Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
చలికాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.. వైద్యులు ఏం చెప్పారంటే?
చలికాలం మొదలైంది. ఈ చలికాలంలో ఇంట్లోని పిల్లలపై పెద్దలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చలికాలంలో పిల్లలకు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారిపై ప్రత్యేకమైన ద్రుష్టి సారించాల్సి ఉంటుంది. ప్రధానంగా పొడిచర్మం, అలర్జీ, జలుబు, దగ్గు, గొంతు అలర్జీ ఇలా పలు రకాల వ్యాధులు పిల్లలను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది.
చలికాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఏ విధమైన టిప్స్ పాటించాలి, వైద్యులు ఏం చెప్తున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చలికాలంలో శిశువు ఆరోగ్యానికి నిపుణుల చిట్కాలు
న్యుమోనియా ఉంటే, వాయు కాలుష్యం, ధూమపానం మరింత ప్రమాదకరం అవుతుంది. న్యుమోనియాతో బాధపడుతున్న పిల్లలను వాయు కాలుష్యం, ధూమపానం వంటి సైడ్ వెళ్లనివ్వకూడదని, వైద్యులు సూచిస్తున్నారు.

పిల్లలను వీలైనంత వెచ్చగా ఉంచాలి
శీతాకాలంలో పిల్లలను వీలైనంత వెచ్చగా ఉంచడానికి ప్రయత్నించండి. చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే బట్టలను వారికి తొడిగించాలి. పిల్లలు తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటే, తడి బట్టలు కూడా సమస్యలను కలిగిస్తాయి. అందుకే వారు మూత్ర విసర్జన చేసేటప్పుడు బట్టలను మార్చుకుంటే పిల్లలు ప్రశాంతంగా పడుకుంటారు. అలాగే పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
స్నానం చేయించడం..
చలికాలంలో పసిపిల్లలకు ఉదయం 10 గంటలకు ముందు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత స్నానం చేయడం మంచిది కాదు. ఉదయం పది గంటల ముందు లేదా సాయంత్రం అయిదు గంటల తరువాత వేడి నీళ్లతో స్నానం చేయించడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారికి మధ్యాహ్నం ఎండ ఉండే సమయంలో స్నానం చేయించడం మంచిది. దీని వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఉత్సాహంగా ఉంటారు.
పొగమంచులో తిప్పకూడదు
చలికాలంలో పొగమంచు పడుతూ ఉంటుంది. దీని వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. అందుకే చలికాలంలో ఉదయం లేదా సాయంత్రం పొగమంచు కురిసే సమయంలో పిల్లలను బయటికి తీసుకెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అలాగే ఈ చలికాలంలో పిల్లలకు చలిని కలిగించే ఆహరం లేదా పానీయాలు ఇవ్వకపోవడం మంచిది.
నేలపై సాక్స్ లేకుండా ఉంచకూడదు..
చలికాలంలో చిన్న పిల్లలను ఒంటరిగా నేలపై ఉంచకూడదు. మధ్యాహ్నానికి ఎండగా ఉన్నా నేల మాత్రం చల్లగా ఉంది. కాబట్టి కాళ్లకు సాక్స్, మంకీ క్యాప్, కాటన్ క్లాత్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పిల్లలకు కావాల్సిన వెచ్చదనాన్ని అందించడంతో పాటు మీ పిల్లాడి శరీరం ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఉంటుంది. తద్వారా ఎలాంటి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యకరంగా పిల్లలు ఉండగలుగుతారు.
సరైన మందులు, చికిత్స అవసరం
పిల్లల విషయంలో ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలో సాధారణం కంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు అనారోగ్యం బారిన పడినట్లు కనిపిస్తే వారిని తక్షణమే వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా కాదని పిల్లల విషయంలో హోమ్ రెమిడీలను పాటించకూడదు. సరైన సమయంలో మందులు, చికిత్స అందించాలి. అలాంటప్పుడే వారు ఇతర రోగాల బారిన పడకుండా ఉండగలుగుతారు.
చర్మంపై బేబీ క్రీమ్ ఉపయోగించాలి..
చలికాలంలో చిన్న పిల్లల చర్మం చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. చాలా తొందరగా పొడి బారడం, చర్మంపై అలర్జీ వంటి సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. కాబట్టి చర్మంపై బేబీ చర్మం పాడవకుండా ఉండడానికి సరైన బేబీ క్రీమ్ రాయాలి. పెద్దల కోసం కొనుగోలు చేసిన క్రీమ్‌ను పిల్లలకు రాయకూడదు. ఈ టిప్స్ పాటించడం వల్ల చలికాలంలో పిల్లలను సురక్షితంగా ఉంటారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం మీకు సమాచారం మాత్రమే అందిస్తున్నాం. దీనిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. బోల్డ్ స్కై తెలుగు ఏ మాత్రం బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications