Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Parenting: పిల్లలకు చదువుతో పాటు ఇవి నేర్పిస్తేనే జీవితంలో సక్సెస్ అవుతారు! లేకపోతే అంతే?
ఈరోజుల్లో పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. పిల్లలను అర్ధం చేసుకొని వారిని సరైన దారిలో పెంచాలంటే తల ప్రాణం తోకకు వచ్చేస్తుంది. ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు వారిని వదిలేయడం, వారిని దండించడం వంటివి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగినప్పటి నుంచి పిల్లలకు ఉండాల్సిన కనీస అలవాట్లు, కనీస తెలివితేటలు కూడా లేకుండా పోతున్నాయి. పిల్లలు రీల్స్ చూసి అందులో లాగానే జీవించాలని అనుకోవడం, వాటినే అనుసరించడం వంటివి చేస్తున్నారు. ఇది వారి మెదడుపై ప్రభావం చూపుతుంది.
అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తల్లిందండ్రులు తమ తమ పిల్లలకు కొన్ని విషయాలను నేర్పించాలి. ఆ విషయాలే రేపు వారు సమాజంలో ఉత్తములుగా జీవించేందుకు దోహదపడతాయి. ఆ విషయాలే వారి ఎదుగుదలకు, వారి విజయానికి కారణమవుతాయి. ఇంతకీ ఆ విషయాలేంటి? ఏ విధంగా వారికి నేర్పించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కృతజ్ఞత చెప్పడం
పిల్లలను కృతజ్ఞతా భావంతో పెంచాలి. ఎవరైనా వారికి సహాయం చేసేటప్పుడు వారికి కృతజ్ఞత చెప్పడం నేర్పించాలి. అలాగే ఇతరుల పట్ల కృతజ్ఞత భావంతో జీవించే విధంగా వారిని ప్రేరేపించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో మంచితనం అనేది పెరుగుతుంది. వారిని చూసినప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా ప్రశంసిస్తారు. జీవితంలో ఉన్నత స్థానాలను ఎదిగేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.
దయ
పిల్లలు చాలా అమాయకులు. వారిని ఏ విధంగా పెంచితే ఆ విధంగానే పెరుగుతుంది. వారికి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. అందుకే వారిని మంచి మార్గంలో పెంచే బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. అందుకే పిల్లలను చిన్నప్పటి నుంచి దయతో ఉండేలా పెంచాలి. మనుషులతో పాటు జంతువులు, మొక్కల పట్ల కూడా దయతో మెలిగే విధంగా ప్రేరేపించాలి. అలా చేయడం వల్ల వారు జీవితంలో ఎలాంటి తప్పులు చేసే అవకాశం ఉండదు. అలాగే వారిలోని మంచితనం వారిని రక్షిస్తుంది.
ఏకాగ్రత
ప్రస్తుత కాలంలో పిల్లందరూ తమ విషయాల్లో ఏకాగ్రతను పెంచుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. అందుకే పిల్లలు ఏకాగ్రతతో ఉండే విధంగా తల్లిదండ్రులు వారిని పెంచాల్సిన అవసరం ఉంది. ఏకాగ్రతతో ఉండే విధంగా పెంచినప్పుడే వారు తమ చదువులతో పాటు జీవితంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది. ఎలాంటి పనినైనా పూర్తి చేసే ఛాన్సుంటుంది.
క్షమాపణ చెప్పడం
ప్రస్తుతం ఉన్న పిల్లల్లో క్షమాపణలు చెప్పే గుణం ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా ప్రభావమో, తాము పెరిగిన జీవన విధానం కారణమో తెలియదు కానీ, ప్రతి ఒక్కరూ తమకు తామే హీరోలు అని అనుకుంటూ ఉన్నారు. ఇలా ఉండకుండా ఉండాలంటే పిల్లలను క్షమాగుణంతో పెంచాలి. తప్పు చేసినప్పుడు క్షమాపణలు చెప్పే అలవాటును నేర్పించాలి. ఇతరుల పట్ల దయ, ప్రేమ ఉన్న వ్యక్తులే క్షమిస్తారని నేర్పించాలి. అప్పుడే వారు సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు.
ఆధ్యాత్మిక అలవాటు చేయాలి
చిన్న పిల్లలకు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు. మన సంప్రదాయాలు మన ఆధ్యాత్మికత పట్ల వారికి అవగాహన ఉండదు. అందుకే వారు తప్పుడు మార్గంలో వెళ్తుంటారు. అందుకే వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారికి ఆధ్యాత్మికత అలవాటు చేయాలి. వారికి ఆధ్యాత్మికత పట్ల అవగాహనా కల్పించాలి. మన సంప్రదాయాలు, మన అలవాట్లు, మన సంస్కృతిని నేర్పించాలి. అప్పుడే వారు సరైన మార్గంలో పెరిగే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications