Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ లక్షణాలుంటే ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయినట్టే..! ప్రెగ్నెన్సీ కిట్ కూడా అవసరం లేదు..!
భార్యా భర్తలు కలిసిన తరువాత ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా తెలుసునేందుకు ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోనవసరం లేదు. కొన్ని లక్షణాలు ప్రెగ్నెన్సీ వున్న విషయాన్ని మనకు ముందుగానే తెలుపుతాయ్. అలాంటి లక్షణాలేవో మనము ముందుగానే తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే కొన్ని జాగ్రత్తలు వెంటనే తీసుకోవాలి కాబట్టి ఆ లక్షణాలు ఏంటో మనము తెలుసుకుందాం. 14 లేదా 15 రోజులకు అండం తయారవుతుంది. ఆ సమయంలో భార్యా భర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అమాంతంగా పెరిగిపోతాయ్. 18 రోజుల తరువాత విపరీతమైన లక్షణాలు మనకు కనిపిస్తాయ్. దాని తరువాత రొమ్ము చాలా బరువుగా అనిపిస్తుంది. పీరియడ్ డేట్ వచ్చే సమయానికి ఈ లక్షణాలు, నొప్పులు తగ్గుకుంటూ వస్తాయ్.

శరీరం బాగా అలసిపోయినట్టు, రొమ్ము బరువుగా అనిపించడం మొదటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. 20 నుంచి 25 రోజుల మధ్య ఇంప్లాంటేషన్ జరుగుతుంది. ఇంప్లాంటేషన్ అంటే పిండం గర్భసంచిలోపలికి వెళ్లి అతుక్కుపోతుంది. దీని తరువాత మూడ్ చేంజస్, తీవ్రమైన తలనొప్పిగా అనిపిస్తుంది. కొన్ని రకాలు రుచులను బాగా తినాలని అనిపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలను, పళ్లను అస్సలు తినాలని అనిపించదు. కొన్ని రకాల ఆహారాలను తిన్నప్పుడు వాంతులు రావడం, వికారం, ఇష్టం లేకపోవడం కలుగుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఓవ్యూలేషన్ సమయంలో వైట్ డిశ్చార్జ్ చాలా థిక్‌గా వైట్‌గా వుంటుంది. దాని తరువాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతూవున్నప్పుడు ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్ రెండు హార్మోన్ల స్థాయి ఎక్కువగా వుంటాయ్ కాబట్టి ఇంకొంచం పలచబడి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ నార్మల్‌గా కన్నా కొంచెం ఎక్కువగా వుంటుంది. ఇది హార్మోన్ల ఎఫెక్ట్ వల్ల వుంటుంది. లాక్టోవిసిలై లాంటి హెల్తీ బ్యాక్టీరియా వుంటుంది కాబట్టి అది రక్షణగా పనిచేస్తుంది. కొత్త కొత్త ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. అందుకే వైట్ డిశ్చార్జ్‌ని నార్మల్‌గా కన్నా కొంచెం ఎక్కువగా చూస్తాం.

మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్లాలని అనిపించడం సాధారణ విషయంగా చెప్పుకోవచ్చు. గర్భసంచి బరువు పెరుగుతూ యూరిన్ బ్లాడర్ మీద పడ్డం ద్వారా బ్లాడర్ మీద ఒత్తడి పడి తరచుగా యూరిన్ అవుతుంది. హార్మోన్ల ప్రభావం వల్ల యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా వుండడాన్ని మనం చూస్తుంటాం. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ల వల్ల స్మూత్ కండరాలు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోతాయ్. దీని వల్ల పేగుల కదలికలు తగ్గిపోతాయ్. ఇది మలబద్దకానికి దారి తీస్తుంది. తీసుకున్న ఆహారం కూడా సరిగ్గా అరగకుండా కడుపు ఉబ్బరంగా అనిపించడం కూడా అవుతుంది.
పై లక్షణాలన్నీ ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అవకముందే మనకు కనిపిస్తాయ్. ఈ అన్ని లక్షణాలు గనుక వుంటే కచ్ఛితంగా ప్రెగ్నెన్సీ వచ్చినట్టే. అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చిన వారు రెస్ట్ తీసుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ప్రెగ్నెన్సీ జర్నీ సంతోషంగా సాగిపోతుంది.
ప్రెగ్నెన్సీ ప్రధాన లక్షణాలను మరొక్కసారి గమనిస్తే బాగా అలసటగా అనిపించడం, రొమ్ములు బరువుగా అనిపించడం, అండం గర్భసంచిలో అతుక్కున్న సమయంలో కొంచెం రక్తస్రావం జరుగుతుంది. ఆ రక్తస్రావం కనిపించడం. వాంతులు రావడం, తలనొప్పి, మూడ్ చేంజెస్ రావడం, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా వుండడం, సాధారణం కంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వుండడం, మలబద్దకం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఇవన్నీ ప్రెగ్నెన్సీ లక్షణాలుగా మనం అర్థం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications