Latest Updates
-
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది?
పిల్లలకు ప్రతిరోజూ చాక్లెట్లు ఇస్తున్నారా.. అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
చాలా మంది చిన్న పిల్లలకు చాక్లెట్లు, ఐస్ క్రీంలు అంటే చాలా ఇష్టం. ఐస్ క్రీం వల్ల జలుబు చేస్తుందని ఎక్కువ మంది చాక్లెట్లు ఇస్తుంటారు. వీటి వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, అలాగే ఫేస్ కూడా గ్లో అవుతుందని పిల్లలకు ఇవ్వడంతో పాటు వారు కూడా తింటారు. అయితే నిజంగానే చాక్లెట్లు చిన్న పిల్లల ఆరోగ్యానికి మంచివా కాదా అనేది మాత్రం చాలా మందికి తెలియదు. చాక్లెట్ల వల్ల పిల్లలో కలిగే లాభ, నష్టాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చాక్లెట్లు తినడం వల్ల కలిగే లాభాలు:
ఎనర్జీ ఇస్తాయి:
నీరసంగా ఉన్నప్పుడు చాక్లెట్లు తినడం వల్ల కాస్త ఎనర్జీ వస్తుంది. అలాగే చాక్లెట్లలో పిల్లలకు కావాల్సిన విటమిన్లు చాలా ఉంటాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్లు జ్ఞాపకశక్తిని పెచండంతో పాటు ముఖం కాంతివంతంగా మారేందుకు సహాయపడుతుంది.

మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది:
చాక్లెట్ల ఉత్పత్తికి వాడే కోకోపౌడర్ లో కొన్ని ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇన్ ఫ్లమేషన్ ను నివారించడం, యాంటీ ఆక్సిడెంట్లను పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రక్తం గడ్డకట్టే లక్షణాలను మెరుగు పరుస్తుంది. ఇన్సులిన్ సెన్సివిటీని పెంచి మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి:
కోకో పౌడర్ లో ఉండే ఫ్లేవనాయిడ్లు రెడ్ వైన్ తయారు చేసే కొన్ని పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్లను పోలి ఉంటుంది. గ్లాసు రెడ్ వైన్ తాగితే గుండెకు మంచిదని వైద్యులు చెబుతుంటారు. అలాగే చాక్లెట్లు కూడా మీ చిన్నారుల గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆరోగ్యానికి మంచివి:
డార్క్ చాక్లెట్లలో సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ మరియు అనేక ఇతర ఖనిజాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చాక్లెట్లు పిల్లల ఆరోగ్యానికి మంచివి.
చాక్లెట్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్:
నిద్రలేమి:
చాక్లెట్లులో ఉండే కెఫిన్ పదార్థం చిన్న పిల్లలో నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. ఎక్కువగా చాక్లెట్లు తింటే రాత్రంతా పిల్లలు పడుకోరు.
అలెర్జీ వచ్చే అవకాశాలు:
అప్పుడప్పుడే తినే చాక్లెట్లను అలవాటుగా చేసి ఎక్కువ మోతాదులో ఇస్తే మాత్రం పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది.
పిల్లల్లో అలెర్జీ ఉంటే చాక్లెట్లను అవాయిడ్ చేయడమే మంచిది. చాక్లెట్లలో పాలు, గింజలు, ఇతర పదార్థాలు కూడా కలుపుతుంటారు. ఇలాంటి వాటి వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మూత్రం ఎక్కువగా వస్తుంది:
చాక్లెట్లలో ఉండే కెఫిన్ తరచుగా పిల్లలు టాయిలెట్ కు వెళ్లేలా చేస్తుంది. ఎక్కువగా తింటే తరచుగా వాళ్లు ప్యాంటు తడిపేసే ఛాన్స్ ఉంది.
అలవాటుగా మారొచ్చు:
చాక్లెట్లు తినడం ఒక్కసారి అలవాటు అయిందంటే అది వ్యసనంగా మారేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టదు. అప్పుడు పిల్లలను మీరు చాక్లెట్లు తినకుండా ఆపలేరు. ఏడ్చి అయినా సరే వాళ్లు దాన్ని సాధించుకుంటారు.
బరువు పెరుగుతారు:
చాక్లెట్ లో కూడా చాలా కొవ్వు ఉంటుంది. కోకో బటర్, ఇతర పదార్థాల వల్ల లావుగా తయారవుతారు. వ్యాయామం లేని జీవనశైలి వల్ల పిల్లల్లో ఊబకాయం విపరీతంగా పెరుగుతుంది. సో జాగ్రత్త.



Click it and Unblock the Notifications