికి సంబంధించిన మిల్క్ పౌడర్ ఖరీదు చాలా వుంటుంది. తల్లి పాల ద్వారా డబ్బాపాలకు అయ్యే చాలా ఖర్చు తగ్గిపోయినట్లే కదా. ప్రపంచంలో ప్రముఖ మెడికల్ పరిశోధకలు, నిపుణులు తల్లిపాలను బిడ్డకు ఎలాగైనా ఇవ్వాలని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications