Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పిల్లలకు ఏ వయసులో టీ, కాఫీలు ఇవ్వాలో తెలుసా?
ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల వయసుతో సంబంధం లేకుండా టీ, కాఫీలు తాపిస్తున్నారు. ఉదయాన్నే ఇలా గ్లాసులకు గ్లాసుల కాఫీలు, టీలు తాగించడం వలన వారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వారి శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వారి జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే పిల్లలు ఏ వయసులో టీ తాగాలి? వారికి ఏ వయసులో టీ తాపించడం మంచిది, దీనిపై నిపుణులు ఏ చెబుతున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వైద్యులు ఏం చెబుతున్నారు?
మనదేశంలో టీ, కాఫీలకు చాలా పెద్ద క్రేజ్ ఉంది. ప్రతిరోజూ ఈ టీ, కాఫీల ద్వారానే చాలా మంది తమ రోజును ప్రారంభిస్తారు. ముఖ్యంగా నగరాలలో జీవించే వారు యువతరం కాఫీ తాగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే చిన్న వయసులోనే పిల్లలకు కాఫీలు, టీలు ఇవ్వకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, చాలా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తమ పిల్లలకు టీ లేదా కాఫీ ఇవ్వడం కొనసాగిస్తారు. ఈ అలవాటు వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంలో ఇబ్బంది కలుగుతుంది.

పిల్లలకు ఏ వయసు నుంచే టీ ఇవ్వాలి?
ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్లు పిల్లలకు టీ లేదా కాఫీ ఇవ్వాలంటే వారి వయసు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. చిన్న వయసులో పిల్లలకు టీ ఇవ్వడం వల్ల.. టీ లేదా కాఫీలో ఉండే టానిన్లు, కెఫిన్ వల్ల పిల్లల శరీరంలో కాల్షియం, మిగతా పోషకాల లోపం ఏర్పడుతుంది, ఇది వారి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. 18 సంవత్సరాల తర్వాత కూడా, పిల్లలకు టీ లేదా కాఫీ తక్కువ పరిమాణంలో ఇవ్వడం మంచిది.
జలుబు అయినప్పుడు..
చిన్న వయసులో, పిల్లలకు జలుబు, వాంతులు అయినప్పుడు వారికి వేడి టీ ఇవ్వడం మంచిదని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ ఇది తప్పు. టీలో ఉండే టానిన్, పిల్లల ఎముకలు, దంతాలను బలహీనపరుస్తుంది. కాబట్టి, ఈ అలవాటు వారి శారీరక ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.
అలాగే కాఫీలో అధికంగా ఉండే కెఫిన్, పొట్ట సమస్యలను రెట్టింపు చేస్తుంది. ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల పిల్లల స్లీపింగ్ టైమింగ్స్ దెబ్బతింటుంది, ఇది వారి పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో, పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దృష్ట్యా, 18 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు టీ, కాఫీ వంటి పానీయాలను వారికి ఇవ్వకుండా ఉండడం ఉత్తమం.



Click it and Unblock the Notifications