Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ భార్య గర్భం దాల్చిందా? ఇలా సురక్షితంగా, ప్రేమగా చూసుకోండి
తల్లి కావడం అనేది ప్రతి మహిళ జీవితంలో అపురూపమైన అనుభూతి. ఈ మధుర క్షణం కోసం చాలా మంది ఎంతో కాలంగా ఎదురుచూస్తుంటారు. ఓ కొత్త వ్యక్తి కోసం భార్యాభర్తలతో పాటు ఇరు కుటుంబాలు, బంధు మిత్రులు ఆత్రుతగా ఉంటారు. అయితే గర్భం దాల్చిన సమయం నుంచి మహిళ శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి.
గర్భం దాల్చిన మహిళకు భర్త నుంచి, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో సహకారం అవసరం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా కనిపిస్తుండేవి. ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా, కుటుంబ కలహాల వల్ల వేరు కాపురం పెడుతున్నారు.

అలాంటి సమయంలో భార్య గర్భం దాలిస్తే భర్త మరింత శ్రద్ధగా తీసుకోవాలి. తన బాధ్యతలు పెరుగుతాయని, పెరిగాయని గుర్తించి నడుచుకోవాలి. గర్భిణీకి అన్ని సపర్యలు చేయడంతో పాటు ప్రేమనూ పంచి పెట్టాలి. గర్భం దాల్చిన సమయంలో భార్యలను భర్తలు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గొడవలు అస్సలే వద్దు:
గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం అయ్యేంత వరకు గర్భిణీతో గొడవలు పడకూడదు. అది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భార్యతో గొడవ పడితే అది ఆందోళన, ఒత్తిడిని కలిగిస్తుంది. గర్భంలోని శిశువు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
మానసిక మద్దతు ఇవ్వాలి:
గర్భధారణ సమయంలో మహిళల మానసిక స్థితి వేరుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వారికి మానసిక మద్దతు చాలా అవసరం. ఈ సమస్యను కుటుంబ సభ్యుల కంటే కూడా భర్త చక్కగా పరిష్కరించగలడు. రోజూ అలా కాసేపు వాకింగ్ కు వెళ్లడం, దగ్గర్లోని పార్కుకు వెళ్లి కాసేపు మాట్లాడుకోవడం లాంటి పనులతో మానసికంగా ఉపశమనం లభిస్తుంది.
ప్రేమ పంచాలి:
గర్భధారణ సమయంలో భార్యను సురక్షితంగా చూసుకోవడం భర్త కర్తవ్యం. తల్లి ఆనందం పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో, భర్త తన భార్య చిన్న చిన్న కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నించాలి. వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేయాలి. భార్యను సంతోషంగా చూసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాలి. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది.
అవసరాలు తెలుసుకుని, తీర్చాలి:
గర్భధారణ సమయంలో మహిళలకు భర్త మద్దతు చాలా అవసరం. గర్భం ధరించిన తర్వాత భార్యలకు కొన్ని అవసరాలు పెరుగుతాయి. అవేంటో తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నించాలి. అలా చేయడం ద్వారా భర్తలు, భార్యల మధ్య సంబంధం బలంగా మారుతుంది.
ఒంటరిగా ఉండొద్దు:
గర్భధారణ సమయంలో భార్యలను ఒంటరిగా ఉండనివ్వకూడదు. వారికి తోడుగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అది ప్రతి భర్త బాధ్యత. కొన్ని కొన్ని సార్లు తన పనులు తాను చేసుకోలేని పరిస్థితిలో తోడుండే వారు చేసి పెడతారు. అలాగే నెలలు నిండిన గర్భిణీ వద్ద ఎప్పుడూ తోడుగా ఉండాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications