Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
చనుబాలు పుష్కలంగా రావాలంటే ఈ ఆహారాలు తినండి, రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది
బిడ్డలకు తల్లి పాలు చాలా ముఖ్యం. ఇందులో పోషకాల వల్ల బిడ్డ ఎదుగుదల ఆశించినమేర ఉంటుంది. గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదట తల్లి నుంచి వచ్చే మొర్రి పాలు పట్టాలని అంటారు. మొదటి గంటలో వచ్చే చనుబాలు బిడ్డ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా తోడ్పడతాయి.
అలాగే బిడ్డకు కనీసం సంవత్సరం పాటు పాలు పట్టాలని అంటారు పెద్దలు. ఇతర ఆహార పదార్థాలతో అందని పోషకాలు, బిడ్డకు తల్లి పాల ద్వారా అందుతాయి. అయితే కొంత మంది తల్లులకు పాలు సరిపడా రావు. అలాంటి వారు కొన్ని రకాల ఆహారాలు తింటే చనుబాలు పెరుగుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

బిడ్డకు 6 నెలలు వచ్చిన తర్వాత పోషకాహారం తినిపిస్తూ పాలు పట్టాలి. దీని వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. తల్లిపాలు శిశువుకు ఎంతో ఆరోగ్యకరమైనవి. ఏ శిశువుకైనా తల్లి చనుబాలు మించిన పౌష్టికాహారం మరొకటి ఉండదు. బిడ్డలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు కూడా తల్లి పాలు చక్కగా ఉపయోగపడతాయి. ఇది తల్లి చనుబాలతోనే లభిస్తుంది. చనుబాలు శిశువుకు శక్తిని అందించడమే కాకుండా తేలకగా జీర్ణమై శిశువు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
తల్లుల్లో చనుబాలు పెరగడానికి కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. చనుబాలను పెంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఓట్ మీల్
పాలిచ్చే తల్లులు ఓట్స్ ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. పాలలో కలిపి తీసుకోవచ్చు. బిస్కెట్లు లేదా ఇతర అల్పాహారం లాగా కూడా ఓట్స్ ను తీసుకోవచ్చు. ఓట్ మీల్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులకు ఐరన్ చాలా ముఖ్యం. అర కప్పు ఓట్స్ లో దాదాపు 2 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. పాలిచ్చే తల్లులకు రోజూ 20 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం.
వెల్లుల్లి
వెల్లుల్లిలోని పోషకాలు కూడా పాల సరఫరాను పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. లవంగాలు, జీలకర్ర కూడా కలుపుకోవాలి. భారతీయ వంటకాల్లో వెల్లుల్లి, జీలకర్ర, లవంగాలు ఎక్కువగానే తీసుకుంటాం. మరింత మొత్తం పెంచితే లాభదాయకంగా ఉంటుంది.
మెంతులు
మెంతులు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ హార్మోన్ గర్భిణీ స్త్రీలలో పాల ఉత్పత్తిని కలగజేస్తుంది. ఆహారంలో సరైన మోతాదులో మెంతులు తీసుకోవడం ద్వారా చనుబాలు మెరుగుపాతియ
మాంసం
మటన్, చికెన్ లాంటివి తీసుకుంటే తల్లుల్లో పాలు పెరుగుతాయి. మాంసంలోని ప్రోటీన్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి పాల సరఫరాకు తోడ్పడతాయి.
ఫెన్నెల్ సీడ్స్
సోంఫ్ విత్తనాల్లో కూడా మెంతుల్లో ఉన్నట్లుగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications