Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ప్రతి తల్లి చేస్తున్న తప్పు ఇదే.. పిల్లలకు పాలతో పాటు ఇవి అస్సలు పెట్టకూడదు, చాలా డేంజర్!
పాలు అత్యంత పౌష్టికమైన ఆహారంగా పరిగణించబడతాయి. అందుకే ప్రతిరోజూ పిల్లలకు పాలు తపిస్తూ ఉంటారు. రోజూ ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు అందుతాయి. ఈ పోషకాలు పిల్లల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వారు ఎదగడంలో సహాయపడతాయి. అలాగే, పాలు పిల్లల ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరుస్తాయి. అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. పాలలో ఉండే విటమిన్ డి, శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన పోషకంగా పనిచేస్తుంది. పిల్లల దంతాల ఆరోగ్యాన్ని కూడా పాలు పెంచుతాయి. అయితే, పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి? పిల్లలకు పాలతో కలిపి ఎలాంటి ఆహరం ఇవ్వకూడదు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాలు తాగిన తర్వాత ఇవ్వకూడని ఆహారాలు:
ఉప్పు, కారం కలిగిన స్నాక్స్
పిల్లలు పాలు తాగనని మారం చేసినప్పుడు తల్లిదండ్రులు వారికి ఇష్టమైన చిరుతిండిని పాలతో కలిపి ఇవ్వాలని చూస్తారు. అయితే, చిప్స్, కుర్కురే వంటి ఉప్పు, కారం కలిగిన ఆహారాలు పాలతో కలిపి ఇవ్వడం ఆరోగ్యానికి హానికరం. ఇవి జీర్ణ వ్యవస్థకు హాని కలిగించవచ్చు. అలాగే పిల్లల్లో జీర్ణ సమస్యలు, పేగు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

పుల్లని పండ్లు
సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్) పాలతో కలిపి తినడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ పండ్లలో యాసిడ్ ఎక్కువ ఉండటంతో, పాలు జీర్ణం కావడం కష్టం అవుతుంది. ఈ కాంబినేషన్ వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి సమస్యలు రావచ్చు.
ద్రాక్ష
పాలు తాగిన తర్వాత ద్రాక్ష తీసుకోవడం కూడా మంచిది కాదు. ద్రాక్షలో ఉన్న విటమిన్ సి మరియు ఫ్రూట్ యాసిడ్ పాలలో ఉన్న ప్రోటీన్‌తో కలిసినప్పుడు జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
పుచ్చకాయ
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది, ఇది పాలు జీర్ణం కావడాన్ని కష్టతరం చేస్తుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల కడుపు నొప్పులు, విరేచనాలు రావొచ్చు.
నాన్ వెజ్
పిల్లలు నాన్ వెజ్ తిన్న తర్వాత పాలు తాగడం అనారోగ్యానికి దారితీస్తుంది. పాలు మరియు నాన్ వెజ్ జీర్ణమయ్యే ప్రక్రియ భిన్నంగా ఉండటం వల్ల, ఈ కాంబినేషన్ వలన టాక్సిన్స్ ఏర్పడవచ్చు. దీని కారణంగా కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి ఆరోగ్య సమస్యలను నివారించేందుకు, పాలు తాగిన తర్వాత పైన పేర్కొనబడిన ఆహారపదార్థాలు పిల్లలకు ఇవ్వకపోవడం మంచిది.



Click it and Unblock the Notifications