Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
హాలిడేస్ తర్వాత పిల్లల్ని మళ్లీ స్కూళ్లకు ఎలా అలవాటు చేయాలా అని హైరానా పడుతున్నారా?
ఇన్నాళ్లూ వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఇంట్లోనే ఉంటూ హాయిగా గడిపేశారు. అమ్మమ్మలు, నానమ్మలు, బంధువుల ఇళ్లకు, వెకేషన్లు అంటూ అంతా తిరిగేశారు పిల్లలు. ఇక బడికి వెళ్లే సమయం ఆసన్నమైపోయింది. కానీ ఇంతకాలం ఫుల్లుగా ఎంజాయ్ చేసిన పిల్లలు మళ్లీ బడికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. సమ్మర్ లో లేటుగా లేవడం, ఇష్టం వచ్చిన చోట్లకు వెళ్లడం, తినడం, తిరగడం చేసుంటారు.
ఇప్పుడు పొద్దునే లేచి బడికెళ్లు, చదువుకో అంటే అలవాటు పడేందుకు ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులను కూడా కాస్త టెన్షన్ పెట్టేస్తుంటారు. అయితే పిల్లలు చక్కగా బడికి అలవాటవ్వాలంటే మీరు ఇలా చేయడం మంచిదని పలువురు నిపణులు సూచిస్తున్నారు. అయితే అవేంటో చూసేద్దామా.

1. టైం టేబుల్ సెట్ చేయాలి:
పిల్లలు బడికి అలవాటు అవ్వాలంటే ముందుగా టైం సెట్ చేయాలి. నిద్ర లేవడం, రెడీ అవ్వడం, ఆడుకోవడం, హోంవర్క్ చేయడం, కుటుంబ సభ్యుల కోసం కాస్త సమయం.. ఇలా వాళ్లు చేసే కార్యకలాపాలన్నింటికీ టైం కేటాయిస్తూ టైం టేబుల్ సెట్ చేయాలి. ఇలా చేస్తే దాన్ని చూసి ఫాలో అయిపోతూ త్వరగా బడికి అలవాటు పడిపోతారు. ఒక నెలరోజులు ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటే చాలా మంచిది.
2. చేయాల్సిన పనుల జాబితా తయారు చేయాలి:
మీ పిల్లలు చేయాల్సిన పనుల జాబితాను తయారు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పుస్తకాలు, నోట్‌బుక్‌లు.. ఇలా ఇంటికి తీసుకురావాల్సి ప్రతి దాని గురించి రాయమని చెప్పారు. ఈ జాబితా మీ పిల్లలు.. పాఠశాలకు వెళ్లేందుకు రోజూ తీసుకెళ్లాల్సిన ప్రతి దాన్ని గుర్తు చేయడంలో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల మీ బిడ్డ బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగడానికి వీలుంటుంది.
3. వాళ్లకేం కావాలో వాళ్లనే సెలెక్ట్ చేసుకోనివ్వాలి:
మీ పిల్లలకు అవసరమైన పాఠశాల సామాగ్రి, పుస్తకాలు, బూట్లు, యూనిఫారాల జాబితాను ముందుగానే రూపొందించుకోవాలి. పిల్లలతో సహా షాపింగ్ వెళ్లి.. వారికేం కావాలో వారినే సెలెక్ట్ చేసుకోనివ్వాలి.
4. చదువే కాదు మిగిలినవీ ముఖ్యమే:
బడికి వెళ్లేకంటే ముందు అంటే ఉదయం, బడి నుంచి తిరిగి వచ్చాక ఖాళీ సమయాల్లో వారేం చేయాలనుకుంటున్నారో ముందుగా వారినే అడగాలి. ఆటలు, పాటలు, డ్యాన్సులు, ఏమైనా సంగీత వాయిద్యాలు వాయించడాన్ని ఇష్టపడితే ఆ తరగతుల్లో జాయిన్ చేయడం చాలా ముఖ్యం.
5. ఆరోగ్యకరమైన ఆహారం
అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం ఇచ్చి పిల్లలను బడికి పంపాలి. అది వారి శారీరక, మానసిక బలాన్ని మరింత బలపరుస్తుంది. వారు ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చేందుకు ప్రిఫర్ చేయాలి.
కొత్త విద్యా సంవత్సరానికి పిల్లలను అలవాటు చేయడం కాస్త కష్టమే అయినప్పటికీ.. పైన చెప్పినవన్నీ ఫాలో అయితే త్వరగా అలవాటు పడిపోతారు. అలాగే స్కూళ్లో వారు సాధించిన విజయలాను సెలబ్రేట్ చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications