Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేస్తే ఏమవుతుందంటే..
ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల మార్పులు సహజం. అయితే ఈ హార్మోన్ల మార్పులు వల్ల చాలా మందిలో శృంగార కోరికలు పెరుగుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన కొన్ని రోజుల్లో సెక్స్‌ను ఆస్వాదించాలని, భాగస్వామితో రతిక్రీడలో పాల్గొనాలని చాలా మందిలో కోరికలు రాచుకుంటాయి. చాలా రోజుల గ్యాప్ వచ్చేస్తుందన్న భయంతో చాలా మంది సెక్స్ కోసం తహతహలాడుతుంటారు.
ఎక్కువ రోజులు దూరంగా ఉండాలన్న విరహ వేదన కూడా కుదురుగా ఉండనివ్వదు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేసుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువుకు ఏమైన ఇబ్బంది కలుగుతుందన్న భయం వల్ల చాలా మంది శృంగారానికి దూరంగ ఉంటారు. అయితే వైద్యులు శృంగారానికి దూరంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పనంత వరకు సెక్స్ లో పాల్గొనవచ్చు.

అయితే శృంగారం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. జననేంద్రియాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రొమాన్స్ చేయడం వల్ల మరింత మెరుగైన భావప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది శక్తివంతమైన ఇంద్రియ ఉద్వేగానికి కారణం అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం.
శరీరానికి వ్యాయామం:
శృంగారం చేయడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. మంచి రతిక్రీడలో పాల్గొంటే చెమట పట్టి శరీరం కష్టపడుతుంది. దీని వల్ల ఒంట్లోని కొవ్వు కరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చిన్న పాటి వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తారు. అలాంటి వారు కొన్ని సార్లు ఎక్సర్‌సైజ్ మిస్ అయిందన్న బాధ అవసరం లేకుండా హ్యాపీగా, తృప్తిగా ఉండేలా సెక్స్ లో పాల్గొంటే చాలు. సుఖానికి సుఖం, వ్యాయామానికి వ్యాయామం అందుతుంది.
దంపతుల మధ్య సాన్నిహిత్యం, ప్రేమ:
ప్రెగ్నెన్సీ సమయంలో దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. మొదటిసారి గర్భం దాలిస్తే చాలా మంది స్త్రీలు తమ పుట్టింటికి వెళ్లిపోతారు. అలా కూడా దంపతుల మధ్య ఎడబాటు వచ్చేస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం మెరుగుపడుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాంటి వారు భర్తతో శృంగారంలో పాల్గొంటే ఒత్తిడిని దూరం చేసే హార్మోన్లు విడుదలై హ్యాపీ మూడ్ ను అందిస్తాయి. ఒత్తిడి తగ్గించుకునేందుకు, దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని కాపాడుకునేందుకు శృంగారంలో పాల్గొనండి.
రొమాన్స్‌తో ఇమ్యూనిటీ:
పలు అధ్యయనాల ప్రకారం శృంగాం చేయడం వల్ల శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయి. ఇది జలుబు, ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మంచి మందుగా కూడా శృంగారం పని చేస్తుంది.
ప్రశాంతత, సంతోషం:
ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం మిగతా రోజుల్లో చేసుకునే సెక్స్ కన్నా మరింత ఆనందాన్ని ఇస్తుంది. మరింత ఉత్సాహంగా శృంగారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో విడుదలయ్యే హార్మోన్లు, శృంగారం సమయంలో విడుదలయ్యే హార్మోన్లు వల్ల ఈ మంచి ఉద్రేకమైన అనుభూతి కలుగుతుంది. అలాగే సెక్స్ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు మంచి మూడ్ ను తీసుకువస్తాయి. ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను అందిస్తాయి. ఇది తల్లికి, గర్భంలో ఉన్న బిడ్డకు మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications